ఐపీఎల్-2026లో వరుస విజయాలతో దూసుకుపోతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు అదిరిపోయే వార్త అందింది. ఏప్రిల్ 25న జైపూర్ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరగనున్న మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ బరిలోకి దిగనున్నాడు. దీంతో తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న ఇషాన్ కిషన్ తన బాధ్యతలను కమ్మిన్స్‌కు అప్పగించనున్నాడు.
కమ్మిన్స్ వెన్ను గాయం కారణంగా ఇప్పటివరకు ఎస్ఆర్‌హెచ్ ఆడిన ఏడు మ్యాచ్‌లకు అందుబాటులో లేడు. అతడు ఇటీవలే క్రికెట్ ఆస్ట్రేలియా నిర్వహించిన ఫిట్‌నెస్ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించి ఎస్ఆర్‌హెచ్ క్యాంప్‌లో చేరాడు. మంగళవారం ఉప్పల్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనే కమ్మిన్స్ ఆడుతాడని అంతా భావించారు.
కానీ కాస్త ఆసౌకర్యంగా ఉండడంతో టీమ్ సెలెక్షన్ అందుబాటులేకపోయాడు. అయితే రాజస్తాన్‌తో మ్యాచ్‌లో మాత్రం కమ్మిన్స్ ఆడడం దాదాపు ఖాయమైంది. అతడు ఇప్పటికే తన ప్రాక్టీస్‌ను కూడా మొదలు పెట్టాడు. కాగా కమ్మిన్స్ గైర్హజారీలో ఇషాన్ జట్టును అద్భుతంగా నడిపించాడు.
అతడి కెప్టెన్సీలో ఇప్పటివరకు ఏడు మ్యాచ్‌లు ఆడిన ఆరెంజ్ ఆర్మీ నాలుగింట విజయం సాధించింది. సన్‌రైజర్స్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడో స్ధానంలో కొనసాగుతోంది. కమ్మిన్స్ సారథిగానే కాకుండా వ్యక్తిగత ప్రదర్శనల పరంగా ఆకట్టుకుంటున్నాడు. కిషన్ 7 మ్యాచ్‌లలో 238 పరుగులు చేశాడు. అయితే కమ్మిన్స్ జట్టులోకి వచ్చినప్పటికి ఇషాన్ కిషన్‌నే కెప్టెన్‌గా కొనసాగించాలని సంజయ్ బంగర్, హార్భజన్ సింగ్ వంటి భారత మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.
చదవండి: ధోనికి ఆ హోదా ఇవ్వడం మొదట్లో నచ్చలేదు: మాజీ లెఫ్టినెంట్ జనరల్


