నయనతార- విఘ్నేశ్ శివన్ (Nayanthara-Vignesh Shivan) దంపతులు ఫ్యామిలీ టైమ్ ఎంజాయ్ చేస్తున్నారు. ఎంతోకాలం ప్రేమలో మునిగి తేలిన వీరు 2022 జూన్ 9న పెళ్లి చేసుకున్నారు.
తాజాగా నాలుగో పెళ్లిరోజు సందర్భంగా ఇటలీలో వెకేషన్‌కు వెళ్లిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. కుమారులు ఉయిర్, ఉలగ్‌లను భుజాన ఎత్తుకుని వారికి ముద్దులిస్తున్న ఫోటోలు ముచ్చటగొల్పుతున్నాయి.


