132 రన్స్‌కే శ్రీలంక ఆలౌట్‌.. ఇంగ్లండ్‌దే వన్డే సిరీస్‌ | Sri Lanka-132 Runs All Out-3rd-ODI-Match-England-Seal-ODI Series | Sakshi
Sakshi News home page

132 రన్స్‌కే శ్రీలంక ఆలౌట్‌.. ఇంగ్లండ్‌దే వన్డే సిరీస్‌

Sep 27 2026 10:20 PM | Updated on Sep 27 2026 10:21 PM

Sri Lanka-132 Runs All Out-3rd-ODI-Match-England-Seal-ODI Series

Photo Credit: Twitter

ఇంగ్లండ్ పర్యటనలో టీ20 సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురైన శ్రీలంక, తాజాగా వన్డే సిరీస్‌ను కూడా ఆతిథ్య జట్టుకు కోల్పోయింది. లండన్ వేదికగా ఆదివారం జరిగిన చివరి వన్డేలో శ్రీలంకపై ఇంగ్లండ్ 223 పరుగుల భారీ తేడాతో విజయాన్ని అందుకుంది. ఇంగ్లండ్ విధించిన 356 పరుగుల టార్గెట్‌ను ఛేదించే క్రమంలో శ్రీలంక 29.1 ఓవర్లలో 132 పరుగులకే కుప్పకూలింది. ఈ నేపథ్యంలో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ఇంగ్లండ్‌ 2-1తో సొంతం చేసుకుంది.

లంక బ్యాటర్లలో కెప్టెన్ కుసాల్ మెండిస్ (35), జనిత్ లియానగె (19) పర్వాలేదనిపించారు. ఇంగ్లండ​ బౌలర్లలో లియామ్ డాసన్ 3 వికెట్లు తీయగా, గస్ అకిన్‌సన్ రెండు, సొన్ని బేకర్‌, రూట్‌, ఓవర్టన్ తలా ఒక వికెట్ తీశారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్‌ 50 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 355 ప‌రుగుల భారీ స్కోరు చేసింది. 

టామ్ బాంట‌న్ (126) సెంచ‌రీ చేయ‌గా, బ్రూక్ (77), జోర్డాన్ కాక్స్ (76) అర్థ‌సెంచ‌రీల‌తో రాణించారు. మిగతావారిలో విల్‌ జాక్స్‌ (25), జేమీ ఓవర్టన్‌ (21) పరుగులు చేశారు. లంక బౌల‌ర్ల‌లో అసితా ఫెర్నాండో మూడు, స‌చిందు రెండు వికెట్లు తీశారు. మొదటి 25 ఓవర్లలో 108 పరుగులు మాత్రమే చేసిన ఇంగ్లండ్‌ మిగతా 25 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 247 పరుగులు సాధించడం విశేషం. 

తొలి 25 ఓవర్లకు ఓవర్‌కు 4.32 రన్‌రేట్‌తో పరుగులు సాధించిన ఇంగ్లండ్‌ ఆ తర్వాతి 25 ఓవర్లలో 9.88 రన్‌రేట్‌తో పరుగులు రాబట్టింది. సెంచరీతో చెలరేగిన టామ్ బాంటన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌’, సిరీస్‌లో 9 వికెట్లు తీసిన విల్ జాక్స్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు లభించింది.

ఇదీ చదవండి: విరాట్‌ కోహ్లి ప్రపంచ రికార్డు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement