Photo Credit: BCCI Twitter
తిరువనంతపురం వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. వెస్టిండీస్ విధించిన 296 పరుగుల లక్ష్యాన్ని భారత్ 41.4 ఓవర్లలోనే కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. విరాట్ కోహ్లి (88 బంతుల్లో 139 నాటౌట్, 10 ఫోర్లు, 9 సిక్సర్లు), కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (108 బంతుల్లో 110 పరుగులు, 13 ఫోర్లు, ఒక సిక్సర్) సెంచరీలతో చెలరేగడంతో భారత్ సునాయాస విజయాన్ని సాధించింది.
రోహిత్ శర్మ 32 పరుగులు చేశాడు. విండీస్ బౌలర్లలో అల్జారీ జోసెఫ్, రోస్టన్ చేజ్ చెరొక వికెట్ పడగొట్టారు. అజేయ సెంచరీతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన విరాట్ కోహ్లికి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది. విండీస్‌పై విజయంతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భారత్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇరుజట్ల మధ్య రెండో వన్డే సెప్టెంబర్ 30న గౌహతి వేదికగా జరగనుంది.
అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 295 పరుగుల భారీ స్కోర్ సాధించింది. విండీస్ ఓపెనర్ జస్టిన్ గ్రీవ్స్(101) సెంచరీతో కదం తొక్కగా.. జాన్ క్యాంప్‌బెల్(62), అమీర్ జాంగో(58) అర్ధ శతకాలతో రాణించారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లు పడగొట్టగా, ప్రసిద్ద్ కృష్ణ రెండు వికెట్లు తీశాడు.
🔙 to 🔙 to seal the deal 👊#TeamIndia with a clinical chase in just 4️⃣1️⃣.4️⃣ overs to win by 8️⃣ wickets 👏👏
Scorecard ▶️ https://t.co/O2cs86p4gq#INDvWI | @mflone_ pic.twitter.com/SUj4bbE9rh— BCCI (@BCCI) September 27, 2026
ఇదీ చదవండి: సిక్సర్‌తో సెంచరీ పూర్తి చేసిన కోహ్లి


