రోహిత్- విరాట్ (ఫైల్ ఫొటో PC: BCCI X)
స్వదేశంలో వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో టీమిండియా శుభారంభం అందుకుంది. తిరువనంతపురంలో ఆదివారం జరిగిన తొలి వన్డేలో విండీస్ జట్టును ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించింది. ఫలితంగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో శుబ్‌మన్ గిల్ సేన 1-0తో ముందంజ వేసింది.
ఈ క్రమంలో సంబరాల్లో మునిగిపోయిన టీమిండియా.. బస్సులో హోటల్‌కు తిరిగి వచ్చే క్రమంలో ఓ అపశ్రుతి చోటుచేసుకుంది. భారత దిగ్గజ ఓపెనర్ రోహిత్ శర్మ బస్సు దిగుతున్నపుడు అదుపు తప్పి కిందపడిపోయాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్‌గా మారాయి.
32 పరుగులు చేసి అవుట్
కాగా వెస్టిండీస్ విధించిన 296 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రోహిత్ శర్మ.. 35 బంతుల్లో రెండు ఫోర్లు, మూడు సిక్సర్లు బాది 32 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అల్జారీ జోసెఫ్ బౌలింగ్‌లో జువెల్ ఆండ్రూకు క్యాచ్ ఇవ్వడంతో హిట్‌మ్యాన్ పెవిలియన్ చేరాల్సి వచ్చింది.
ఇక మరో ఓపెనర్, కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (108 బంతుల్లో 110), వన్‌డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లి (88 బంతుల్లో 139 నాటౌట్) శతకాల మోత మోగించి టీమిండియాను గెలిపించారు. ఇదిలా ఉంటే.. విజయం తర్వాత భారత జట్టు టీమ్ బస్సులో హోటల్‌కు వెళ్లింది.
Moment for the history books 📖
The magical feeling of scaling Mt. 1⃣5⃣0⃣0⃣0⃣ ODI runs, ft. Virat Kohli 🏔️
Updates ▶️ https://t.co/O2cs86p4gq#TeamIndia | #INDvWI | @mflone_ | @imVkohli pic.twitter.com/sbqA6KtBsr— BCCI (@BCCI) September 27, 2026
బస్సు నుంచి పడిపోయిన రోహిత్
బస్సు నుంచి దిగుతున్నపుడు రోహిత్ పట్టు తప్పి మెట్ల మీది నుంచి కిందపడిపోయాడు. పక్కన ఉన్న వాళ్లు వచ్చి అతడికి సాయం చేసి పక్కకు తీసుకువెళ్లారు.
అప్పటికే సహచర ఆటగాళ్లు ముందుకు వెళ్లగా.. కోహ్లి వెనక్కి తిరిగి రోహిత్ పరిస్థితి చూసి షాకయ్యాడు. అంతా బాగానే ఉంది కదా అన్నట్లుగా ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాడు. ఈ దృశ్యాలు వైరల్ కాగా.. ‘రో-కో.. మైదానం లోపల, వెలుపలా.. వారి స్నేహ బంధం గొప్పది’ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
చదవండి: IND vs WI: అతడొక అద్భుతం.. మ్యాచ్ నేనే ముగించాల్సింది
Rohit Sharma 𝗦𝗹𝗶𝗽𝗽𝗲𝗱 from the Bus 😱
While returning to the hotel after winning the first ODI against the West Indies, Rohit Sharma slipped badly on the stairs of the team bus. 😥
- Everyone was celebrating India's win, but Virat Kohli was 𝘀𝘁𝘂𝗻𝗻𝗲𝗱 to see Rohit. 😭 pic.twitter.com/T01Lf4tJsb— Mukku (@Cric_Mukku) September 28, 2026


