ఆసియా క్రీడ‌ల్లో ప‌త‌కం.. తరుణ్ మానేపల్లికి సన్మానం | Tarun-Who-Won Bronze-Asian Games-Honoured-By-SATG MD-Soni Baladevi | Sakshi
Sakshi News home page

ఆసియా క్రీడ‌ల్లో ప‌త‌కం.. తరుణ్ మానేపల్లికి సన్మానం

Sep 26 2026 9:53 PM | Updated on Sep 26 2026 9:53 PM

Tarun-Who-Won Bronze-Asian Games-Honoured-By-SATG MD-Soni Baladevi

Photo Credit: Twitter

హైదరాబాద్, సెప్టెంబర్ 26: ఆసియా క్రీడలు–2026లో పురుషుల బ్యాడ్మింటన్ విభాగంలో కాంస్య పతకం సాధించి తెలంగాణతో పాటు దేశానికి గర్వకారణంగా నిలిచిన యువ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు తరుణ్ మానేపల్లిని తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ (SATG) వైస్ చైర్‌పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఎ. సోనీబాలా దేవి, ఐఎఫ్‌ఎస్ శనివారం ఘనంగా సన్మానించారు. 

ఈ సందర్భంగా డాక్టర్ సోనీబాలా దేవి మాట్లాడుతూ, ఆసియా క్రీడల్లో పతకం సాధించడం తరుణ్ మానేపల్లి కృషి, అంకితభావం, పట్టుదలకు నిదర్శనమని పేర్కొన్నారు. సరూర్‌నగర్ స్టేడియంలో తన క్రీడా ప్రస్థానాన్ని ప్రారంభించిన తరుణ్, నేడు ఆసియా క్రీడల పతక విజేతగా ఎదిగి తెలంగాణకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడం గర్వకారణమని అన్నారు. 

తెలంగాణ యువ క్రీడాకారులు అంతర్జాతీయ వేదికలపై సాధిస్తున్న విజయాలు రాష్ట్రంలో ఉన్న అపారమైన క్రీడా ప్రతిభకు నిదర్శనమని ఆమె తెలిపారు. క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో మరింత రాణించేలా ప్రపంచ స్థాయి శిక్షణ, ఆధునిక క్రీడా మౌలిక వసతులు, అవసరమైన అన్ని విధాల సహాయ సహకారాలను అందించేందుకు తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ నిరంతరం కట్టుబడి పనిచేస్తోందని స్పష్టం చేశారు. 

ఈ సందర్భంగా తరుణ్ మానేపల్లికి తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి దేశానికి, రాష్ట్రానికి మరింత కీర్తి తీసుకురావాలని ఆకాంక్షించారు. ఇప్పటివరకు భారత్ ఖాతాలో 30 పతకాలు చేరగా, ఇందులో 4 స్వర్ణాలు, 12 రజతాలు, 14 కాంస్యాలున్నాయి. 

ఇదీ చ‌ద‌వండి: 'కోహ్లితో నాకేంటి?.. నా ఆటయితే పూర్తి కాలేదు'

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement