కనోలి చ‌ర్య‌కు చాహ‌ల్ పిచ్చి చూపులు! | IPL 2026: Cooper Connolly Hit Ball Out-Of Stadium Chahal Reaction Viral | Sakshi
Sakshi News home page

కనోలి చ‌ర్య‌కు చాహ‌ల్ పిచ్చి చూపులు!

May 11 2026 10:52 PM | Updated on May 11 2026 11:24 PM

IPL 2026: Cooper Connolly Hit Ball Out-Of Stadium Chahal Reaction Viral

Photo Courtesy: IPL 2026

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 210 ప‌రుగుల భారీ స్కోరు చేసింది. మొద‌ట ప్రియాన్ష్ ఆర్య మెరుపు హాఫ్ సెంచ‌రీతో అద‌ర‌గొట్ట‌గా, చివ‌ర్లో శ్రేయ‌స్‌, క‌న్నోలి, సూర్యాంశ్‌లు ఫినిషింగ్ ట‌చ్ ఇచ్చారు. పంజాబ్ ఇన్నింగ్స్ స‌మ‌యంలో కూప‌ర్ క‌న్నోలి కొట్టిన ఒక భారీ సిక్స్ స్టేడియం అవ‌త‌ల ప‌డింది. 

ఈ నేప‌థ్యంలో పంజాబ్ బౌల‌ర్ య‌జ్వేంద్ర చాహ‌ల్ చ‌ర్య సోష‌ల్ మీడియాలో తెగ వైర‌లవుతోంది. విష‌యంలోకి వెళితే.. ఇన్నింగ్స్ 14.3 ఓవ‌ర్‌లో మిచెల్ స్టార్క్ వేసిన ఆఫ్ స్టంప్‌ బంతిని క‌నోలి ఫ్రంట్ ఫుట్ వ‌చ్చి భారీ సిక్స‌ర్ సంధించాడు. ప‌వ‌ర్ స్ట్రోక్ ఉప‌యోగించ‌డంతో బంతి స్టేడియం అవ‌త‌ల ప‌డింది. 

ఇదే స‌మ‌యంలో పంజాబ్ కింగ్స్ డ‌గౌట్‌లో ఉన్న చాహ‌ల్.. క‌నోలి కొట్టిన భారీ సిక్స్‌ను క‌న్నార్ప‌కుండా చూస్తూ.. ‘పోయింది.. బంతి పోయింది’ అన్న త‌ర‌హాలో చేతితో సైగ‌లు చేయ‌డం కెమెరా కంటికి చిక్కింది. చాహ‌ల్ చ‌ర్య అభిమానుల‌ను ఎంతగానో ఆక‌ర్షించింది. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. చాహ‌ల్ వీడియోపై మీరు ఒక లుక్కేయండి. 

మ్యాచ్ విష‌యానికొస్తే పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 210 ప‌రుగులు చేసింది. కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ (36 బంతుల్లో 59 నాటౌట్‌) అజేయ అర్థ‌సెంచ‌రీ సాధించ‌గా.. ఓపెన‌ర్ ప్రియాన్ష్ ఆర్య (33 బంతుల్లో 56) మెరుపు ఇన్నింగ్స్‌తో అల‌రించాడు. కూప‌ర్ క‌నోలి (38) కీల‌క ఇన్నింగ్స్ ఆడ‌గా.. చివ‌ర్లో సూర్యాంశ్ షెగ్డె (8 బంతుల్లో 22 నాటౌట్‌) ఆక‌ట్టుకున్నాడు. ఢిల్లీ బౌల‌ర్ల‌లో మిచెల్ స్టార్క్, మాధ‌వ్ తివారి చెరో 2 వికెట్లు తీయ‌గా, ముకేశ్ కుమార్ ఒక వికెట్ ప‌డ‌గొట్టాడు.

చదవండి: ఆర్సీబీ, ముంబై మ్యాచ్ ఫిక్స్‌.. ఇదిగో సాక్ష్యం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement