దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికలగా జరగనున్న వన్డే ప్రపంచకప్-2027 షెడ్యూల్‌ను ఐసీసీ విడుదల చేసింది. ఈ మెగా టోర్నీ వచ్చే ఏడాది అక్టోబర్ 2న సూపర్ సిరీస్‌తో ప్రారంభమై నవంబర్ 21న ఫైనల్ మ్యాచ్‌తో ముగియనుంది. ఈ టోర్నమెంట్‌లో మొత్తం 14 జట్లు పాల్గొంటున్నాయి.

ఈ జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూపు-ఎలో అఫ్గానిస్తాన్, ఆస్ట్రేలియా, భారత్, పాకిస్తాన్, జింబాబ్వే, క్వాలిఫయర్-ఎ ఉండగా.. గ్రూపు-బిలో దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్, క్వాలిఫయర్-బి జట్లు ఉన్నాయి.
ఈ మెగా ఈవెంట్‌లో భారత్ తమ తొలి మ్యాచ్‌లో అక్టోబర్ 7 కేప్‌టౌన్ వేదికగా ఆస్ట్రేలియాతో తలపడనుంది. అనంతరం అక్టోబర్ 10న జోహాన్స్‌బర్గ్ వేదికగా చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో టీమిండియా అమీతుమీ తెల్చుకోనుంది.


