Cooper Connolly
-
ఆ టీమ్‌కు భారీ షాక్.. ఉన్నపళంగా ఇంటికి వెళ్లిపోయిన విధ్వంసకర ప్లేయర్
ఐపీఎల్-2026లో అజేయంగా దూసుకుపోతున్న పంజాబ్ కింగ్స్‌కు భారీ షాక్ తగిలింది. ఈ ధనాధన్ లీగ్‌లో పంజాబ్ తమ తదుపరి మ్యాచ్‌లో ఏప్రిల్ 25న అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్‌కు ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ కూపర్ కనోలీ దూరమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి.కనోలీ ప్రస్తుతం పంజాబ్ క్యాంప్‌ను వీడి ఫిట్నెస్ పరీక్షల కోసం ఆస్ట్రేలియాకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఆల్‌రౌండర్ అయిన కనోలీకి ఐపీఎల్లో వెన్ను గాయం కారణంగా కేవలం బ్యాటింగ్ చేసేందుకు మాత్రమే క్రికెట్ ఆస్ట్రేలియా అనుమతి ఇచ్చింది. ఏప్రిల్ చివరి నాటికి బౌలింగ్ చేయడానికి అనుమతి లభించే అవకాశమున్నట్లు ఈ ఏడాది సీజన్ ఆరంభానికే ముందు పలు రిపోర్ట్లు పేర్కొన్నాయి. ఈ క్రమంలోనే ఫిట్నెస్ పరీక్షలను నిర్వహించేందుకు అతడిని క్రికెట్ ఆస్ట్రేలియా వెనక్కి పిలిపించింది. ఇందులో అతడు ఉత్తీర్ణత సాధిస్తే బౌలింగ్ చేసేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా క్లియరెన్స్ ఇవ్వనుంది. కనోలీ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. తన తొలి ఐపీఎల్ మ్యాచ్‌లోనే గుజరాత్ టైటాన్స్‌పై 72 పరుగులతో సంచలన ఇన్నింగ్స్ ఆడాడు.చివరగా లక్నో సూపర్ జెయింట్స్‌పై కూడా కేవలం 46 బంతుల్లో 87 పరుగులు చేసి అందరిని ఆకట్టుకున్నాడు. కనోలీ ప్రస్తుతం 6 మ్యాచ్‌లలో 223 పరుగులు చేసి పంజాబ్ కింగ్స్ లీడింగ్ రన్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ఇక శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని పంజాబ్ కింగ్స్ వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఐదింట విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్ధానంలో ఉంది.చదవండి: IPL 2026: సన్‌రైజర్స్ కెప్టెన్సీ నుంచి ఇషాన్ కిషన్ అవుట్? -
పంజాబ్ పరుగుల పండగ
గత నాలుగు మ్యాచ్‌ల్లో లక్ష్యఛేదనలో సత్తా చాటిన పంజాబ్ కింగ్స్... ఈసారి మొదట బ్యాటింగ్‌లో దుమ్మురేపింది. లక్నో బౌలింగ్‌ను చీల్చిచెండాడుతూ ఈ సీజన్లో అత్యధిక స్కోరును తమ పేరిట లిఖించుకుంది. ప్రియాన్ష్ ఆర్య, కూపర్ కనొలీ పోటీపడి సిక్స్‌లు కొట్టడంతో పంజాబ్ కొండంత స్కోరు చేయగా... ఛేదనలో పలు ప్రయోగాలు చేసిన లక్నో విజయానికి 54 పరుగుల దూరంలో నిలిచిపోయింది. న్యూ చండీగఢ్: ఐపీఎల్ 19వ సీజన్లో పంజాబ్ కింగ్స్ జోరు సాగుతోంది. ఎదురైన ప్రత్యర్థినల్లా చిత్తుచేస్తూ ముందుకు సాగుతున్న శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని పంజాబ్ తమ ఖాతాలో ఐదో విజయం వేసుకుంది. ఆదివారం జరిగిన పోరులో పంజాబ్ 54 పరుగుల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్‌ను మట్టికరిపించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 254 పరుగులు చేసింది. ప్రియాన్ష్ ఆర్య (37 బంతుల్లో 93; 4 ఫోర్లు, 9 సిక్స్‌లు), కూపర్ కనోలీ (46 బంతుల్లో 87; 8 ఫోర్లు, 7 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఈ జోడీ రెండో వికెట్‌కు 80 బంతుల్లోనే 182 పరుగులు జోడించడం విశేషం. లక్నో బౌలర్లలో ప్రిన్స్ యాదవ్, సిద్ధార్థ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 200 పరుగులకు పరిమితమైంది. మిచెల్ మార్ష్ (28 బంతుల్లో 40; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఆయుశ్ బదోనీ (21 బంతుల్లో 35; 5 ఫోర్లు, 1 సిక్స్), కెపె్టన్ రిషభ్ పంత్ (23 బంతుల్లో 43; 1 ఫోర్, 4 సిక్స్‌లు), మార్క్రమ్ (22 బంతుల్లో 42; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) తలా కొన్ని పరుగులు చేశారు. సాధించాల్సిన లక్ష్యం మరీ ఎక్కువగా ఉండగా... లక్నో ఏ దశలోనూ ఆ వేగం అందుకలోకపోయింది. పంజాబ్ బౌలర్లలో యాన్సెన్ 2 వికెట్లు తీశాడు. ధనాధన్.. ఈ సీజన్లో తొలిసారి మొదట బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్... లక్నో బౌలర్లపై తమ ప్రతాపం చూపింది. ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ (0)ను షమీ తొలి ఓవర్లోనే అవుట్ చేయగా... అక్కడి నుంచి పంజాబ్ ఊచకోత మొదలైంది. మరో ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య, కూపర్ కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. వీలుచిక్కినప్పుడల్లా భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. ఆరో ఓవర్లో ఆర్య 4, 6, 6 బాదగా... పవర్‌ప్లే ముగిసేసరికి పంజాబ్ 63/1తో నిలిచింది. బదోనీ ఓవర్లో కూపర్ 4, 6 కొట్టగా... ఆర్య 19 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. షమీ ఓవర్లో రెండు సిక్స్‌లతో కూపర్ కూడా హాఫ్‌సెంచరీ మార్క్ దాటాడు. బౌలర్‌తో సంబంధం లేకుండా ఈ జోడీ దంచి కొట్టడంతో పంజాబ్ స్కోరు రాకెట్ వేగంతో దూసుకెళ్లింది. మార్క్రమ్ వేసిన 13వ ఓవర్లో అయితే ఈ ఇద్దరు పండగ చేసుకున్నారు. తొలి మూడు బంతులను కూపర్ సిక్స్‌లుగా మలిస్తే... చివరి రెండు బంతులకు ఆర్య సిక్స్‌లు కొట్టాడు. దీంతో 32 పరుగులు వచ్చాయి. ఫలితంగా 13 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ 179/1తో మరింత భారీ స్కోరు చేసేలా కనిపించింది. ఆఖర్లో కాస్త తేరుకున్న లక్నో బౌలర్లు ఈ ఇద్దరితో పాటు శ్రేయస్ అయ్యర్ (5), నేహల్ వధేరా (13) వికెట్లు తీసి పరుగుల వేగాన్ని నియంత్రించారు. స్టొయినిస్ (16 బంతుల్లో 29; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), శశాంక్ సింగ్ (6 బంతుల్లో 17; 1 ఫోర్, 2 సిక్స్‌లు) చివర్లో ధాటిగా ఆడారు. స్కోరు వివరాలు పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ప్రియాన్ష్ ఆర్య (సి) మార్ష్ (బి) సిద్ధార్థ్ 93; ప్రభ్‌సిమ్రన్ (సి) మార్ష్ (బి) షమీ 0; కూపర్ (సి) సిద్ధార్థ్ (బి) ప్రిన్స్ 87; శ్రేయస్ (సి) షమీ (బి) మొహసిన్ 5; స్టొయినిస్ (రనౌట్) 29; వధేరా (సి) పూరన్ (బి) సిద్ధార్థ్ 13; శశాంక్ (సి) మార్క్రమ్ (బి) ప్రిన్స్ 17; యాన్సెన్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 254. వికెట్ల పతనం: 1–3, 2–185, 3–187, 4–193, 5–208, 6–252, 7–254. బౌలింగ్: షమీ 4–0–56–1; మొహసిన్ 4–0–43–1; ప్రిన్స్4–0–25–2; బదోనీ 1–0–14–0; అవేశ్ 3–0–46–0; సిద్ధార్థ్ 3–0–35–2; మార్క్రమ్ 1–0–32–0. లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: మార్ష్ (సి) బార్ట్లెట్ (బి) చాహల్ 40; బదోనీ (సి) బార్ట్లెట్ (బి) వైశాక్ 35; పంత్ (సి) ప్రభ్‌సిమ్రన్ (బి) అర్ష్ దీప్ 43; పూరన్ (సి) శ్రేయస్ (బి) యాన్సెన్ 9; మార్క్రమ్ (సి) స్టొయినిస్ (బి) యాన్సెన్ 42; ముకుల్ (నాటౌట్) 21; హిమ్మత్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 200. వికెట్ల పతనం: 1–61, 2–109, 3–128, 4–139, 5–199. బౌలింగ్: అర్ష్ దీప్ 4–0–41–1; బార్ట్లెట్ 4–0–54–0; యాన్సెన్ 4–0–37–2; వైశాక్ 4–0–30–1; చాహల్ 4–0–36–1. ఐపీఎల్లో నేడుగుజరాత్ X ముంబై వేదిక: అహ్మదాబాద్‌రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
ఒకే ఓవర్లో 32 పరుగులు.. లక్నో బౌలర్‌కు చుక్కలు
ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్‌జెయింట్స్‌తో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ విధ్వంసకర బ్యాటింగ్‌తో రెచ్చిపోయింది. ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య, వన్‌డౌన్ బ్యాటర్ కూపర్ కన్నోలి లక్నో బౌలర్లకు చుక్కలు చూపించారు. ప్రియాన్ష్ ఆర్య 37 బంతుల్లో 93 పరుగులు చేయగా, కూపర్ 47 బంతుల్లో 87 పరుగులు చేశాడు. అయితే ఇన్నింగ్స్ 13వ ఓవర్ వేసిన మార్కరమ్కు ఈ ఇద్దరు పీడకలను మిగిల్చారు. 13వ ఓవర్ స్ట్రైకింగ్ తీసుకున్న కూపర్ కన్నోలి మార్కరమ్ మొదటి బంతిని సిక్సర్‌గా మలిచాడు. రెండో బంతిని ఈసారి లాంగాన్ దిశగా సిక్సర్ కొట్టిన కన్నోలి మూడో బంతిని కూడా సిక్సర్‌గా మలిచాడు. ఆ తర్వాతి బంతిని వైడ్ వేయగా, నాలుగో బంతికి కూపర్ సింగిల్ తీయడంతో ప్రియాన్ష్ స్ట్రైక్‌లోకి వచ్చాడు. ఇక ప్రియాన్ష్ కూడా చివరి రెండు బంతులకు సిక్సర్లు కొట్టాడు. దీంతో ఆ ఓవర్లో మొత్తం 5 సిక్సర్లు, వైడ్ సహా సింగిల్ మొత్తం 32 పరుగులు వచ్చాయి. ఈ నేపథ్యంలో మార్కరమ్ ఒక చెత్త రికార్డును తన పేరిట మూటగట్టుకున్నాడు. లక్నో తరఫున ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్‌గా మార్కరమ్ నిలిచాడు. గతంలో ఈ రికార్డు రవి బిష్ణోయ్ పేరిట ఉంది. 2022లో ఆర్సీబీతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో రవి బిష్ణోయ్ 27 పరుగులు సమర్పించుకున్నాడు.ఇక 2026 సీజన్లో ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్ కూడా మార్కరమ్ మాత్రమే. ఈ సీజన్లోనూ ఇదే మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఓవర్ అని చెప్పొచ్చు. 2025 సీజన్లో ఖలీల్ అహ్మద్ (సీఎస్కే) ఆర్సీబీతో మ్యాచ్‌లో 33 పరుగులు, మొయిన్ అలీ (కేకేఆర్) రాజస్తాన్‌తో మ్యాచ్‌లో 32 పరుగులు సమర్పించుకున్నారు.3️⃣2️⃣ runs of pure destruction 💥🎥 Relive this carnage 👉 https://t.co/EpOcpY1lLb#TATAIPL | #KhelBindaas | #PBKSvLSG | @PunjabKingsIPL pic.twitter.com/eI5tuleNYM— IndianPremierLeague (@IPL) April 19, 2026చదవండి: 'క్యాచ్‌లు జారవిడవడం మా కొంపముంచింది’ -
IPL 2026: శ్రేయస్ అయ్యర్‌కు భారీ షాక్
గతేడాది రన్నరప్‌గా నిలిచిన పంజాబ్ కింగ్స్ ఐపీఎల్-2026లో తమ ఆరంభ మ్యాచ్‌లో అదరగొట్టింది. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన పోరులో గుజరాత్ టైటాన్స్‌పై మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. న్యూ చంఢీగగడ్లో మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ తొలుత బౌలింగ్ చేసింది.నామమాత్రపు స్కోరుఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 162 పరుగులు సాధించింది. కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (39), జోస్ బట్లర్ (38), గ్లెన్ ఫిలిప్స్ (25) ఓ మోస్తరుగా రాణించారు. పంజాబ్ బౌలర్లలో విజయ్‌కుమార్ వైశాక్ మూడు వికెట్లు తీయగా.. యజువేంద్ర చహల్ రెండు, మార్కో యాన్సెన్ ఒక వికెట్ దక్కించుకున్నారు.కూపర్ కన్నోలి మెరుపులుఇక లక్ష్య ఛేదనలో పంజాబ్ ఆరంభంలోనే తడబడినప్పటికీ మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే పని పూర్తి చేసింది. ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ 37 పరుగులు చేయగా.. వన్‌డౌన్ బ్యాటర్ కూపర్ కన్నోలి (Cooper Connolly) 44 బంతుల్లో 72 పరుగులతో అజేయంగా నిలిచాడు. కన్నోలి మెరుపుల కారణంగా పంజాబ్ 19.1 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 165 పరుగుల లక్ష్యాన్ని పూర్తి చేసింది.The debutant seals it in style! 💪@PunjabKingsIPL clinch a thriller in New Chandigarh to get their campaign going with a win ❤️Scorecard ▶️ https://t.co/75rCxTCOL1#TATAIPL | #KhelBindaas | #PBKSvGT pic.twitter.com/WqBQNjuvA1— IndianPremierLeague (@IPL) March 31, 2026భారీ జరిమానాఈ మ్యాచ్‌లో పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (18) మాత్రం నిరాశపరిచాడు. తాను విఫలమైనా.. జట్టు గెలుపొందడంతో అతడు సంతోషం వ్యక్తం చేశాడు. అయితే.. గెలుపు జోష్‌లో ఉన్న అయ్యర్ (Shreyas Iyer Fined)కు భారీ షాక్ తగిలింది. గుజరాత్‌తో మ్యాచ్‌లో నిర్ణీత సమయంలో బౌలింగ్ కోటా పూర్తి చేయనందున అతడికి పెద్ద ఎత్తున జరిమానా పడింది.ఇందుకు సంబంధించి ఐపీఎల్ తాజాగా అధికారిక ప్రకటన విడుదల చేసింది. ‘‘గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో స్లో ఓవర్ రేటు మెయింటెన్ చేసినందుకుగానూ పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు జరిమానా విధించడమైనది. సీజన్లో ఇదే తొలి తప్పిదం కాబట్టి ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలో ఆర్టికల్ 2.22 నిబంధన ప్రకారం రూ. 12 లక్షల ఫైన్‌తో సరిపెట్టాము’’ అని పేర్కొంది.చదవండి: IPL 2026: మూగబోయిన బ్యాట్.. విధ్వంస వీరుడికి ఏమైంది? -
అరంగేట్రంలోనే అదరగొట్టాడు.. ఎవరీ కూపర్!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఎందరో అనామక ఆటగాళ్లను వెలుగులోకి తీసుకొచ్చింది. ప్రతీ సీజన్లో తమ అరంగేట్రం మ్యాచ్‌ల్లో అదరగొట్టే ప్రదర్శన నమోదు చేసే ఆటగాళ్లు అరుదుగా ఉంటారు. ఆ జాబితాలో చేరిపోయాడు పంజాబ్ కింగ్స్ ప్లేయర్ కూపర్ కనోలీ. తాను ఆడుతుంది తొలి ఐపీఎల్ మ్యాచ్ అయినప్పటికీ ఎలాంటి బెరుకు లేకుండా కడదాకా నిలిచి 72 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌తో పంజాబ్‌ను గెలిపించాడు. ఆడిన తొలి మ్యాచ్‌లోనే అందరూ మెచ్చే ఇన్నింగ్స్ ఆడిన కనోలీ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా’ నిలిచాడు. తద్వారా ఐపీఎల్లో అరంగేట్రం మ్యాచ్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో కూపర్ ఐదో స్థానంలో ఉన్నాడు. కూపర్ కంటే ముందు మెక్కల్లమ్ (158 నాటౌట్), మైక్ హస్సీ (116 నాటౌట్), షాన్ మార్ష్ (84 నాటౌట్), కైల్ మిల్స్ (73) వరుసగా తొలి నాలుగు స్థానాల్లో ఉన్నారు.ఇక మంగళవారం గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఒక దశలోఈజీగా గెలవాల్సిందే. కానీ ప్రసిధ్ క్రిష్ణ సూపర్ స్పెల్ వేసి శ్రేయస్, స్టోయినిస్, శశాంక్ సింగ్‌లను ఔట్ చేసి పంజాబ్‌కు షాక్ ఇచ్చాడు. ఈ దశలో వన్‌డౌన్‌లో వచ్చిన కూపర్ కనోలీ కడదాకా నిలిచి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 44 బంతుల్లో 72 పరుగులు చేసిన కూపర్ ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. ఆల్‌రౌండర్‌గా గుర్తింపు ఉన్నా వెన్ను గాయం కారణంగా లీగ్‌లో అతను బౌలింగ్ చేయడని, స్పెషలిస్ట్ బ్యాటర్‌గానే ఆడతాడని పంజాబ్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో కనోలీ కీలక ఇన్నింగ్స్ ఆడి పంజాబ్ నమ్మకాన్ని నిలబెట్టాడు.ఎవరీ కూపర్ కనోలీ?ఆస్ట్రేలియాకు చెందని కూపర్ కనోలీ 2003, ఆగస్టు 22న పెర్త్‌లో జన్మించాడు. 22 ఏళ్ల కూపర్ ఆస్ట్రేలియా తరఫున 2024 సెప్టెంబర్‌లో తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. అరంగేట్రం చేసిన నాలుగు నెలల్లోనే అన్ని అంతర్జాతీయ ఫార్మాట్లలో మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్‌గా కూపర్ అరుదైన ఘనత సాధించాడు. 2022-23 బీబీఎల్ ఫైనల్లో కూపర్ ప్రదర్శన అతడికి గుర్తింపునిచ్చింది. కూపర్ ఆస్ట్రేలియా తరఫున ఒక టెస్టు, 8 వన్డేలు, 11 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.The debutant seals it in style! 💪@PunjabKingsIPL clinch a thriller in New Chandigarh to get their campaign going with a win ❤️Scorecard ▶️ https://t.co/75rCxTCOL1#TATAIPL | #KhelBindaas | #PBKSvGT pic.twitter.com/WqBQNjuvA1— IndianPremierLeague (@IPL) March 31, 2026చదవండి: మూగబోయిన బ్యాట్.. విధ్వంస వీరుడికి ఏమైంది? -
కూపర్... సూపర్
గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో 163 పరుగుల విజయలక్ష్యం.... పంజాబ్ ఒకదశలో 11 ఓవర్లలో 110/2... మిగిలిన 48 బంతుల్లో మరో 53 పరుగులు అంటే అలవోకగా ఛేదించవచ్చు... కానీ ఇక్కడ జట్టు అనూహ్యంగా తడబడింది. 16 బంతుల వ్యవధిలో జట్టు 4 వికెట్లు కోల్పోవడంతో ఒక్కసారిగా ఉత్కంఠ పెరిగింది. అయితే ఈ మ్యాచ్‌తోనే ఐపీఎల్లో అరంగేట్రం చేసిన ఆ్రస్టేలియన్ కూపర్ కనోలీ పట్టుదలగా నిలబడ్డాడు. ఒత్తిడిని అధిగమిస్తూ చివరి వరకు నిలబడి ఒంటి చేత్తో గెలిపించాడు. అంతకుముందు పంజాబ్ పదునైన బౌలింగ్ ముందు నిలవలేక గుజరాత్ సాధారణ స్కోరుకే పరిమితమైంది. న్యూ చండీగఢ్: ఐపీఎల్లో మూడు ఏకపక్ష మ్యాచ్‌ల తర్వాత ఉత్కంఠభరిత పోరు జరిగింది. మంగళవారం చివరి వరకు ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 3 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్‌పై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. శుబ్‌మన్ గిల్ (27 బంతుల్లో 39; 6 ఫోర్లు), జోస్ బట్లర్ (33 బంతుల్లో 38; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించారు. అనంతరం పంజాబ్ 19.1 ఓవర్లలో 7 వికెట్లకు 165 పరుగులు సాధించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కూపర్ కనోలీ (44 బంతుల్లో 72 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్స్‌లు) చెలరేగగా, ప్రభ్‌సిమ్రన్ సింగ్ (24 బంతుల్లో 37; 1 ఫోర్, 4 సిక్స్‌లు) రాణించాడు. బ్యాటింగ్ వైఫల్యం! బార్ట్లెట్ ఓవర్లో గిల్ మూడు ఫోర్లు కొట్టి ధాటిని ప్రదర్శించగా, మరో ఓపెనర్ సాయిసుదర్శన్ (13) ఎక్కువసేపు నిలవలేకపోయాడు. బట్లర్ కూడా ఆశించిన స్థాయిలో దూకుడుగా ఆడకపోవడంతో పవర్‌ప్లేలో గుజరాత్ 54 పరుగులే చేయగలిగింది. ఇందులో ఒక్క సిక్స్ కూడా లేకపోవడం విశేషం. ఆ తర్వాత చహల్ బౌలింగ్‌లో స్లాగ్ స్వీప్‌కు ప్రయత్నించి గిల్ వెనుదిరగ్గా, గ్లెన్ ఫిలిప్స్ (17 బంతుల్లో 25; 1 ఫోర్, 1 సిక్స్) కూడా ఎక్కువసేపు నిలవలేదు. 16వ ఓవర్ వరకు క్రీజ్‌లో ఉన్నా బట్లర్ ప్రభావం కనిపించలేదు. చివరి 4 ఓవర్లలో టైటాన్స్ కేవలం 2 ఫోర్లతో 31 పరుగులే రాబట్టగలిగిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మిడిలార్డర్లో వాషింగ్టన్ సుందర్ (18), షారుఖ్ ఖాన్ (4) కూడా విఫలమయ్యారు. రాణించిన ప్రభ్‌సిమ్రన్... ఛేదనలో ఆరంభంలోనే ప్రియాన్‡్ష ఆర్య (7) వెనుదిరిగినా... ప్రభ్ సిమ్రన్ సిక్సర్లతో చెలరేగాడు. రబాడ ఓవర్లో వరుసగా రెండు సిక్స్‌లు కొట్టిన అతను, సుందర్ బౌలింగ్‌లో మరో రెండు భారీ సిక్స్‌లు బాదాడు. అయితే కీలక సమయంలో గుజరాత్ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో వరుస వికెట్లు తీసి పంజాబ్‌పై ఒత్తిడి పెంచింది. కానీ కనోలీ పోరాటంతో మ్యాచ్ పంజాబ్ వశమైంది. అశోక్ అరంగేట్రం... రాజస్తాన్‌కు చెందిన 23 ఏళ్ల అశోక్ శర్మ ఈ మ్యాచ్‌తోనే ఐపీఎల్లో అడుగు పెట్టాడు. దేశవాళీ క్రికెట్లో నిలకడగా గంటకు 150 కిలోమీటర్లకు పైగా వేగంతో బౌలింగ్ చేసే ఫాస్ట్ బౌలర్‌గా గుర్తింపు పొందాడు. ఇటీవల సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కేవలం 15.63 సగటుతో 22 వికెట్లు పడగొట్టి టోర్నీ టాపర్‌గా నిలిచాడు. ఐపీఎల్లో 2022లో కోల్‌కతా, 2025లో రాజస్తాన్ జట్లలో ఉన్నా ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. స్కోరు వివరాలు గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సుదర్శన్ (సి) అయ్యర్ (బి) యాన్సెన్ 13; గిల్ (సి) కనోలీ (బి) చహల్ 39; బట్లర్ (సి) బార్ట్లెట్ (బి) చహల్ 38; ఫిలిప్స్ (సి) యాన్సెన్ (బి) వైశాక్ 25; సుందర్ (సి) అర్ష్‌దీప్ (బి) వైశాక్ 18, షారుఖ్ (సి) అర్ష్‌దీప్ (బి) వైశాక్ 4; తెవాటియా (నాటౌట్) 11; రషీద్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 162. వికెట్ల పతనం: 1–37, 2–83, 3–119, 4–129, 5–144, 6–150.బౌలింగ్: అర్ష్‌దీప్ 4–0–42–0, బార్ట్లెట్ 4–0–36–0, యాన్సెన్ 4–0–20–1, వైశాక్ 4–0–34–3, చహల్ 4–0–28–2, పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ప్రియాన్‡్ష (సి) అశోక్ (బి) రబాడ 7; ప్రభ్‌సిమ్రన్ (సి) ప్రసిధ్ (బి) రషీద్ 37; కనోలీ (నాటౌట్) 72; శ్రేయస్ (సి) సుందర్ (బి) ప్రసిధ్ 18; వధేరా (సి) గిల్ (బి) సుందర్ 3; శశాంక్ (సి) బట్లర్ (బి) ప్రసిధ్ 4; స్టొయినిస్ (సి) రషీద్ (బి) ప్రసిధ్ 0; యాన్సెన్ (సి) గిల్ (బి) అశోక్ 9; బార్ట్లెట్ (నాటౌట్) 11; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (19.1 ఓవర్లలో 7 వికెట్లకు) 165. వికెట్ల పతనం: 1–7, 2–83, 3–110, 4–113, 5–118, 6–118, 7–144. బౌలింగ్: సిరాజ్ 2–0–15–0 రబాడ 3–0–34–1, అశోక్ శర్మ 3–0–31–1, రషీద్ 4–0–29–1, సుందర్ 3.1–0–27–1, ప్రసిధ్ 4–0–29–3. -
టీమిండియా కొంపముంచిన 22 ఏళ్ల కుర్రాడు..
అడిలైడ్ వేదికగా టీమిండియాతో జరిగిన రెండో వన్డేలో 2 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. 265 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ 46.2 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి చేధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను మార్ష్ సేన మరో మ్యాచ్ మిగిలూండగానే 2-0తో సొంతం చేసుకుంది. కాగా ఆసీస్ విజయంలో ఆ జట్టు యువ ఆటగాడు కూపర్ కొన్నోలీది కీలక పాత్ర.లక్ష్య చేధనలో కొన్నోలీ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 132 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన సమంయలో కంగారులను షార్ట్‌తో కలిసి కూపర్ ఆదుకున్నాడు. షార్ట్ ఔటయ్యాక కూడా 22 ఏళ్ల యువ సంచలనం ఏ మాత్రం ఒత్తడికి లోనవ్వకుండా జట్టును గెలుపు దిశగా నడిపించాడు. ఆఖరిలో 14 పరుగుల వ్యవధిలో ఆసీస్ 3 వికెట్లు కోల్పోవడంతో ఉత్కంఠ పెరిగింది. కానీ కనోలీ ప్రశాంతంగా ఉండి మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. మొత్తంగా 53 బంతులు ఎదుర్కొన్న కొన్నోలీ.. 5 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 61 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఒకవేళ కొన్నోలీ వికెట్‌ను టీమిండియా సాధించి ఉంటే కథ మరో విధంగా ఉండేది. మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడిన కూపర్‌పై సర్వాత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆసీస్ కెప్టెన్ మార్ష్ సైతం అతడిని పొగడ్తలతో ముంచెత్తాడు.కూపర్ ఒక అద్భుతం. అతడు బ్యాట్‌తో పాటు బంతితో కూడా రాణించగలడు. ఈ మ్యాచ్‌లో అసాధరణ ప్రదర్శన కనబరిచాడు. అతడు వయస్సు 22 ఏళ్లు మాత్రమే. ఖచ్చితంగా ఆసీస్ గొప్ప క్రికెటర్లలో ఒకడిగా ఎదుగుతాడని మార్ష్ పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో పేర్కొన్నాడు. కొన్నోలీ ఇప్పటికే మూడు ఫార్మాట్లలో ఆసీస్ జట్టు తరపున అరంగేట్రం చేశాడు.అయితే ఈ మ్యాచ్ కంటే ముందు అతడు చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో కూడా అతడు ఇప్పటివరకు కేవలం 8 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. కానీ బిగ్ బాష్ లీగ్‌లో మాత్రం అతడికి మంచి రికార్డు ఉంది.చదవండి: IND vs AUS: అతడే ఉంటే కథ వేరేలా ఉండేది.. గంభీర్ ఇకనైనా మారవా? -
IND vs AUS: టీమిండియాపై ఆసీస్ గెలుపు.. సిరీస్ కైవసం
ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియాకు చేదు అనుభవం ఎదురైంది. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ఆతిథ్య ఆసీస్.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది. పెర్త్‌లో జరిగిన తొలి వన్డేలో ఏడు వికెట్ల తేడాతో గెలిచిన కంగారూలు.. తాజాగా అడిలైడ్ వేదికగా రెండో వన్డే (IND vs AUS 2nd ODI)లోనూ జయభేరి మోగించారు.టాస్ గెలిచిన ఆస్ట్రేలియాఅడిలైడ్ ఓవల్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా.. పర్యాటక భారత జట్టును తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో ఒకే ఓవర్లో ఓపెనర్, కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (9)తో పాటు వన్‌డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లి (0) వికెట్ తీసి జేవియర్ బార్ట్లెట్ ఆసీస్‌కు శుభారంభం అందించాడు.రాణించిన రోహిత్, శ్రేయస్ఇలాంటి తరుణంలో మరో ఓపెనర్ రోహిత్ శర్మ (Rohit Sharma), వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్నారు. రోహిత్ (97 బంతుల్లో 73), అయ్యర్ (77 బంతుల్లో 61) పరుగులతో రాణించగా.. మిగతా వారిలో ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ (41 బంతుల్లో 44), హర్షిత్ రాణా (18 బంతుల్లో 24 నాటౌట్) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు.ఆసీస్ బౌలర్లలో స్పిన్నర్ ఆడం జంపా నాలుగు వికెట్లతో చెలరేగి భారత బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (11) నితీశ్ రెడ్డి (8) రూపంలో కీలక వికెట్లు దక్కించుకున్నాడు. పేసర్లలో బార్ట్లెట్ గిల్, కోహ్లి, వాషింగ్టన్ సుందర్ (12) వికెట్లు తన ఖాతాలో వేసుకోగా.. మిచెల్ స్టార్క్ రోహిత్ శర్మ, అర్ష్‌దీప్ సింగ్ (13)లను అవుట్ చేశాడు.264 పరుగులుఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో టీమిండియా తొమ్మిది వికెట్ల నష్టానికి 264 పరుగులు స్కోరు చేసింది. ఇక లక్ష్య ఛేదనలో ఆసీస్ ఆరంభంలో తడబడింది. ఓపెనర్, కెప్టెన్ మిచెల్ మార్ష్ (11)ను అర్ష్‌దీప్ త్వరగానే పెవిలియన్‌కు పంపగా.. ట్రవిస్ హెడ్ (40 బంతుల్లో 28)ను హర్షిత్ రాణా అవుట్ చేశాడు.అదరగొట్టిన షార్ట్, కన్నోలి అయితే, వన్‌డౌన్ బ్యాటర్ మాథ్యూ షార్ట్ అద్భుత అర్ధ శతకం (74)తో మెరిసి మ్యాచ్‌ను తమ వైపు తిప్పే ప్రయత్నం చేయగా.. మ్యాట్ రెన్షా (30) అతడికి సహకరించాడు. షార్ట్, రెన్షా వేసిన పునాదిపై ఆల్‌రౌండర్ కూపర్ కన్నోలి మిచెల్ ఓవెన్‌తో కలిసి ఇన్నింగ్స్ నిర్మించాడు.Just the wicket #TeamIndia needed! 🤩#NitishKumarReddy gets the wicket and #MohammedSiraj makes amends for the dropped catch. 👏#AUSvIND 👉 2nd ODI | LIVE NOW 👉 https://t.co/dfQTtniylt pic.twitter.com/YZwdPY0nr7— Star Sports (@StarSportsIndia) October 23, 2025 ఆఖర్లో వరుస విరామాల్లో వికెట్లు పడినా కన్నోలి పట్టుదలగా నిలబడ్డాడు. ఓవెన్ 23 బంతుల్లో 36 పరుగులతో వేగంగా ఆడి.. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో వెనుదిరగగా.. బార్ట్లెట్ (3), స్టార్క్ (4) ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు.అయితే, కన్నోలి మాత్రం నిలకడగా ముందుకు సాగాడు. 53 బంతుల్లో ఐదు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 61 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. 46.2 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టపోయిన ఆస్ట్రేలియా లక్ష్యం పూర్తి చేసింది. రెండు వికెట్ల తేడాతో గెలిచి.. సిరీస్‌ను 2-0తో సొంతం చేసుకుంది. ఇరుజట్ల మధ్య శనివారం నాటి నామమాత్రపు మూడో వన్డేకు సిడ్నీ వేదిక. కాగా వన్డే సారథిగా గిల్‌కు తొలి సిరీస్‌లోనే ఇలా చేదు అనుభవం ఎదురైంది. ఇక రెండో వన్డేలో జంపాకు ప్లేయర్ ఆఫ్ దిమ్యాచ్ అవార్డు దక్కింది.చదవండి: బతికితే చాలనుకున్నా.. ఆకాశ్ అంబానీ హెల్ప్ చేశారు: తిలక్ వర్మ


