‘కాళేశ్వరం బ్యారేజీల పనుల పునరుద్ధరణకు ప్రభుత్వం సిద్ధం’ | Minister Uttam reviewed the restoration works of Kaleshwaram barrages | Sakshi
Sakshi News home page

‘కాళేశ్వరం బ్యారేజీల పనుల పునరుద్ధరణకు ప్రభుత్వం సిద్ధం’

Sep 26 2026 6:12 PM | Updated on Sep 26 2026 7:24 PM

Minister Uttam reviewed the restoration works of Kaleshwaram barrages

హైదరాబాద్‌: కాళేశ్వరం బ్యారేజ్‌ల పునరుద్ధరణ పనులకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌ స్పష్టం చేశారు. నవంబర్‌ మధ్య నాటికి మూడు  బ్యారేజ్‌ల పునరుద్ధరణ పనులు ప్రారంభించినున్నట్లు ఆయన తెలిపారు. ఈరోజు(శనివారం, సెప్టెంబర్‌ 26వ తేదీ) హైదరాబాద్‌లోని తన క్యాంపు కార్యాలయంలో కాళేశ్వరం బ్యారేజీల పనుల పునరుద్ధరణపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు ఉత్తమ్‌. 

2027 వర్షాకాలానికి ముందే కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల పనులు పూర్తి చేస్తాం. మూడు బ్యారేజీల పునరుద్ధరణ డిజైన్లను ఖరారు చేశాం.అక్టోబర్‌ 5న సీడబ్ల్యూసీ సాంకేతిక పర్యవేక్షణ కమిటీ ముందుకు డిజైన్లు తీసుకెళ్తాం. పుణేలోని సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌లో డిజైన్లపై శాస్త్రీయ నమూనా పరీక్షలు నిర్వహిస్తాం. 

ఎన్‌డీఎస్‌ఏ అభ్యంతరాలు, నిపుణుల సూచనలను పరిగణనలోకి తీసుకున్నాం. గ్రౌటింగ్‌ ద్వారా మూడు బ్యారేజీల పునాదుల బలోపేతం చేస్తాం. స్టిల్లింగ్‌ బేసిన్ల పొడిగింపు, కొత్త కట్‌-ఆఫ్‌ వాల్స్‌ నిర్మాణం చేపడతాం. పునాదుల స్థిరత్వం, నీటి చొరబాటు నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. సాంకేతిక అనుమతులు రాగానే టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తాం. పునరుద్ధరణ పనుల వ్యయ అంచనాలను సిద్ధం చేస్తున్నాం. 

బ్యారేజీల భద్రత, పనుల నాణ్యత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు. పునరుద్ధరణ పనుల్లో కఠినమైన నాణ్యతా ప్రమాణాలు, స్వతంత్ర పరీక్షలు నిర్వహిస్తాం. తాత్కాలిక మరమ్మతులు కాదు.. దీర్ఘకాలం మన్నేలా పునరుద్ధరణ చేపడతాం. పునరుద్ధరణ పూర్తయి భద్రతా అనుమతులు వచ్చాకే బ్యారేజీల నిర్వహణ చేపడతాం’ అని ఉత్తమ్‌ తెలిపారు.

ఇదీ చదవండి:  ‘ ఆ ఘనత మా అధినేత కేసీఆర్‌దే’

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement