ఆ టీమ్‌కు భారీ షాక్‌.. ఉన్న‌ప‌ళంగా ఇంటికి వెళ్లిపోయిన విధ్వంసకర ప్లేయర్‌ | Punjab Kings Cooper Connolly travels to Australia for bowling fitness clearance | Sakshi
Sakshi News home page

IPL 2026: ఆ టీమ్‌కు భారీ షాక్‌.. ఉన్న‌ప‌ళంగా ఇంటికి వెళ్లిపోయిన విధ్వంసకర ప్లేయర్‌

Apr 22 2026 5:42 PM | Updated on Apr 22 2026 5:50 PM

 Punjab Kings Cooper Connolly travels to Australia for bowling fitness clearance

ఐపీఎల్‌-2026లో అజేయంగా దూసుకుపోతున్న పంజాబ్ కింగ్స్‌కు భారీ షాక్ త‌గిలింది. ఈ ధ‌నాధ‌న్ లీగ్‌లో పంజాబ్ త‌మ త‌దుప‌రి మ్యాచ్‌లో ఏప్రిల్ 25న అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక‌గా ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో త‌ల‌ప‌డ‌నుంది. అయితే ఈ మ్యాచ్‌కు ఆ జ‌ట్టు స్టార్ ఆల్‌రౌండ‌ర్ కూప‌ర్ క‌నోలీ దూర‌మ‌య్యే సూచ‌న‌లు క‌న్పిస్తున్నాయి.

క‌నోలీ ప్ర‌స్తుతం పంజాబ్ క్యాంప్‌ను వీడి ఫిట్‌నెస్ ప‌రీక్షల కోసం ఆస్ట్రేలియాకు వెళ్లిన‌ట్లు తెలుస్తోంది. ఆల్‌రౌండ‌ర్ అయిన క‌నోలీకి ఐపీఎల్‌లో వెన్ను గాయం కార‌ణంగా  కేవ‌లం బ్యాటింగ్ చేసేందుకు మాత్ర‌మే క్రికెట్ ఆస్ట్రేలియా అనుమ‌తి ఇచ్చింది. ఏప్రిల్ చివరి నాటికి బౌలింగ్ చేయడానికి అనుమతి లభించే అవ‌కాశమున్న‌ట్లు ఈ ఏడాది సీజ‌న్ ఆరంభానికే ముందు ప‌లు రిపోర్ట్‌లు పేర్కొన్నాయి. 

ఈ క్ర‌మంలోనే ఫిట్‌నెస్ పరీక్షలను నిర్వహించేందుకు అతడిని క్రికెట్ ఆస్ట్రేలియా వెనక్కి పిలిపించింది. ఇందులో అతడు ఉత్తీర్ణత సాధిస్తే బౌలింగ్ చేసేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా క్లియరెన్స్ ఇవ్వనుంది. క‌నోలీ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. తన తొలి ఐపీఎల్ మ్యాచ్‌లోనే గుజరాత్ టైటాన్స్‌పై 72 పరుగులతో సంచలన ఇన్నింగ్స్ ఆడాడు.

చివరగా లక్నో సూపర్ జెయింట్స్‌పై కూడా కేవలం 46 బంతుల్లో 87 పరుగులు చేసి అందరిని ఆకట్టుకున్నాడు. కనోలీ ప్రస్తుతం 6 మ్యాచ్‌లలో 223 పరుగులు చేసి పంజాబ్ కింగ్స్ లీడింగ్ రన్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ఇక శ్రేయస్‌ అయ్యర్‌ సారథ్యంలోని పంజాబ్‌ కింగ్స్‌  వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఐదింట విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్ధానంలో ఉంది.
చదవండి: IPL 2026: సన్‌రైజర్స్‌ కెప్టెన్సీ నుంచి ఇషాన్‌ కిషన్‌ అవుట్‌?

Advertisement
 
Advertisement
Advertisement