వన్డే వరల్డ్‌కప్‌.. టీమిండియా షెడ్యూల్‌ ఇదే | India Schedule for 2027 World Cup- Fixtures | Sakshi
Sakshi News home page

వన్డే వరల్డ్‌కప్‌.. టీమిండియా షెడ్యూల్‌ ఇదే

Oct 2 2026 8:15 AM | Updated on Oct 2 2026 8:31 AM

India Schedule for 2027 World Cup- Fixtures

క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్‌-2027 షెడ్యూల్‌ వచ్చేసింది. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికలుగా జరగనున్న ఈ మెగా టోర్నీ 2027 అక్టోబర్ 2న ప్రారంభమై, నవంబర్ 21న జరిగే ఫైనల్ మ్యాచ్‌తో ముగియనుంది.

ఈ టోర్నమెంట్‌లో టీమిండియా హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. గత ప్రపంచకప్‌లో తృటిలో చేజారిన ట్రోఫీని ఈసారి ఎలాగైనా సొంతం చేసుకుని 16 ఏళ్ల నిరీక్షణకు తెరదించాలని భారత జట్టు పట్టుదలతో ఉంది. ఈ మెగా ఈవెంట్‌లో భారత్.. పాకిస్తాన్‌‌, అఫ్గానిస్తాన్‌, ఆస్ట్రేలియా, జింబాబ్వేలతో కలిసి గ్రూప్-ఎలో ఉంది.

టీమిండియా పూర్తి షెడ్యూల్
శుబ్‌మన్ గిల్ నాయకత్వంలోని భారత జట్టు తమ తొలి మ్యాచ్‌లోనే బలమైన ఆస్ట్రేలియాను ఢీకొట్టనుంది. లీగ్ స్టేజ్ మ్యాచ్‌ల తర్వాత సూపర్‌-7 దశ పోరు ప్రారంభమవుతుంది.

అక్టోబర్ 7: భారత్ vs ఆస్ట్రేలియా (కేప్‌టౌన్)

అక్టోబర్ 10: భారత్ vs పాకిస్తాన్ (జోహాన్నిస్‌బర్గ్ - వాండరర్స్)

అక్టోబర్ 14: భారత్ vs అఫ్గానిస్థాన్ (ట్ష్వానే)

అక్టోబర్ 17: భారత్ vs క్వాలిఫైయర్-ఎ (బ్లూమ్‌ఫోంటైన్)

అక్టోబర్ 24: భారత్ vs జింబాబ్వే (విక్టోరియా ఫాల్స్)

కాగా ఈ ప్రపంచకప్‌కు ముందు ఆతిథ్య సౌతాఫ్రికాతో 6 వన్డేల సిరీస్‌లో భారత్ తలపడనున్నట్లు తెలుస్తోంది. జోహన్స్‌బర్గ్‌, కేప్‌టౌన్‌, సెంచూరియన్ వేదికల్లో ఈ మ్యాచ్‌లు జరగనున్నట్లు ఇండియన్ ఎక్స్ ప్రెస్ కథనం పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement