PC: X
జోహన్నెస్‌బర్గ్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో ఆస్ట్రేలియా యువ ఆటగాడు కూపర్ కానోలీ సంచలన క్యాచ్‌తో మెరిశాడు. మ్యాచ్ మొదటి బంతికే సూపర్ క్యాచ్‌తో దక్షిణాఫ్రికా ఓపెనర్ ఎయిడెన్ మార్‌క్రమ్‌ను పెవిలియన్‌కు పంపాడు.
తొలి ఓవర్ వేసిన ఆసీస్ స్పీడ్ స్టార్ జోష్ హేజిల్‌వుడ్.. మొదటి బంతిని మార్‌క్రమ్‌కు ఆఫ్‌స్టంప్ వెలుపల షార్ట్ బాల్‌గా సంధించాడు. ఆ బంతిని ఎయిడెన్ కవర్స్ దిశగా భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. షాట్ బాగానే కనెక్ట్ అయినప్పటికీ, కవర్-పాయింట్‌లో ఉన్న కానోలీ ఊహకందని అద్భుతం చేశాడు. తన తలపై నుంచి వెళ్తున్న బంతిని గాల్లోకి ఎగురుతూ ఒంటిచేత్తో క్యాచ్‌గా మలచుకున్నాడు.
దీంతో ఒక్కసారిగా మార్‌క్రమ్‌తో పాటు మైదానంలో ఉన్నవారంతా షాక్‌కు గురయ్యారు. ప్రస్తుతం ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు "క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ క్యాచ్‌లలో ఇది ఒకటి" అని కొనియాడుతున్నారు.
సౌతాఫ్రికా భారీ స్కోర్
ఇక ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. తొలుత బ్యాటింగ్ చేసిన ప్రోటీస్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 365 పరుగుల భారీ స్కోర్ సాధించింది. సఫారీ బ్యాటర్లలో డేవిడ్ మిల్లర్(93 బంతుల్లో 12 ఫోర్లు, 9 సిక్స్‌లతో 142), టెంబా బావుమా(103) వీరోచిత సెంచరీలతో కదం తొక్కారు. ఆస్ట్రేలియా బౌలర్లలో జాక్ ఎడ్వర్డ్స్ ఐదు వికెట్లతో చెలరేగాడు.
Markram's stay was cut short immediately thanks to this grab pic.twitter.com/GyDosOkhQW
— Werner (@Werries_) September 27, 2026


