ఆసియా గేమ్స్‌లో ఓట‌మి.. నిర్వాహ‌కుల‌ను ఏకిపారేసిన పీవీ సింధు | Sindhu-Criticizes-Asian-Games-Badminton-Scheduling-After-Match Lost | Sakshi
Sakshi News home page

ఆసియా గేమ్స్‌లో ఓట‌మి.. నిర్వాహ‌కుల‌ను ఏకిపారేసిన పీవీ సింధు

Sep 27 2026 4:39 PM | Updated on Sep 27 2026 5:08 PM

Sindhu-Criticizes-Asian-Games-Badminton-Scheduling-After-Match Lost

Photo Credit: Twitter

ఆసియా గేమ్స్‌లో ప‌త‌కం సాధిస్తుంద‌నుకున్న భార‌త స్టార్ ష‌ట్ల‌ర్ పీవీ సింధు నిరాశ‌ప‌రిచింది. ఆదివారం జ‌రిగిన మ‌హిళ‌ల సింగిల్స్ క్వార్ట‌ర్ ఫైన‌ల్లో చైనాకు చెందిన చెన్ యుఫెయ్ చేతిలో సింధు ఓట‌మి చ‌విచూసింది. అయితే మ్యాచ్ ముగిసిన అనంత‌రం ఆసియా గేమ్స్ నిర్వాహ‌కుల‌పై పీవీ సింధు అసంతృప్తి వ్య‌క్తం చేసింది. అడ్డ‌దిడ్డంగా మ్యాచ్‌ల‌ను నిర్వ‌హించ‌డంపై నిర్వాహ‌కుల‌ను ఏకిపారేసింది.

"24 గంట‌ల వ్య‌వ‌ధిలో మూడు సింగిల్స్ మ్యాచ్‌లు ఆడాల్సి వ‌చ్చింది. మేము మ‌నుషుల‌మే.. రోబోలు కాదు. సుదీర్ఘమైన మ్యాచ్‌లు జ‌రిగిన‌ప్పుడు క‌చ్చితంగా కోలుకోవ‌డం అవ‌స‌రం. ఆట‌లో మంచి స్థితిలో ఉన్న‌ప్పుడు స‌హ‌జంగానే ముందుకు క‌ద‌లాల‌నిపిస్తుంది, కానీ అల‌స‌ట‌తో కాళ్లు క‌ద‌ల‌వు.

అసలు మ్యాచ్‌ల షెడ్యూల్ ప్ర‌ణాళిక‌ను స‌రిగ్గా నిర్వ‌హించ‌లేదు. దీంతో స‌రైన విశ్రాంతి లేకుండానే మ్యాచ్‌లు ఆడాల్సి వ‌స్తుంద‌ని, దీనివ‌ల్ల పూర్తిగా అల‌సిపోతున్నాం. నా ఓటమికి కార‌ణాలు వెత‌క‌ను. ఇక్కడ కెమెరాలు లేవు. ఇది నిజంగా దురదృష్టకరం. కొన్ని 2-3 షాట్లు లైన్ పై ఉన్నాయని నాకు అనిపించింది. ఏషియన్ గేమ్స్ క్వార్టర్ ఫైనల్‌లో కెమెరా ఉండాలి" అని సింధు ఆవేద‌న వ్య‌క్తం చేసింది.

కాగా పీవీ సింధులాగే మ‌రో భార‌త ష‌ట్ల‌ర్ ఉన్న‌తి హుడా కూడా మ్యాచ్‌ల నిర్వ‌హ‌ణ‌పై అసంతృప్తి వ్య‌క్తం చేసింది. ఇక పీవీ సింధు శ‌నివారం రెండు సింగిల్స్ మ్యాచ్‌లు ఆడింది. ఆ త‌ర్వాత ఆదివారం మ‌రో మ్యాచ్ ఆడాల్సి వ‌చ్చింది. క‌నీస విశ్రాంతి లేకుండానే బ‌రిలోకి దిగ‌డం వ‌ల్ల సింధు కోర్టులో అల‌స‌ట‌గా క‌నిపించడం గ‌మ‌నార్హం.

ఆదివారం ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో మూడు పతకాలు వచ్చి చేరాయి. స్వ్కాష్‌లో అనాహత్‌, అభయ్‌లు రజతం నెగ్గగా, మహిళల 200 మీటర్ల రేసులో హరిత కాంస్యం దక్కించుకుంది. ఇప్పటివరకు భారత్‌ ఖాతాలో 33 పతకాలు చేరగా,  ఇందులో 4 స్వర్ణాలు, 14 రజతాలు, 15 కాంస్యాలున్నాయి.

ఇదీ చదవండి: ఏడాది త‌ర్వాత బ‌రిలోకి.. కుమ్ముతాడనుకుంటే ఇలా బుక్కయ్యాడు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement