మిసెస్ మామ్ సీజన్ 10 | Mrs Mom Season 10 | Sakshi
Sakshi News home page

మిసెస్ మామ్ సీజన్ 10

Sep 26 2026 9:06 PM | Updated on Sep 26 2026 9:06 PM

Mrs Mom Season 10
  • 10 రోజులు, 7 నగరాలు
  • ఏపీలో 6 నగరాలు, 4 రోజుల పాటు హైదరాబాద్ లో
  • దంపతుల సమగ్ర అనుభవం కోసం ఉచిత వారాంతపు విడిది
  • కిమ్స్ కడల్స్ మరియు డా. శిల్పి రెడ్డి  ఆధ్వర్యంలో
  • తొమ్మిది సీజన్లలో పాల్గొన్న వారిలో 85 శాతం సాధారణ ప్రసవాలు

హైదరాబాద్‌: గర్భిణులు, కాబోయే తల్లిదండ్రులకు గర్భధారణ, ప్రసవం, శిశు సంరక్షణపై అవగాహన కల్పించేందుకు కిమ్స్‌ కడల్స్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘మిసెస్‌ మామ్‌’ కార్యక్రమం 10వ సీజన్‌లోకి అడుగుపెట్టింది. డా. కె. శిల్పి రెడ్డి ఆధ్వర్యంలో క్రయోవివా సహకారంతో ఈ కార్యక్రమాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ఏడు నగరాల్లో నిర్వహించనున్నారు. ‘10 ఇయర్స్‌ ఆఫ్‌ గ్లోయింగ్‌ మదర్స్‌.. గ్రోయింగ్‌ ఫ్యామిలీస్‌’ అనే థీమ్‌తో అక్టోబరు 4 నుంచి డిసెంబరు 6 వరకు కార్యక్రమాలు కొనసాగనున్నాయి.

10 సీజన్ కు సంబంధించిన పోస్టర్ విడుదల కార్యక్రమాన్ని శనివారం కిమ్స్ కడల్స్ కొండాపూర్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మిసెస్ మామ్ కార్యక్రమ రూపకర్త, ప్రముఖ గైనకాలజిస్ట్ డా. కె. శిల్పి రెడ్డి మాట్లాడుతూ ఈ పదో సీజన్, పది రోజుల పాటు ఏడు నగరాల్లో ఈ సీజన్ జరుగుతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లోని ఆరు నగరాలు, హైదరాబాద్ లో నాలుగు రోజుల పాటు ఈ సీజన్ నిర్వహిస్తున్నామని వివరించారు. ప్రతీ గర్భిణీ కూడా సాధారణ ప్రసవం అయ్యేలా చేయడమే తమ ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యమని అన్నారు. 

గత 9 సీజన్లను విజయంవంతగా పూర్తి చేసుకొని ఈ సారి పదో సీజన్ లోకి అడుగు పెడుతున్నామని తెలిపారు. ఈ సారి హైదరాబాద్ తో పాటు మరో ఆరు నగరాల్లో కర్నూలు, విజయవాడ, నెల్లూరు, విశాఖపట్నం, రాజమండ్రి, అనంతపురంలో మిసెస్‌ మామ్‌ కార్యక్రమాలు నిర్వహించనున్నామని తెలిపారు. తొమ్మిది సీజన్లను విజయవంతంగా పూర్తి చేసిన ఈ కార్యక్రమం ద్వారా కాబోయే తల్లిదండ్రులకు గర్భధారణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రసవానికి సన్నద్ధత, శిశు సంరక్షణ తదితర అంశాలపై అవగాహన కల్పించనున్నామని తెలిపారు.

ప్రసూతి, స్త్రీ వైద్యులు, పిల్లల వైద్యులు, పోషకాహార నిపుణులు తదితర రంగాలకు చెందిన వైద్య నిపుణులు కార్యక్రమాల్లో పాల్గొని గర్భిణులు, వారి కుటుంబ సభ్యులకు అవసరమైన సూచనలు అందించనున్నారని పేర్కొన్నారు. గర్భధారణ సమయంలో ఎదురయ్యే సాధారణ సమస్యలు, ప్రసవం, గర్భిణులకు వ్యాయామాలు, యోగా, ఒత్తిడి తగ్గించుకునే పద్ధతులు, తల్లిపాలు, పుట్టిన బిడ్డ సంరక్షణ వంటి అంశాలపై ప్రత్యేక సెషన్లు నిర్వహించనున్నారని వివరించారు. గర్భధారణ అనేది కేవలం వైద్య పరీక్షలకు పరిమితం కాకుండా తల్లి, తండ్రి, కుటుంబ సభ్యుల శారీరక, మానసిక, భావోద్వేగ, ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగాల్సిన ప్రయాణమని తెలిపారు. కాబోయే తల్లిదండ్రులకు సరైన అవగాహన, నమ్మకం కల్పించడమే ‘మిసెస్‌ మామ్‌’ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement