breaking news
Tom Banton
-
132 రన్స్‌కే శ్రీలంక ఆలౌట్.. ఇంగ్లండ్‌దే వన్డే సిరీస్
ఇంగ్లండ్ పర్యటనలో టీ20 సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురైన శ్రీలంక, తాజాగా వన్డే సిరీస్‌ను కూడా ఆతిథ్య జట్టుకు కోల్పోయింది. లండన్ వేదికగా ఆదివారం జరిగిన చివరి వన్డేలో శ్రీలంకపై ఇంగ్లండ్ 223 పరుగుల భారీ తేడాతో విజయాన్ని అందుకుంది. ఇంగ్లండ్ విధించిన 356 పరుగుల టార్గెట్‌ను ఛేదించే క్రమంలో శ్రీలంక 29.1 ఓవర్లలో 132 పరుగులకే కుప్పకూలింది. ఈ నేపథ్యంలో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ఇంగ్లండ్ 2-1తో సొంతం చేసుకుంది.లంక బ్యాటర్లలో కెప్టెన్ కుసాల్ మెండిస్ (35), జనిత్ లియానగె (19) పర్వాలేదనిపించారు. ఇంగ్లండ బౌలర్లలో లియామ్ డాసన్ 3 వికెట్లు తీయగా, గస్ అకిన్సన్ రెండు, సొన్ని బేకర్, రూట్, ఓవర్టన్ తలా ఒక వికెట్ తీశారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 355 పరుగుల భారీ స్కోరు చేసింది. టామ్ బాంటన్ (126) సెంచరీ చేయగా, బ్రూక్ (77), జోర్డాన్ కాక్స్ (76) అర్థసెంచరీలతో రాణించారు. మిగతావారిలో విల్ జాక్స్ (25), జేమీ ఓవర్టన్ (21) పరుగులు చేశారు. లంక బౌలర్లలో అసితా ఫెర్నాండో మూడు, సచిందు రెండు వికెట్లు తీశారు. మొదటి 25 ఓవర్లలో 108 పరుగులు మాత్రమే చేసిన ఇంగ్లండ్ మిగతా 25 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 247 పరుగులు సాధించడం విశేషం. తొలి 25 ఓవర్లకు ఓవర్‌కు 4.32 రన్‌రేట్‌తో పరుగులు సాధించిన ఇంగ్లండ్ ఆ తర్వాతి 25 ఓవర్లలో 9.88 రన్‌రేట్‌తో పరుగులు రాబట్టింది. సెంచరీతో చెలరేగిన టామ్ బాంటన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’, సిరీస్‌లో 9 వికెట్లు తీసిన విల్ జాక్స్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు లభించింది.ఇదీ చదవండి: విరాట్ కోహ్లి ప్రపంచ రికార్డు -
బట్లర్ ప్రపంచ రికార్డు.. రెండో టీ20లో ఇంగ్లండ్ విజయం
కార్డిఫ్ వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఇంగ్లండ్ బ్యాటర్ జోస్ బట్లర్ ప్రపంచ రికార్డు సాధించాడు. టీ20 క్రికెట్లో 15వేల పరుగులు చేసిన తొలి ప్లేయర్‌గా బట్లర్ నిలిచాడు. కీరన్ పొలార్డ్ (14,999 రన్స్) రెండో స్థానంలో, అలెక్స్ హేల్స్ (14, 581 పరుగులు) మూడో స్థానంలో ఉన్నాడు. దీంతో పాటు బట్లర్ మరో రికార్డును కూడా తన పేరిట లిఖించుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో బట్లర్ రెండో స్థానానికి చేరుకున్నాడు. మ్యాచ్‌లో 30 పరుగులు సాధించిన బట్లర్ 162 ఇన్నింగ్స్‌ల్లో 4,322 పరుగులు చేశాడు.మ్యాచ్ విషయానికొస్తే ఇంగ్లండ్ 6 వికెట్ల తేడాతో శ్రీలంకపై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 145 పరుగులకు పరిమితమైంది. ఓపెనర్ పాతుమ్ నిస్సాంక (37) టాప్ స్కోరర్‌గా నిలవగా, చరిత్ అసలంక (31) పర్వాలేదనిపించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో లియామ్ డాసన్ 3 వికెట్లు తీయగా, జేమీ ఓవర్టన్, జోఫ్రా ఆర్చర్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. PC: ECB Twitterఅనంతరం బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 12.1 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసి గెలుపొందింది. టామ్ బాంటన్ (24 బంతుల్లో 52 నాటౌట్) అజేయ అర్థసెంచరీతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించగా, జోస్ బట్లర్ (30), కెప్టెన్ హ్యారీ బ్రూక్ (23) రాణించారు. లంక బౌలర్లలో చమీర, హసరంగ, మలింగ, రత్నాయకే తలా ఒక వికెట్ తీశారు. ఫలితంగా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో సిరీస్ కైవసం చేసుకున్న ఇంగ్లండ్ క్లీన్‌స్వీప్‌పై దృష్టి సారించగా, లంక మాత్రం చివరి మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని చూస్తోంది. ఇరుజట్ల మధ్య మూడో టీ20 రేపు మాంచెస్టర్ వేదికగా జరగనుంది. టీ20ల్లో శ్రీలంకపై ఇంగ్లండ్‌కు ఇది వరుసగా 14వ విజయం కాగా, కెప్టెన్‌గా బ్రూక్‌కు 25 మ్యాచ్‌ల్లో 22వ విజయం కావడం విశేషం.ఇదీ చదవండి: విదేశీ విద్యార్థులకు షాకిచ్చిన ఆస్ట్రేలియా ప్రభుత్వం! -
వణికించిన పసికూన!.. పట్టలేనంత ఆనందం: హ్యారీ బ్రూక్
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో ఇప్పటికే రెండు సంచలనాలు నమోదయ్యాయి. టోర్నీకి తొలిసారి అర్హత సాధించిన ఇటలీ.. మూడోసారి వరల్డ్‌కప్ ఆడుతున్న నేపాల్‌ను ఓడించింది. ఇక మాజీ చాంపియన్ ఆస్ట్రేలియాకు పసికూన జింబాబ్వే షాకిచ్చింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో చాంపియన్ జట్టును ఓడించింది.ఇక తాజాగా గ్రూప్-సిలో భాగంగా ఇంగ్లండ్‌కు పసికూన స్కాట్లాండ్ చెమటలు పట్టించింది. నేపాల్‌తో మ్యాచ్‌లో ఎలాగోలా గట్టెక్కిన బ్రూక్ బృందం.. స్కాటిష్ జట్టుపైనా అదే రీతిలో గెలిచి ఊపిరి పీల్చుకుంది. తద్వారా సూపర్-8 ఆశలను సజీవం చేసుకుంది.ఈరోజు కూడా గెలుపు గీత దాటేశాముఈ నేపథ్యంలో ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ (Harry Brook) తమ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన టామ్ బాంటన్ (Tom Banton)ను ప్రశంసించాడు. అదే విధంగా జోఫ్రా ఆర్చర్ (Jofra Archer) సైతం మరోసారి అద్భుతంగా బౌలింగ్ చేశాడని కొనియాడాడు. "ఈరోజు కూడా మేము గెలుపు గీతను దాటేశాము. పట్టలేనంత సంతోషం.మా స్పిన్ బౌలింగ్‌లో స్కాట్లాండ్ బ్యాటర్లు అద్భుతంగా ఆడారు. ఆ సమయంలో వారు మాకంటే ముందంజలో నిలిచారు. అయితే, మేము తిరిగి పుంజుకున్నాం. ఆర్చర్ తన మ్యాజిక్ చూపించాడు.జాగ్రత్తగానే ఉంటాముఇక లక్ష్య ఛేదనలో బాంటన్ అద్భుతం చేశాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి గొప్పగా ఆడాడు. కోల్‌కతా వికెట్ బాగుంది. సామ్ కర్రాన్ సైతం కాసేపు మెరుపులు మెరిపించాడు. మా చివరి మ్యాచ్‌లో ఇటలీతో తలపడతాం. వాళ్లతో జాగ్రత్తగానే ఉంటాము’’ అని హ్యారీ బ్రూక్ చెప్పుకొచ్చాడు. కాగా కోల్‌కతా వేదికగా శనివారం ఇంగ్లండ్- స్కాట్లాండ్ తలపడ్డాయి.వణికించిన పసికూనఈ మ్యాచ్‌లో టాస్ నెగ్గిన ఇంగ్లండ్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన స్కాట్లాండ్ 19.4 ఓవర్లలో 152 పరుగుల వద్ద ఆలౌటైంది. కెప్టెన్ రిచీ బెరింగ్టన్ (32 బంతుల్లో 49; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), మైకేల్ జోన్స్ (20 బంతుల్లో 33; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లు రషీద్ (3/36), ఆర్చర్ (2/24), డాసన్ (2/34) స్కాట్లాండ్ బ్యాటర్ల పనిపట్టారు.అనంతరం లక్ష్యఛేదనకు దిగిన ఇంగ్లండ్ 18.2 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసి గెలిచింది. ఆరంభమైన తొలి ఓవర్లో సాల్ట్ (2), రెండో ఓవర్లో బట్లర్ (3)... ఇలా ఇద్దరు మేటి హిట్టర్లను 13 పరుగులకే కోల్పోయింది. ఈ దశలో బెథెల్ (28 బంతుల్లో 32; 2 ఫోర్లు, 1 సిక్స్), బాంటన్ ఇంగ్లండ్‌ను ఆదుకున్నారు.గెలిపించిన బాంటన్అయితే జట్టు స్కోరు 79 వద్ద బెథెల్, కాసేపటికే కెప్టెన్ బ్రూక్ (4) వికెట్లు పారేసుకోవడంతో మళ్లీ 86/4 స్కోరు వద్ద ఇంగ్లండ్ కష్టాల్లో పడింది. దీంతో జట్టును గెలిపించే బాధ్యతను పూర్తిగా తన భుజాన వేసుకున్న టామ్ బాంటన్ (41 బంతుల్లో 63 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) అజేయ అర్ధసెంచరీతో గెలిపించాడు.బాంటన్‌కు తోడు సామ్ కరన్ (20 బంతుల్లో 28; 1 ఫోర్, 2 సిక్స్‌లు), జాక్స్ (16 నాటౌట్)లు రాణించారు. ఫలితంగా ఇంకో 10 బంతులు మిగిలుండగానే ఇంగ్లండ్ ఐదు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. మెక్‌ములెన్, క్యూరి, వీల్, లీస్క్ తలా ఒక వికెట్ తీశారు. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్ తమ రెండోమ్యాచ్‌లో వెస్టిండీస్ చేతిలో ఓడిన సంగతి తెలిసిందే. History made! ✍️England register their first-ever T20 World Cup win over a European side with a solid five-wicket victory over Scotland. 👏Up next ➡️ ICC Men’s #T20WorldCup | #NZvSA | LIVE NOW 👉 https://t.co/QWNvn10eTj pic.twitter.com/mscD1rxSmH— Star Sports (@StarSportsIndia) February 14, 2026చదవండి: IND vs PAK: ‘వర్షం పడాలని దేవుడిని ప్రార్థిస్తున్నా’


