PC: BCCI Domestic
ఇరానీ కప్-2026 మ్యాచ్‌లో టీమిండియా స్టార్ రిషభ్ పంత్ తీవ్రంగా నిరాశపరిచాడు. రెస్టాఫ్ ఇండియా జట్టు కెప్టెన్‌గా బరిలోకి దిగిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్ పట్టుమని పది పరుగులే చేసి పెవిలియన్ చేరాడు.
శ్రీనగర్‌లోని షేర్-ఇ-కశ్మీర్ స్టేడియంలో రెస్టాఫ్ ఇండియా- రంజీ తాజా చాంపియన్ జమ్మూ కశ్మీర్ జట్ల మధ్య గురువారం ఇరానీ కప్ మ్యాచ్ మొదలైంది. టాస్ గెలిచిన ఆతిథ్య జమ్మూ జట్టు.. తొలుత బౌలింగ్ ఎంచుకుంది.
ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన రెస్టాఫ్ ఇండియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. ఓపెనర్ సనత్ సాంగ్వాన్ (1), వన్‌డౌన్ బ్యాటర్ సుదీప్ కుమార్ ఘరామి (8) సింగిల్ డిజిట్ స్కోర్లకే వెనుదిరిగారు.
Maiden first-class wicket ☝️
🎥 All smiles for Lone Nasir who picks up the big wicket of Sudip Gharami 👏#IraniCup | @mflone_ pic.twitter.com/xZQc6GTiBF— BCCI Domestic (@BCCIdomestic) October 1, 2026
ఇలాంటి తరుణంలో టీమిండియా స్టార్ సర్ఫరాజ్ ఖాన్ (97 బంతుల్లో 45) మెరుగైన ప్రదర్శనతో ఇన్నింగ్స్ గాడిన పెట్టగా.. రిషభ్ పంత్ మాత్రం (36 బంతుల్లో 10) విఫలమయ్యాడు. ఇక సర్ఫరాజ్‌కు తోడుగా స్మరణ్ రవిచంద్రన్ అర్ధ శతకం (83 బంతుల్లో 68)తో రాణించాడు.
మిగిలిన వారిలో ఆకాశ్ దీప్ చెప్పుకోదగ్గ స్కోరు (22) చేశాడు. ఫలితంగా రెస్టాఫ్ ఇండియా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 237 పరుగులు చేసి ఆలౌట్ అయింది. జమ్మూ కశ్మీర్ బౌలర్లలో సునిల్ కుమార్, లోనే నాసిర్ ముజాఫర్ మూడేసి వికెట్లు కూల్చగా.. ఉమర్ నాజిర్ మిర్ రెండు, అబిద్ ముస్తాక్, సాహిల్ లోత్రా తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.
ఇక తొలి రోజు ఆటలోనే బ్యాటింగ్ మొదలుపెట్టిన జమ్మూ జట్టు.. గురువారం ఆట పూర్తయ్యేసరికి ఏడు ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 21 పరుగులు చేసింది. ఓపెనర్ కమ్రాన్ ఇక్బాల్ 12, శుభం ఖజూరియా సున్నా పరుగులతో ఉన్నారు.
చదవండి: ఇదేమీ అంత ఈజీ కాదు: గంభీర్‌కు విరుద్ధంగా గిల్ కామెంట్లు


