బవుమా-డికాక్ మధ్య తీవ్ర వాగ్వాదం | Bavuma Vs de Kock, Heated DRS Argument During South Africa Vs Australia 2nd ODI, Watch Video Viral On Social Media | Sakshi
Sakshi News home page

బవుమా-డికాక్ మధ్య తీవ్ర వాగ్వాదం

Sep 28 2026 11:03 AM | Updated on Sep 28 2026 11:16 AM

Temba Bavuma, Quinton de Kock Fight, SA Teammates Intervene

source: crex

ఆస్ట్రేలియాతో నిన్న జరిగిన రెండో వన్డేలో సౌతాఫ్రికా ఆటగాళ్ల మధ్య వివాదం చోటు చేసుకుంది. డీఆర్‌ఎస్‌ విషయంలో కెప్టెన్‌ టెంబా బవుమా నిర్ణయంపై సీనియర్‌ ఆటగాడు క్వింటన్‌ డికాక్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సహచరులు జోక్యం చేసుకొని ఇద్దరిని శాంతపరచడంతో వివాదం అక్కడికి ముగిసింది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ 48వ ఓవర్‌లో లిజాడ్‌ విలియమ్స్‌ వేసిన బంతి జేవియర్‌ బార్ట్‌లెట్‌ వెనుక కాలికి తగిలింది. బంతి లెగ్‌ సైడ్‌ వైపు వెళ్తున్నట్లు భావించిన అంపైర్‌ నాటౌట్‌గా ప్రకటించాడు.

బౌలర్‌ విలియమ్స్‌ మాత్రం డీఆర్‌ఎస్‌ కోరేందుకు ఆసక్తి చూపాడు. అయితే వికెట్ల వెనుక ఉన్న డికాక్‌ మాత్రం రివ్యూకు వెళ్లేందుకు అంతగా ఆసక్తి చూపలేదు. కెప్టెన్‌ బవుమా మాత్రం వెంటనే డీఆర్‌ఎస్‌ తీసుకున్నాడు.

దీంతో డికాక్‌ తన అభిప్రాయాన్ని బవుమాకు గట్టిగా చెప్పాడు. ఇద్దరి మధ్య కొద్దిసేపు తీవ్ర వాగ్వాదం జరిగింది. పరిస్థితి ముదరకుండా సహచర ఆటగాళ్లు ఇద్దరిని శాంతపరిచారు.

చివరికి రివ్యూలో బంతి వికెట్లను తాకే అవకాశం ఉందని తేలడంతో అంపైర్‌ నిర్ణయం మారింది. బార్ట్‌లెట్‌ ఎల్‌బీడబ్ల్యూగా ఔటయ్యాడు. దీంతో డికాక్‌ అంచనా తప్పని తేలింది.

డికాక్‌ మాట విని డీఆర్‌ఎస్‌ తీసుకోకపోయుంటే..!
ఒకవేళ బవుమా డికాక్‌ మాట విని డీఆర్‌ఎస్‌ తీసుకోకపోయుంటే పరిస్థితి వేరేలా ఉండేది. ఎందుకంటే అప్పటికే బార్ట్‌లెట్‌ సుడిగాలి అర్ద శతకంతో సౌతాఫ్రికా ఆటగాళ్లలో గుబులు రేకెత్తించాడు. బవుమా కాన్ఫిడెంట్‌గా రివ్యూ తీసుకోవడంతో సౌతాఫ్రికాకు మేలు జరిగింది. 

సౌతాఫ్రికా నిర్దేశించిన 366 పరుగుల లక్ష్యానికి ఆసీస్‌ 33 పరుగుల దూరంలో నిలిచిపోయి ఓటమిపాలైంది. ఈ గెలుపుతో సౌతాఫ్రికా సిరీస్‌ను కూడా కైవసం చేసుకుంది.

బవుమా నిర్ణయం మ్యాచ్‌ ఫలితాన్నే కాకుండా సిరీస్‌ ఫలితాన్ని కూడా ప్రభావితం చేసిందని సౌతాఫ్రికా అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బవుమా నిర్ణయం పట్ల వ్యతిరేకత వ్యక్తం చేసిన డికాక్‌పై వారు మండిపడుతున్నారు. అతడు కెప్టెన్‌.. అతని నిర్ణయానికి మర్యాద ఇవ్వాలంటూ సోషల్‌మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు.

కాగా, బవుమా-డికాక్‌ మధ్య విభేదాలు కొత్తేమీ కాదు. 2021 టీ20 ప్రపంచకప్‌ సమయంలో డికాక్‌ బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్‌కు మద్దతుగా మోకాళ్లపై కూర్చునే నిర్ణయాన్ని పాటించకుండా మ్యాచ్‌ నుంచి తప్పుకున్నాడు. ఆ సమయంలో కెప్టెన్‌గా ఉన్న బవుమా.. డికాక్‌ నిర్ణయంతో తాము ఆశ్చర్యానికి గురయ్యామని చెప్పాడు. అయితే డికాక్‌ వ్యక్తిగత నిర్ణయాన్ని, అతడి అభిప్రాయాలను తాము గౌరవిస్తామని కూడా స్పష్టం చేశాడు.

ఇదీ చదవండి: జగజ్జేతలను చిత్తు చేసిన బవుమా సేన



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement