breaking news
Irani Cup 2026
-
కివీస్‌తో టెస్టు సిరీస్.. ఆ ఇద్దరు స్టార్ బౌలర్లకు చాన్స్!
ఇరానీ కప్-2026ను రెస్టాఫ్ ఇండియా దక్కించుకోవడంలో ఆ జట్టు బౌలర్లు ముకేశ్ కుమార్, ఆకాశ్ దీప్ కీలకపాత్ర పోషించారు. రంజీ చాంపియన్ జమ్మూ కశ్మీర్‌తో జరిగిన మ్యాచ్‌లో రెస్టాఫ్ ఇండియా 167 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి ఇరానీ కప్‌ను సొంతం చేసుకుంది. ముకేశ్ కుమార్ తొలి ఇన్నింగ్స్‌లో రెండు, రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల హాల్ (6/33) చెలరేగి మొత్తం 8 వికెట్లు ఖాతాలో వేసుకోగా, మరో పేసర్ ఆకాశ్ దీప్ సైతం తన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లు కలిపి ఆరు వికెట్లు తీసినప్పటికీ తక్కువ ఎకానమీతో వికెట్లు తీయడం విశేషం. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు బెంగాల్ బౌలర్లకు న్యూజిలాండ్‌తో జరగబోయే టెస్టు సిరీస్‌కు ఎంపిక చేయాలని బీసీసీఐ భావిస్తోంది. Photo Credit: Twitterకివీస్ పిచ్‌లు పేసర్లకు అనుకూలం..టీమిండియా హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్ కూడా వీరిద్దరి విషయంలో పాజిటివ్ దృక్పథంతోనే ఉన్నట్లు తెలుస్తోంది. కివీస్ పిచ్‌లు పేసర్లకు అనుకూలంగా ఉండడంతో వీలైనంత ఎక్కువ పేస్ బౌలర్లను బెంచ్‌పై ఉంచుకుంటేనే మంచిదని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తోంది. ఆకాశ్ దీప్ న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు ఎంపికవుతాడని ముందే ఊహించినప్పటికీ, ఇరానీ కప్‌లో సంచలన ప్రదర్శన ద్వారా ఇప్పుడు ముకేశ్ కుమార్ కూడా జట్టులో చోటు దక్కించుకునే అవకాశముంది. నవంబర్ 19 నుంచి టెస్టు సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో వచ్చే వారంలో బీసీసీఐ సెలెక్షన్ కమిటీ న్యూజిలాండ్ టూర్‌కు 16 నుంచి 17 మందితో కూడిన భారత జట్టును ప్రకటించే అవకాశముంది. భారత ఫ్రంట్‌లైన్ పేసర్లుగా బుమ్రా, సిరాజ్ ఉండడంతో వీరికి బ్యాకప్‌గా ముకేశ్ కుమార్, ఆకాశ్‌దీప్‌లను ఎంపిక చేయాలని భావిస్తోంది. అయితే సెప్టెంబర్‌లో కండరాల గాయంతో బాధపడిన ముకేశ్ కుమార్ ఇరానీ కప్‌లో ఫిట్‌గా కనిపించినప్పటికీ, కివీస్‌తో టెస్టు సిరీస్‌కు మాత్రం ముకేశ్ ఫిట్నెస్ టెస్టు నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఇక న్యూజిలాండ్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ టీమిండియాకు చాలా కీలకం. వచ్చే ఏడాది టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ ఆడాలంటే భారత్.. కివీస్‌తో రెండు టెస్టులు కచ్చితంగా గెలవాల్సి ఉంటుంది. ప్రస్తుతం భారత్ 51.52 పీసీటీతో పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఇటీవలే శ్రీలంకతో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను గిల్ సేన 1-0తో కైవసం చేసుకుంది. తొలి టెస్టులో భారీ విజయం సాధించినప్పటికీ, రెండో టెస్టును డ్రా చేసుకోవడం వల్ల భారత్ స్థానంలో ఎలాంటి మార్పు లేదు.ఐదు టీ20లు, ఐదు వన్డేలు, రెండు టెస్టులుఇక న్యూజిలాండ్ పర్యటనలో టీమిండియా రెండు టెస్టు మ్యాచ్‌లతో పాటు ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్, ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడనుంది. మొదట అక్టోబర్ 22 నుంచి నవంబర్ ఒకటి వరకు ఐదు టీ20 మ్యాచ్‌లు, నవంబర్ 4 నుంచి 15 మధ్య ఐదు వన్డేలు, ఆ తర్వాత నవంబర్ 19 నుంచి తొలి టెస్టు, నవంబర్ 27 నుంచి రెండో టెస్టు ఆడనుంది.ఇదీ చదవండి: టీమిండియాకు భారీ షాక్.. విండీస్ జట్టులోకి విధ్వంసకర వీరుడు -
చెలరేగిన సీఎస్కే బౌలర్.. రెస్టాఫ్ ఇండియాదే ఇరానీ కప్
ఇరాన్ కప్ విజేతగా రెస్టాఫ్ ఇండియా నిలిచింది. రంజీ చాంపియన్ జమ్మూ కశ్మీర్‌తో జరిగిన మ్యాచ్‌లో రెస్టాఫ్ ఇండియా 167 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో హఫ్ సెంచరీ, రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన స్మరణ్ రవిచంద్రన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. 278 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జమ్మూ కశ్మీర్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 111 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్లు ఖుమ్రాన్ ఇక్బాల్ (32), శుభమ్ కజురియా (36) మినహా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. రెస్టాఫ్ బౌలర్లలో ముకేశ్ కుమార్ ఆరు వికెట్లతో చెలరేగగా, ఆకాశ్ దీప్ 3 వికెట్లు, ముకేశ్ చౌదరీ ఒక వికెట్ పడగొట్టారు. అంతకముందు రెస్టాఫ్ ఇండియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 237 పరుగులకు ఆలౌట్ కాగా, జమ్మూ కశ్మీర్ 278 పరుగులకు ఆలౌటైంది. తద్వారా జమ్మూ కశ్మీర్ 41 పరుగుల స్వల్ప ఆధిక్యం సాధించింది. అయితే తమ రెండో ఇన్నింగ్స్‌లో రెస్టాఫ్ ఇండియా 319 పరుగులకు ఆలౌటైంది. స్మరణ్ రవిచంద్రన్ (135) సెంచరీ చేయగా, సతన్ సంగ్వాన్ (55) అర్థసెంచరీ సాధించాడు. కశ్మీర్ బౌలర్లలో ఉమర్ నజీర్, సునీల్ కుమార్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. దీంతో రెస్టాఫ్ ఇండియా 278 పరుగుల టార్గెట్‌ను జమ్మూ కశ్మీర్ ముందు ఉంచగా, ఆ జట్టు పూర్తిగా విఫలమై 111 పరుగులకే కుప్పకూలడంతో రెస్టాఫ్ ఇండియా విజేతగా నిలిచింది.6⃣ wickets of the highest quality! 🫡🎥 Relive Mukesh Kumar's superb 6/33 in the second innings that guided Rest of India to a memorable victory in the #IraniCup 2⃣0⃣2⃣6⃣ 🙌👏Updates ▶️ https://t.co/WPBSyJPp33 pic.twitter.com/rizC5Batz7— BCCI Domestic (@BCCIdomestic) October 4, 2026 𝐆𝐚𝐦𝐞. 𝐒𝐞𝐭. 𝐌𝐚𝐭𝐜𝐡 ✌️Mukesh Kumar wraps things up in fine fashion as Rest of India defeat J&K by 1⃣6⃣7⃣ runs in Srinagar to clinch the #IraniCup 2026 🥳👏Updates ▶️ https://t.co/imfbVIsPep@mflone_ pic.twitter.com/Nhi5ezUvND— BCCI Domestic (@BCCIdomestic) October 4, 2026ఇదీ చదవండి: శుబ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. గంగూలీ సరసన -
పంత్ అట్టర్ ఫ్లాప్.. 237 పరుగులకు ఆలౌట్
ఇరానీ కప్-2026 మ్యాచ్‌లో టీమిండియా స్టార్ రిషభ్ పంత్ తీవ్రంగా నిరాశపరిచాడు. రెస్టాఫ్ ఇండియా జట్టు కెప్టెన్‌గా బరిలోకి దిగిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్ పట్టుమని పది పరుగులే చేసి పెవిలియన్ చేరాడు.శ్రీనగర్‌లోని షేర్-ఇ-కశ్మీర్ స్టేడియంలో రెస్టాఫ్ ఇండియా- రంజీ తాజా చాంపియన్ జమ్మూ కశ్మీర్ జట్ల మధ్య గురువారం ఇరానీ కప్ మ్యాచ్ మొదలైంది. టాస్ గెలిచిన ఆతిథ్య జమ్మూ జట్టు.. తొలుత బౌలింగ్ ఎంచుకుంది.ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన రెస్టాఫ్ ఇండియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. ఓపెనర్ సనత్ సాంగ్వాన్ (1), వన్‌డౌన్ బ్యాటర్ సుదీప్ కుమార్ ఘరామి (8) సింగిల్ డిజిట్ స్కోర్లకే వెనుదిరిగారు.Maiden first-class wicket ☝️🎥 All smiles for Lone Nasir who picks up the big wicket of Sudip Gharami 👏#IraniCup | @mflone_ pic.twitter.com/xZQc6GTiBF— BCCI Domestic (@BCCIdomestic) October 1, 2026ఇలాంటి తరుణంలో టీమిండియా స్టార్ సర్ఫరాజ్ ఖాన్ (97 బంతుల్లో 45) మెరుగైన ప్రదర్శనతో ఇన్నింగ్స్ గాడిన పెట్టగా.. రిషభ్ పంత్ మాత్రం (36 బంతుల్లో 10) విఫలమయ్యాడు. ఇక సర్ఫరాజ్‌కు తోడుగా స్మరణ్ రవిచంద్రన్ అర్ధ శతకం (83 బంతుల్లో 68)తో రాణించాడు.మిగిలిన వారిలో ఆకాశ్ దీప్ చెప్పుకోదగ్గ స్కోరు (22) చేశాడు. ఫలితంగా రెస్టాఫ్ ఇండియా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 237 పరుగులు చేసి ఆలౌట్ అయింది. జమ్మూ కశ్మీర్ బౌలర్లలో సునిల్ కుమార్, లోనే నాసిర్ ముజాఫర్ మూడేసి వికెట్లు కూల్చగా.. ఉమర్ నాజిర్ మిర్ రెండు, అబిద్ ముస్తాక్, సాహిల్ లోత్రా తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.ఇక తొలి రోజు ఆటలోనే బ్యాటింగ్ మొదలుపెట్టిన జమ్మూ జట్టు.. గురువారం ఆట పూర్తయ్యేసరికి ఏడు ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 21 పరుగులు చేసింది. ఓపెనర్ కమ్రాన్ ఇక్బాల్ 12, శుభం ఖజూరియా సున్నా పరుగులతో ఉన్నారు.చదవండి: ఇదేమీ అంత ఈజీ కాదు: గంభీర్‌కు విరుద్ధంగా గిల్ కామెంట్లు


