చరిత్ర సృష్టించిన వెస్టిండీస్‌ ఓపెనర్లు | Campbell And Greaves Become First WI Openers Since 2009 to Hit Fifties vs India | Sakshi
Sakshi News home page

IND vs WI: చరిత్ర సృష్టించిన వెస్టిండీస్‌ ఓపెనర్లు

Sep 27 2026 3:55 PM | Updated on Sep 27 2026 4:21 PM

Campbell And Greaves Become First WI Openers Since 2009 to Hit Fifties vs India

తిరువనంతపురం వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి వన్డేలో వెస్టిండీస్ ఓపెనర్లు జస్టిన్ గ్రీవ్స్, జాన్ క్యాంప్‌బెల్ అద్భుత ప్రదర్శన కనబరిచారు. భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ టీ20 తరహాలో స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. గ్రీవ్స్ పేసర్లను ఓ ఆట ఆడుకుంటే, క్యాంప్‌బెల్ స్పిన్నర్లను టార్గెట్ చేస్తూ చెలరేగిపోయారు. వీరిద్దరి ధాటికి విండీస్ స్కోరు 10 ఓవర్లలోనే 80 పరుగులు దాటింది.

వీరిద్దరూ క్రీజులో నిలదొక్కుకోవడంతో ఈ ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని విడదీసేందుకు భారత బౌలర్లు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఆఖరికి కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో జాన్ క్యాంప్‌బెల్ (62) అవుట్ కావడంతో 135 పరుగుల భారీ భాగస్వామ్యానికి తెరపడింది. ఈ క్రమంలో గ్రీవ్స్-క్యాంప్‌బెల్ జోడీ ఓ అరుదైన ఘనతను తమ పేరిట లిఖించుకుంది.

భారత గడ్డపై వన్డేల్లో వందకు పైగా పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నమోదు చేసిన విండీస్ జంటగా 24 ఏళ్ల తర్వాత వీరిద్దరూ నిలిచారు. చివరిసారిగా 2002లో వడోదరా వేదికగా జరిగిన వన్డేలో క్రిస్ గేల్ - వేవ్‌ల్ హైండ్స్ జోడీ తొలి వికెట్‌కు 132 పరుగులు జోడించింది. మళ్లీ ఇన్నాళ్లకు విండీస్ ఓపెనింగ్‌ జోడీ భారత గడ్డపై ఈ ఘనత సాధించింది.

అదేవిధంగా భారత్‌పై వన్డేల్లో వెస్టిండీస్ తరఫున ఇద్దరు ఓపెనర్లు ఒకే ఇన్నింగ్స్‌లో 50కి పైగా పరుగులు సాధించడం గత 17 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం విశేషం. చివరిసారిగా  క్రిస్ గేల్, రునాకో మార్టన్ జంట భారత్‌పై ఒకే ఇన్నింగ్స్‌లో అర్ధశతకాలు సాధించారు. మళ్లీ ఇప్పుడు ఎట్టకేలకు ఈ రికార్డును గ్రీవ్స్-క్యాంప్‌బెల్ జోడీ పునరావృతం చేసింది. కాగా, ప్రస్తుతం గ్రీవ్స్ 80 పరుగులతో సెంచరీ దిశగా దూసుకుపోతున్నాడు.
చదవండి: IND vs WI: బెడిసి కొట్టిన టీమిండియా ప్ర‌యోగం.. ఉతికారేసిన విండీస్‌ బ్యాటర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement