విరాట్‌ కోహ్లి ప్రపంచ రికార్డు | Virat Kohli Completes 15000-ODI Runs-Faster Than-Sachin Tendulkar | Sakshi
Sakshi News home page

IND Vs WI: విరాట్‌ కోహ్లి ప్రపంచ రికార్డు.. సచిన్‌ను దాటేశాడు!

Sep 27 2026 8:41 PM | Updated on Sep 27 2026 9:04 PM

Virat Kohli Completes 15000-ODI Runs-Faster Than-Sachin Tendulkar

Photo Credit: BCCI Twitter

తిరువనంతపురం వేదిక‌గా వెస్టిండీస్‌తో జ‌రిగిన తొలి వ‌న్డే మ్యాచ్‌లో టీమిండియా ర‌న్‌మెషిన్ విరాట్ కోహ్లి మ‌రో మైలురాయిని చేరుకున్నాడు. 61 ప‌రుగుల వ్య‌క్తిగ‌త స్కోరు వ‌ద్ద కోహ్లి వ‌న్డేల్లో 15వేల ప‌రుగులు పూర్తి చేసుకున్నాడు. 15 వేల ప‌రుగులు పూర్తి చేసేందుకు కోహ్లికి 303 ఇన్నింగ్స్‌లు అవ‌స‌ర‌మ‌య్యాయి. 

త‌ద్వారా అంత‌ర్జాతీయ వ‌న్డేల్లో అత్యంత వేగంగా 15వేల ర‌న్స్ పూర్తి చేసిన తొలి క్రికెట‌ర్‌గా కోహ్లి నిలిచాడు. గ‌తంలో ఈ రికార్డు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (377 ఇన్నింగ్స్‌లు) పేరిట ఉంది. ఈ నేప‌థ్యంలో 15వేల పరుగుల మైలురాయి చేరుకునే క్రమంలో స‌చిన్ రికార్డును బ‌ద్ద‌లు కొట్టిన కోహ్లి ప్రపంచ రికార్డు సాధించాడు. 

అయితే వన్డే క్రికెట్‌లో అత్యధిక పరుగుల రికార్డు మాత్రం ఇప్పటికీ సచిన్ (18,426) పేరిటే ఉంది. సచిన్‌ అగ్రస్థానంలో కొనసాగుతుండ‌గా, కోహ్లి అత‌డిని అనుస‌రిస్తున్నాడు. లంక దిగ్గజ బ్యాటర్‌ కుమార సంగక్కర (14,234 పరుగులు) మూడో స్థానంలో, రికీ పాంటింగ్‌ (13,704 పరుగులు) నాలుగు, సనత్‌ జయసూర్య (13,430 పరుగులు) ఐదో స్థానంలో కొనసాగుతున్నారు.

కాగా సచిన్ 34 ఏళ్ల 66 రోజుల వయసులో సచిన్ 15వేల పరుగులు పూర్తి చేస్తే, కోహ్లి 37 ఏళ్ల 326 రోజుల వయసులో 15వేల మార్క్ అందుకున్నాడు. అయితే ఇన్నింగ్సల్ పరంగా చూసుకుంటే సచిన్‌కు 377 ఇన్నింగ్స్‌లు అవసరమవ్వగా, కోహ్లి కేవలం 303 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఫీట్ సాధించాడు. ఇక బంతుల పరంగా సచిన్ 17,528 బంతులు అవసరమవ్వగా.. కోహ్లికి 15,950 బంతులు అవసరమయ్యాయి.

 

ఇదీ చదవండి: ఐదు వికెట్లతో చెలరేగిన భారత బౌలర్‌.. ఆసీస్‌ 217 ఆలౌట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement