పెద్ది.. ఎంతపని చేశావ్‌ బుచ్చిబాబు? | Peddi Is Remake Of This Film? | Sakshi
Sakshi News home page

పెద్ది.. ఎంతపని చేశావ్‌ బుచ్చిబాబు?

Jun 9 2026 10:49 AM | Updated on Jun 9 2026 11:48 AM

Peddi Is Remake Of This Film?

గ్లింప్స్‌తోనే అంచనాలు పెంచేసిన రామ్‌చరణ్‌ పెద్ది వరల్డ్‌ వైడ్‌ గ్రాండ్‌గా రిలీజైన విషయం తెలిసిందే..! గేమ్‌ ఛేంజర్‌ లాంటి డిజాస్టర్‌ తర్వాత చెర్రీ నుంచి వచ్చిన పాన్‌ ఇండియా  మూవీ ఇది. ఉప్పెన లాంటి బ్లాక్‌ బస్టర్‌ తర్వాత ఐదేళ్ల గ్యాప్‌తో బుచ్చిబాబు తీసిన సినిమా కూడా ఇదే. చాలా కాలం తర్వాత ఏఆర్‌ రెహమాన్‌ మ్యూజిక్‌ కంపోజ్‌ చేసిన తెలుగు మూవీ ఇదే కావడం మరో ప్రత్యేకం. ఈ సినిమాకు థియటర్లలో ఇప్పటి వరకూ ఐతే.. ఓకే అనే ఫీడ్‌బ్యాక్‌ వస్తోంది. స్టోరీ అద్భుతం కాకపోయినా.. మేకింగ్‌, రామ్‌చరణ్‌ యాక్టింగ్‌, మేకోవర్‌, ఏఆర్‌ రెహ్మాన్‌ మ్యూజిక్‌, టెక్నికల్‌ వాల్యూస్‌ సినిమాను గట్టెక్కించిందనే టాక్‌ వినిపిస్తోంది.

కాగా.. రిలీజ్‌కు ముందు తానేదో సొంతంగా స్టోరీ తయారు చేసుకుని తీసిన అద్భుతమైన సినిమా అని బుచ్చిబాబు బిల్డప్‌ ఇచ్చారు. కానీ.. రెండేళ్ల క్రితం బాలీవుడ్‌లో వచ్చిన చందు ఛాంపియన్‌ సినిమాను కొంచెం అటుఇటు తిప్పి తీసిన సినిమా పెద్ది అని టాలీవుడ్‌ జనాలు తొలి రోజే కనిపెట్టేశారు. చందు ఛాంపియన్‌ మూవీ చూసిన వారికి ఖచ్చితంగా పెద్ది రీమేక్‌ మూవీనా అనే డౌట్‌ రాక మానదు. ఇందులో కార్తీక్‌ ఆర్యన్‌ హీరో. స్టార్‌ డైరక్టర్‌ కబీర్‌ఖాన్‌ డైరక్షన్‌లో వచ్చిన ఈ మూవీ రెండేళ్ల క్రితం సరిగ్గా ఇదే సమ్మర్‌లో రిలీజైంది. ఐతే.. ఇది ఓ క్రీడాకారుడి రియల్‌ స్టోరీ అని మేకర్స్‌ ప్రకటించారు.

(చదవండి: పెద్ది మూవీ రివ్యూ)

చందు ఛాంపియన్‌ కూడా పీరియాడిక్‌ మూవీనే. 1960-70లో జరిగిన ఓ బాక్సర్‌ స్టోరీ ఇది. సేమ్‌ పెద్దిలో లాగానే ఓ మారుమూల గ్రామం నుంచి వచ్చిన పహిల్వాన్‌ కథ. పెద్దిలో హీరో తొలుత క్రికెటర్‌, తర్వాత పహిల్వాన్‌, ఆ తర్వాత పారా స్ప్రింటర్‌గా మారతాడు హీరో. చందు ఛాంపియన్‌లోనూ ఇంతే. ఇందులో హీరో తొలుత కుస్తీ వీరుడుగా కనిపిస్తాడు. ఆ తర్వాత మిలటరీలో చేరి బాక్సర్‌గా అవతారమెత్తుతాడు. అక్కడ యుద్ధంలో బుల్లెట్‌ తగిలి కాలు పోవడంతో స్విమ్మర్‌గా మారి పారా ఒలిపింక్స్‌లో పాల్గొని సత్తా చాటుతాడు.

 సేమ్‌ మన పెద్దిలో కూడా హీరో మొదట క్రికెటర్‌గా.. ఆ తర్వాత పహిల్వాన్‌గా.. అక్కడ్నుంచి రన్నర్‌గా మారి పారా ఒలింపిక్‌లో పాల్గొంటాడు. పెద్ది లాగా ఇది కూడా పీరియాడిక్‌ మూవీనే. అంతెందుకు చివరికి ప్రోమో కటింగ్‌ కూడా చందు ఛాంపియన్‌నే రెఫరెన్స్‌గా తీసుకున్నట్టు కనిపిస్తుంది. కాకపోతే పెద్ది స్టోరీకి విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌ను తగిలించి ఫుల్లుగా ఎమోషన్స్‌ పండించాడు బుచ్చిబాబు. 

అలాగే కేజీఎఫ్‌లో హీరోకి ఎలివేషన్‌ ఇస్తూ ముక్కలుముక్కులుగా చెప్పడం జరిగింది. చందు ఛాంపియన్‌ను మక్కీకి మక్కీ దించేయకుండా రెఫరెన్స్‌గా తీసుకోవడం వరకు బానే ఉందిగాని.. పెద్ది చూసిన వెంటనే ఆ సినిమా ఖచ్చితంగా గుర్తుకు వస్తుందంటూ సోషల్‌ మీడియాలో కామెంట్లు పేలుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement