Photo Credit: BCCI Twitter
తిరువనంతపురం వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి వన్డేలో రన్ మెషిన్ విరాట్ కోహ్లి సెంచరీతో దుమ్మురేపాడు. 74 బంతుల్లో శతకం మార్క్ అందుకున్న కోహ్లి ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, ఆరు సిక్సర్లు ఉన్నాయి. అయితే గుదకేశ్ మోతీ బౌలింగ్‌లో 94 పరుగుల వద్ద ఉన్నప్పుడు భారీ సిక్సర్ బాదిన కోహ్లి సెంచరీ పూర్తి చేయడం విశేషం. కాగా కోహ్లికి వన్డేల్లో ఇది 55వ సెంచరీ.
ఈ క్రమంలో కోహ్లి మరో రికార్డును అందుకున్నాడు. లిస్ట్-ఏ క్రికెట్‌లో 59 సెంచరీలు చేసిన కోహ్లికి విండీస్‌పై సాధించిన సెంచరీ 60వది. ఈ క్రమంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 60 సెంచరీల రికార్డును సమం చేశాడు. అంతేకాదు 109 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద స్వదేశంలో వన్డేల్లో సచిన్ సాధించిన (6,796) పరుగుల రికార్డును కోహ్లి అధిగమించాడు.
The bat raise, the roar, the milestone 👏👏
A Virat Kohli show in Thiruvananthapuram 🍿
Updates ▶️ https://t.co/O2cs86p4gq#TeamIndia | #INDvWI | @mflone_ | @imVkohli pic.twitter.com/7pW58tYKeJ— BCCI (@BCCI) September 27, 2026


