ఈ ద‌శాబ్దంలోనే రూట్‌ అత్యంత‌ చెత్త రికార్డు! | Root-Most-LBWs-2026-Calendar-Year-Worst Record-This Decade Vs SL | Sakshi
Sakshi News home page

ENG Vs SL: ఈ ద‌శాబ్దంలోనే రూట్‌ అత్యంత‌ చెత్త రికార్డు!

Sep 27 2026 7:12 PM | Updated on Sep 27 2026 7:26 PM

Root-Most-LBWs-2026-Calendar-Year-Worst Record-This Decade Vs SL

Photo Credit: Twitter

టీమిండియాతో వెస్టిండీస్‌, సౌతాఫ్రికాతో ఆస్ట్రేలియా.. ఇక శ్రీలంక‌తో ఇంగ్లండ్‌లు వ‌న్డే మ్యాచ్‌లు ఆడుతుండ‌డంతో 'సూప‌ర్ సండే' కాస్త 'సూప‌ర్ వ‌న్డే'లుగా మారిపోయింది. ఈ విష‌యం ప‌క్క‌న‌బెడితే.. శ్రీలంక‌తో జ‌రుగుతున్న మూడో వ‌న్డేలో ఇంగ్లండ్ కూడా భారీ స్కోరు దిశ‌గా సాగుతోంది. అయితే జ‌ట్టు సీనియ‌ర్ ఆట‌గాడు జో రూట్ మాత్రం అత్యంత చెత్త రికార్డును మూట‌గ‌ట్టుకున్నాడు. 

మ్యాచ్‌లో 37 బంతుల్లో 18 ప‌రుగులు చేసిన రూట్ జ‌నిత్ లియ‌నాగె బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. ఇన్నింగ్స్ 16వ ఓవ‌ర్ తొలి బంతిని షాట్ ఆడే ప్ర‌య‌త్నంలో బంతి మిస్స‌య్యి అత‌డి ప్యాడ్ల‌కు తాకింది. లంక ఆట‌గాళ్లు అప్పీల్ చేసిన‌ప్ప‌టికీ, అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. అయితే రివ్యూకు వెళ్లిన శ్రీలంక ఫ‌లితం సాధించింది. రిప్లేలో బంతి ప్యాడ్ల‌ను తాకుతూ ఆఫ్ స్టంప్‌ను ఎగురగొడుతున్న‌ట్లుగా చూపించింది. దీంతో రూట్ ఎల్బీగా పెవిలియ‌న్ చేరాడు. 

ఈ క్ర‌మంలోనే ఎల్బీడ‌బ్ల్యూల విష‌యంలో రూట్ చెత్త రికార్డు అందుకున్నాడు. ఈ ఏడాది క్యాలెండ‌ర్ ఇయ‌ర్‌లో అంత‌ర్జాతీయ క్రికెట్‌లో రూట్ 12 సార్లు ఎల్బీగా వెనుదిరిగాడు. త‌ద్వారా ఒకే క్యాలెండ‌ర్ ఇయ‌ర్‌లో అత్య‌ధిక సార్లు ఎల్బీగా వెనుదిరిగిన రెండో ఇంగ్లండ్ క్రికెట‌ర్‌గా రూట్ నిలిచాడు. గ‌తంలో 2007లో ఇంగ్లండ్ ఆల్‌రౌండ‌ర్ పాల్ కొలింగ్‌వుడ్ ఆ ఏడాదిలో 14 సార్లు ఎల్బీగా వెనుదిరిగి తొలి స్థానంలో ఉన్నాడు. 

ఓవ‌రాల్ జాబితాలో చెత్త రికార్డు సాధించిన‌ ఆరో క్రికెట‌ర్‌గా రూట్ ఉన్నాడు. సౌతాఫ్రికాకు చెందిన‌ ఆండ్రూ హ‌డ్స‌న్ (1994), న్యూజిలాండ్ ప్లేయ‌ర్‌ క్రిస్ హారిస్ (2002), బంగ్లాదేశ్ క్రికెట‌ర్‌ ఖ‌లీల్ మ‌సూద్ (2003), సౌతాఫ్రికా మాజీ కెప్టెన్‌ గ్రేమీ స్మిత్ (2006) త‌లో 12 సార్లు ఎల్బీగా వెనుదిరిగారు. 

అయితే పైన చెప్పుకున్న క్రికెట‌ర్లంతా 2010 టైమ్‌లైన్ కంటే ముందే ఆయా సంద‌ర్భాల్లో ఈ చెత్త ఫీట్‌ను సాధించారు. అయితే గ‌డిచిన ద‌శాబ్ద కాలంలో మాత్రం రూట్ మాత్ర‌మే ఒక క్యాలెండ‌ర్ ఇయ‌ర్‌లో ఇన్నిసార్లు ఎల్బీగా వెనుదిరగ‌డం గ‌మ‌నార్హం. 

ఇంగ్లండ్‌ భారీ స్కోరు..
ఇక మ్యాచ్‌లో ఇంగ్లండ్ 50 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 355 ప‌రుగుల భారీ స్కోరు చేసింది. టామ్ బాంట‌న్ (126) సెంచ‌రీ చేయ‌గా, బ్రూక్ (77), జోర్డాన్ కాక్స్ (76) అర్థ‌సెంచ‌రీల‌తో రాణించారు. మిగతావారిలో విల్‌ జాక్స్‌ (25), జేమీ ఓవర్టన్‌ (21) పరుగులు చేశారు. లంక బౌల‌ర్ల‌లో అసితా ఫెర్నాండో మూడు, స‌చిందు రెండు వికెట్లు తీశారు. 

మొదటి 25 ఓవర్లలో 108 పరుగులు మాత్రమే చేసిన ఇంగ్లండ్‌ మిగతా 25 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 247 పరుగులు సాధించడం విశేషం. తొలి 25 ఓవర్లకు ఓవర్‌కు 4.32 రన్‌రేట్‌తో పరుగులు సాధించిన ఇంగ్లండ్‌ ఆ తర్వాతి 25 ఓవర్లలో 9.88 రన్‌రేట్‌తో పరుగులు రాబట్టింది.

ఇదీ చదవండి: మిల్ల‌ర్ ప్ర‌పంచ రికార్డు.. బవుమా సెంచరీ; సౌతాఫ్రికా భారీ స్కోరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement