మిల్ల‌ర్ ప్ర‌పంచ రికార్డు.. బవుమా సెంచరీ; సౌతాఫ్రికా భారీ స్కోరు | David Miller-Bavuma-Century-World-Records-Broken-Vs AUS 2nd ODI | Sakshi
Sakshi News home page

SA Vs AUS: మిల్ల‌ర్ ప్ర‌పంచ రికార్డు.. బవుమా సెంచరీ; సౌతాఫ్రికా భారీ స్కోరు

Sep 27 2026 5:19 PM | Updated on Sep 27 2026 5:39 PM

David Miller-Bavuma-Century-World-Records-Broken-Vs AUS 2nd ODI

Photo Credit: Twitter

జోహ‌న్నెస్‌బ‌ర్గ్ వేదిక‌గా ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న రెండో వ‌న్డేలో సౌతాఫ్రికా బ్యాట‌ర్లు రికార్డుల మీద రికార్డులు సాధిస్తున్నారు. ఇప్పటికే కెప్టెన్ టెంబా బ‌వుమా సెంచ‌రీతో చెల‌రేగ‌గా.. తాజాగా ఆ జ‌ట్టు విధ్వంసక‌ర బ్యాట‌ర్ డేవిడ్ మిల్ల‌ర్ ఏకంగా ప్ర‌పంచ రికార్డును త‌న పేరిట లిఖించుకున్నాడు. ఆస్ట్రేలియాపై వ‌న్డేల్లో అత్యంత త‌క్కువ బంతుల్లో సెంచ‌రీ చేసిన రెండో బ్యాట‌ర్‌గా మిల్ల‌ర్ రికార్డుల‌కెక్కాడు. 

గ‌తంలో హెన్రిచ్ క్లాసెన్ (2023లో 57 బంతుల్లో) సెంచ‌రీ చేసి తొలి స్థానంలో ఉండ‌గా.. 2016లో 69 బంతుల్లో సెంచ‌రీ సాధించిన మిల్ల‌ర్ తాజా  మ్యాచ్‌లో 73 బంతుల్లో శ‌త‌కం మార్క్‌ను చేరుకోవ‌డం విశేషం. వీరిద్ద‌రి త‌ర్వాత డికాక్ (74 బంతుల్లో), మార్క‌ర‌మ్ (74 బంతుల్లో) సెంచ‌రీలు సాధించారు.

👉ఇక వ‌న్డేల్లో ఆస్ట్రేలియాపై అత్య‌ధిక సెంచ‌రీలు చేసిన బ్యాట‌ర్ల జాబితాలోనూ మిల్ల‌ర్ చోటు ద‌క్కించుకున్నాడు. ఇప్ప‌టివ‌ర‌కు తాజా దానితో క‌లిపి నాలుగు సెంచ‌రీలు చేసిన మిల్ల‌ర్ రెండో స్థానంలో ఉండ‌గా, డుప్లెసిస్ (5 సెంచ‌రీలు) అగ్ర‌స్థానంలో కొన‌సాగుతున్నాడు. వీరిద్ద‌రి త‌ర్వాత డికాక్, హ‌ర్ష‌లే గిబ్స్ చెరో 3 సెంచ‌రీల‌తో కొన‌సాగుతున్నారు.

👉వ‌న్డేల్లో ఐదు లేదా ఆ త‌ర్వాతి స్థానాల్లో బ్యాటింగ్‌కు వ‌చ్చి సెంచ‌రీలు చేసిన బ్యాట‌ర్ల జాబితాలో మిల్ల‌ర్ (8 సెంచ‌రీలు) జోస్ బ‌ట్ల‌ర్‌తో క‌లిసి సంయుక్తంగా అగ్ర‌స్థానంలో కొన‌సాగుతున్నాడు. వీరిద్ద‌రి త‌ర్వాత ధోని, యువ‌రాజ్‌లు చెరో ఏడు సెంచ‌రీల‌తో త‌ర్వాతి స్థానంలో ఉన్నారు.

👉 ఆస్ట్రేలియాతో ఒక వ‌న్డే మ్యాచ్‌లో ఇద్ద‌రు సౌతాఫ్రికా బ్యాట‌ర్లు సెంచ‌రీలు చేయ‌డం ఇది మూడోసారి. మిల్ల‌ర్‌కు మాత్రం ఇది రెండోసారి. గ‌తంలో 2014లో ఆసీస్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో డుప్లెసిస్ (106), డివిలియ‌ర్స్ (136 నాటౌట్‌) తొలిసారి ఈ ఫీట్ సాధించారు. 2018లో హోబ‌ర్ట్ వేదిక‌గా డుప్లెసిస్ (125), మిల్ల‌ర్ (139) శ‌త‌కాలు బాదారు. తాజాగా బ‌వుమా, మిల్ల‌ర్‌లు మ‌రోసారి ఆస్ట్రేలియాపై ఒకే మ్యాచ్‌లో శ‌త‌కాల‌తో విరుచుకుప‌డ్డారు.

ఇక మ్యాచ్ విష‌యానికొస్తే.. కెప్టెన్ బ‌వుమా, మిల్ల‌ర్ సెంచరీల‌తో విధ్వంసం సృష్టించ‌డంతో సౌతాఫ్రికా 50 ఓవర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 365 ప‌రుగుల భారీ స్కోరు చేసింది. మిల్ల‌ర్ (93 బంతుల్లో 142; 12 ఫోర్లు, 9 సిక్స‌ర్లు) ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగ‌గా, బ‌వుమా (116 బంతుల్లో 103) క్లాస్ సెంచ‌రీతో ఆక‌ట్టుకున్నాడు. వీరిద్ద‌రు మిన‌హా మిగ‌తావాళ్ల‌లో  పెద్ద‌గా ఎవ‌రు ఆడ‌లేదు. చివ‌ర్లో డాన్ జాన్ (27 నాటౌట్‌), మార్కో జాన్సెన్ (19) మెరుపుల‌తో సౌతాఫ్రికా 350 ప‌రుగుల మార్క్‌ను దాటింది. ఆసీస్ బౌల‌ర్ల‌లో జాక్ ఎడ్‌వ‌ర్డ్స్ ఐదు వికెట్లు తీయ‌గా, హాజిల్‌వుడ్ 3 వికెట్లు ప‌డ‌గొట్టాడు.

ఇదీ చదవండి: ఆసియా గేమ్స్‌లో ఓట‌మి.. నిర్వాహ‌కుల‌ను ఏకిపారేసిన పీవీ సింధు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement