వెస్టిండీస్ క్రికెటర్ ప్రపంచ రికార్డు
వెస్టిండీస్ క్రికెటర్ జస్టిన్ గ్రీవ్స్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. టెస్టు క్రికెట్లో ఇంత వరకు ఏ ఆటగాడికి సాధ్యం కాని అరుదైన ఘనత సాధించాడు. నాలుగో ఇన్నింగ్స్‌లో ఆరు లేదంటే అంతకంటే లోయర్ ఆర్డర్లో వచ్చి ద్విశతకం బాదిన క్రికెటర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.పరిమిత ఓవర్ల సిరీస్‌లలో పరాభవంకాగా ఐదు టీ20, మూడు టెస్టులు, మూడు వన్డేలు ఆడేందుకు విండీస్ క్రికెట్ జట్టు న్యూజిలాండ్ పర్యటన (West Indies tour of New Zealand, 2025)కు వెళ్లింది. ఇందులో భాగంగా తొలుత టీ20 సిరీస్ జరుగగా ఆతిథ్య కివీస్ 3-1తో గెలిచింది. వన్డే సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. ఈ మేరకు పరిమిత ఓవర్ల సిరీస్‌లలో న్యూజిలాండ్ చేతిలో ఘోర పరాభవాల తర్వాత.. వెస్టిండీస్ టెస్టు సిరీస్ మొదలుపెట్టింది.తొలి టెస్టులో అసాధారణ పోరాటంక్రైస్ట్చర్చ్ వేదికగా శనివారం ముగిసిన తొలి టెస్టును అసాధారణ పోరాటంతో వెస్టిండీస్ కనీసం డ్రా చేసుకోగలిగింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన విండీస్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో 231 పరుగులకు ఆలౌట్ అయింది.ఇందుకు బదులిచ్చే క్రమంలో వెస్టిండీస్ తడబడింది. తేజ్‌నరైన్ చందర్‌పాల్ (52), షాయీ హోప్ (Shai Hope- 56) మాత్రమే రాణించగా.. మిగతా వాళ్లంతా ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. దీంతో 167 పరుగులకే పర్యాటక జట్టు కుప్పకూలింది. ఫలితంగా కివీస్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 64 పరుగుల ఆధిక్యం లభించింది.హోప్ సెంచరీ, జస్టిన్ డబుల్ సెంచరీఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన న్యూజిలాండ్.. ఎనిమిది వికెట్ల నష్టానికి 466 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. తద్వారా విండీస్‌కు 531 (64+ 466)పరుగుల భారీ లక్ష్యాన్ని విధించింది. ఈ నేపథ్యంలో షాయీ హోప్ (234 బంతుల్లో 140)తో కలిసి జస్టిన్ గ్రీవ్స్ అసాధారణ ప్రదర్శన కనబరిచాడు.ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన గ్రీవ్స్.. 388 బంతులు ఎదుర్కొని 19 ఫోర్ల సాయంతో 202 పరుగులతో అజేయంగా నిలిచాడు. అయితే, ఆఖరి రోజు విండీస్‌కు చేతిలో 4 వికెట్లు ఉండి.. విజయానికి 74 పరుగుల దూరంలో ఉన్న వేళ.. సమయాభావం దృష్ట్యా ‘డ్రా’కు అంగీకరించాల్సి వచ్చింది.ఆరో స్థానంలో వచ్చిఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్ సందర్భంగా 31 ఏళ్ల జస్టిన్ గ్రీవ్స్ (Justin Greaves)... టెస్టు క్రికెట్లో నాలుగో ఇన్నింగ్స్‌లో ఆరో స్థానంలో వచ్చి డబుల్ సెంచరీ సాధించిన తొలి క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. ఇక ఇతరులలో భారత దిగ్గజం సునిల్ గావస్కర్ నాలుగో ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌గా వచ్చి 221 పరుగులు చేయడం విశేషం.చదవండి: భారత్‌తో మూడో వన్డే.. సౌతాఫ్రికాకు భారీ షాకులు