ప్రాణం ఖరీదు.. రూ.26 కోట్లు | Save Aswarth: Hyderabad 4yr Boy need 26 crore rupees injection | Sakshi
Sakshi News home page

Save Aswarth: ప్రాణం ఖరీదు.. రూ.26 కోట్లు

Sep 26 2026 6:16 PM | Updated on Sep 26 2026 7:32 PM

Save Aswarth: Hyderabad 4yr Boy need 26 crore rupees injection

బాలుడి తండ్రితో సీపీ సజ్జనర్‌

4 ఏళ్ల‌ బాలుడికి అరుదైన వ్యాధి

ఇంజక్షన్‌ కోసం తండ్రి తాపత్రయం

మహాగణపతి వద్ద ప్లకార్డుల ప్రదర్శన  

సాక్షి, హైద‌రాబాద్‌: సైంధవ్‌ సినిమాలో హీరో తన కూతురికి ఉన్న అరుదైన మస్కులర్‌ వ్యాధి చికిత్స కోసం కోట్ల ఖరీదైన ఒక్క ఇంజక్షన్‌ ఇప్పించేందుకు అష్టకష్టాలు పడతాడు. అలాంటి ఆరోగ్య సమస్యలే బోరబండలోని ఓ చిన్నారికి వచ్చాయి. శుక్రవారం ఖైరతాబాద్‌ మహాగణపతి నిమజ్జనోత్సవాల్లో తన కుమారుడి వైద్యం కోసం సహకరించాలని ఖైరతాబాద్‌ మహాగణపతి శోభాయాత్రలో ప్లకార్డు ప్రదర్శిస్తూ నిల్చున్నాడు.

బోరబండలో నివాసముండే హరీశ్‌కుమార్, నవ్యవశ్రీ దంపతులకు మొదటి సంతానం అశ్వర్థ్‌ (4).  బాబు అరుదైన డ్యూషెన్స్‌ మ‌స్క్యులార్‌ డిస్ట్రోఫి (డీఎండీ) అనే వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ వ్యాధి తగ్గించేందుకు ఒక్క ఇంజెక్షన్‌ ఇస్తే చాలు. కానీ ఆ ఇంజక్షన్‌ ఖరీదు రూ.26 కోట్లు. సీఏగా పనిచేస్తున్న మధ్యతరగతి తండ్రి అంత ఖరీదైన ఇంజక్షన్‌ను ఇప్పించే స్థోమత లేక దాతలకోసం అర్థిస్తున్నాడు.

కోరిన కోర్కెలు తీర్చే ఖైరతాబాద్‌ మహాగణపతిని దర్శించుకోవాలని ప్లకార్డు ప్రదర్శిస్తూ నిల్చున్నాడు. నిమజ్జనోత్సవాల్లో అక్కడే ఉన్న సీపీ సజ్జనార్‌ అతన్ని మహాగణపతి చెంతకు పిలిచి దర్శించుకునేలా చేశారు. చిన్నారిని కాపాడేందుకు దాతలు ఎవరైనా ఉంటే ఎంతో కొంత సాయం చేయాలని కోరుతున్నారు. దాతలెవరైనా ఉంటే 9700365341@indianbk యూపీఐడీతో సాయం చేయాలని కోరుతున్నారు.

ఇదీ చ‌ద‌వండి: కేన్స‌ర్ గుర్తింపున‌కు మైక్రోవేవ్ సాంకేతిక‌త‌  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement