సెమీస్‌లో భారత ఆర్చరీ జట్లు | Indian archery teams in Asian Games semi finals | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో భారత ఆర్చరీ జట్లు

Sep 28 2026 2:38 AM | Updated on Sep 28 2026 2:38 AM

Indian archery teams in Asian Games semi finals

నగోయా: ఆసియా క్రీడల ఆర్చరీలో భారత పురుషుల, మహిళల కాంపౌండ్‌ జట్లు సెమీఫైనల్లోకి ప్రవేశించి పతకం రేసులో నిలిచాయి. వెన్నం జ్యోతి సురేఖ, తానిపర్తి చికిత, ప్రతీకలతో కూడిన భారత మహిళల జట్టు క్వార్టర్‌ ఫైనల్లో 233–230తో కజకిస్తాన్‌ జట్టును ఓడించింది. 

కుశాల్‌ దలాల్, సాహిల్‌ జాధవ్, గణేశ్‌ మణిరత్నంలతో కూడిన భారత పురుషుల జట్టు క్వార్టర్‌ ఫైనల్లో 235–232తో భూటాన్‌ జట్టుపై గెలిచింది. పురుషుల రికర్వ్‌ టీమ్‌ విభాగంలో బొమ్మదేవర ధీరజ్, యశ్‌దీప్, నీరజ్‌లతో కూడిన భారత జట్టు సెమీఫైనల్‌కు చేరింది. మిక్స్‌డ్‌ టీమ్‌ కాంపౌండ్‌ విభాగంలో చికిత–సాహిల్‌ జోడీ... మిక్స్‌డ్‌ టీమ్‌ రికర్వ్‌ విభాగంలో ధీరజ్‌–కుమ్‌కుమ్‌ జోడీ కూడా సెమీఫైనల్లోకి ప్రవేశించాయి.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement