ఐపీఎల్ 2026 సీజన్‌లో లక్నో సూపర్‌జెయింట్స్‌తో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ విధ్వంసకర బ్యాటింగ్‌తో రెచ్చిపోయింది. ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య, వన్‌డౌన్ బ్యాటర్ కూపర్ కన్నోలి లక్నో బౌలర్లకు చుక్కలు చూపించారు. ప్రియాన్ష్ ఆర్య 37 బంతుల్లో 93 పరుగులు చేయగా, కూపర్ 47 బంతుల్లో 87 పరుగులు చేశాడు. అయితే ఇన్నింగ్స్ 13వ ఓవర్ వేసిన మార్కరమ్‌కు ఈ ఇద్దరు పీడకలను మిగిల్చారు.
13వ ఓవర్ స్ట్రైకింగ్ తీసుకున్న కూపర్ కన్నోలి మార్కరమ్ మొదటి బంతిని సిక్సర్‌గా మలిచాడు. రెండో బంతిని ఈసారి లాంగాన్ దిశగా సిక్సర్ కొట్టిన కన్నోలి మూడో బంతిని కూడా సిక్సర్‌గా మలిచాడు. ఆ తర్వాతి బంతిని వైడ్ వేయగా, నాలుగో బంతికి కూపర్ సింగిల్ తీయడంతో ప్రియాన్ష్ స్ట్రైక్‌లోకి వచ్చాడు. ఇక ప్రియాన్ష్ కూడా చివరి రెండు బంతులకు సిక్సర్లు కొట్టాడు.
దీంతో ఆ ఓవర్లో మొత్తం 5 సిక్సర్లు, వైడ్ సహా సింగిల్ మొత్తం 32 పరుగులు వచ్చాయి. ఈ నేపథ్యంలో మార్కరమ్ ఒక చెత్త రికార్డును తన పేరిట మూటగట్టుకున్నాడు. లక్నో తరఫున ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్‌గా మార్కరమ్ నిలిచాడు. గతంలో ఈ రికార్డు రవి బిష్ణోయ్ పేరిట ఉంది. 2022లో ఆర్సీబీతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో రవి బిష్ణోయ్ 27 పరుగులు సమర్పించుకున్నాడు.
ఇక 2026 సీజన్‌లో ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్ కూడా మార్కరమ్ మాత్రమే. ఈ సీజన్‌లోనూ ఇదే మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ ఓవర్ అని చెప్పొచ్చు. 2025 సీజన్‌లో ఖలీల్ అహ్మద్ (సీఎస్‌కే) ఆర్సీబీతో మ్యాచ్‌లో 33 పరుగులు, మొయిన్ అలీ (కేకేఆర్) రాజస్తాన్‌తో మ్యాచ్‌లో 32 పరుగులు సమర్పించుకున్నారు.
3️⃣2️⃣ runs of pure destruction 💥
🎥 Relive this carnage 👉 https://t.co/EpOcpY1lLb#TATAIPL | #KhelBindaas | #PBKSvLSG | @PunjabKingsIPL pic.twitter.com/eI5tuleNYM— IndianPremierLeague (@IPL) April 19, 2026


