అరంగేట్రంలోనే అద‌ర‌గొట్టాడు.. ఎవరీ కూపర్‌! | 22 Years Cooper Connolly Unforgettable IPL debut Match Winning Knock | Sakshi
Sakshi News home page

IPL 2026: అరంగేట్రంలోనే అద‌ర‌గొట్టాడు.. ఎవరీ కూపర్‌!

Apr 1 2026 8:11 AM | Updated on Apr 1 2026 9:08 AM

22 Years Cooper Connolly Unforgettable IPL debut Match Winning Knock

Photo Courtesy: IPL 2026

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) ఎంద‌రో అనామ‌క ఆట‌గాళ్ల‌ను వెలుగులోకి తీసుకొచ్చింది. ప్ర‌తీ సీజ‌న్‌లో త‌మ అరంగేట్రం మ్యాచ్‌ల్లో అద‌ర‌గొట్టే ప్ర‌ద‌ర్శ‌న న‌మోదు చేసే ఆట‌గాళ్లు అరుదుగా ఉంటారు. ఆ జాబితాలో చేరిపోయాడు పంజాబ్ కింగ్స్ ప్లేయ‌ర్ కూప‌ర్ క‌నోలీ. తాను ఆడుతుంది తొలి ఐపీఎల్‌ మ్యాచ్ అయిన‌ప్ప‌టికీ ఎలాంటి బెరుకు లేకుండా క‌డ‌దాకా నిలిచి 72 ప‌రుగుల అజేయ ఇన్నింగ్స్‌తో పంజాబ్‌ను గెలిపించాడు. 

ఆడిన తొలి మ్యాచ్‌లోనే అందరూ మెచ్చే ఇన్నింగ్స్ ఆడిన కనోలీ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా’ నిలిచాడు. తద్వారా ఐపీఎల్‌లో అరంగేట్రం మ్యాచ్‌లో అత్య‌ధిక ప‌రుగులు సాధించిన ఆట‌గాళ్ల జాబితాలో కూప‌ర్ ఐదో స్థానంలో ఉన్నాడు. కూప‌ర్ కంటే ముందు మెక్‌క‌ల్ల‌మ్ (158 నాటౌట్‌), మైక్ హ‌స్సీ (116 నాటౌట్‌), షాన్ మార్ష్ (84 నాటౌట్‌), కైల్ మిల్స్ (73) వ‌రుస‌గా తొలి నాలుగు స్థానాల్లో ఉన్నారు.

ఇక మంగ‌ళ‌వారం గుజ‌రాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఒక ద‌శ‌లోఈజీగా గెల‌వాల్సిందే. కానీ ప్ర‌సిధ్ క్రిష్ణ సూప‌ర్ స్పెల్ వేసి శ్రేయ‌స్‌, స్టోయినిస్‌, శ‌శాంక్ సింగ్‌ల‌ను ఔట్ చేసి పంజాబ్‌కు షాక్ ఇచ్చాడు. ఈ ద‌శ‌లో వ‌న్‌డౌన్‌లో వ‌చ్చిన కూపర్‌ కనోలీ క‌డ‌దాకా నిలిచి కీల‌క ఇన్నింగ్స్ ఆడాడు. 

44 బంతుల్లో 72 ప‌రుగులు చేసిన కూప‌ర్ ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 5 సిక్స‌ర్లు ఉన్నాయి. ఆల్‌రౌండర్‌గా గుర్తింపు ఉన్నా వెన్ను గాయం కారణంగా లీగ్‌లో అతను బౌలింగ్‌ చేయడని, స్పెషలిస్ట్‌ బ్యాటర్‌గానే ఆడతాడని పంజాబ్‌ ప్రకటించింది. ఈ నేప‌థ్యంలో కనోలీ కీలక ఇన్నింగ్స్ ఆడి పంజాబ్ న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టాడు.

ఎవ‌రీ కూప‌ర్ క‌నోలీ?
ఆస్ట్రేలియాకు చెంద‌ని కూప‌ర్ క‌నోలీ 2003, ఆగ‌స్టు 22న పెర్త్‌లో జ‌న్మించాడు. 22 ఏళ్ల కూప‌ర్ ఆస్ట్రేలియా త‌ర‌ఫున 2024 సెప్టెంబ‌ర్‌లో తొలి అంత‌ర్జాతీయ మ్యాచ్ ఆడాడు. అరంగేట్రం చేసిన నాలుగు నెల‌ల్లోనే అన్ని అంత‌ర్జాతీయ ఫార్మాట్ల‌లో మ్యాచ్‌లు ఆడిన క్రికెట‌ర్‌గా కూప‌ర్ అరుదైన ఘ‌న‌త సాధించాడు. 2022-23 బీబీఎల్ ఫైన‌ల్లో కూప‌ర్ ప్ర‌ద‌ర్శ‌న అత‌డికి గుర్తింపునిచ్చింది.  కూప‌ర్ ఆస్ట్రేలియా త‌ర‌ఫున ఒక టెస్టు, 8 వ‌న్డేలు, 11 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.

చదవండి: మూగబోయిన బ్యాట్‌.. విధ్వంస వీరుడికి ఏమైంది?

Advertisement
 
Advertisement
Advertisement