కివీస్‌తో టెస్టు సిరీస్‌.. ఆ ఇద్దరు స్టార్‌ బౌలర్లకు చాన్స్‌! | Mukesh Kumar And Akash Deep Shine In Irani Cup 2026, Boost Their Chances Of Making India New Zealand Test Squad, Check Details | Sakshi
Sakshi News home page

కివీస్‌తో టెస్టు సిరీస్‌.. ఆ ఇద్దరు స్టార్‌ బౌలర్లకు చాన్స్‌!

Oct 5 2026 12:16 PM | Updated on Oct 5 2026 12:49 PM

Irani-Cup-Heros-Mukesh-Akash Deep-Likely-Selected NZ-Test-Series

Photo Credit: Twitter

ఇరానీ క‌ప్-2026ను రెస్టాఫ్ ఇండియా ద‌క్కించుకోవ‌డంలో ఆ జ‌ట్టు బౌల‌ర్లు ముకేశ్ కుమార్‌, ఆకాశ్ దీప్ కీల‌క‌పాత్ర పోషించారు.  రంజీ చాంపియ‌న్ జ‌మ్మూ క‌శ్మీర్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో రెస్టాఫ్ ఇండియా 167 ప‌రుగుల భారీ తేడాతో విజ‌యం సాధించి ఇరానీ క‌ప్‌ను సొంతం చేసుకుంది. 

ముకేశ్ కుమార్‌ తొలి ఇన్నింగ్స్‌లో రెండు, రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల హాల్ (6/33) చెల‌రేగి మొత్తం 8 వికెట్లు ఖాతాలో వేసుకోగా, మ‌రో పేస‌ర్ ఆకాశ్ దీప్ సైతం త‌న బౌలింగ్‌తో ఆక‌ట్టుకున్నాడు. మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లు క‌లిపి ఆరు వికెట్లు తీసిన‌ప్ప‌టికీ త‌క్కువ ఎకానమీతో వికెట్లు తీయ‌డం విశేషం. ఈ నేప‌థ్యంలో ఈ ఇద్ద‌రు బెంగాల్ బౌల‌ర్ల‌కు న్యూజిలాండ్‌తో జ‌ర‌గ‌బోయే టెస్టు సిరీస్‌కు ఎంపిక చేయాల‌ని బీసీసీఐ భావిస్తోంది. 


Photo Credit: Twitter

కివీస్‌ పిచ్‌లు పేసర్లకు అనుకూలం..
టీమిండియా హెడ్‌కోచ్ గౌత‌మ్ గంభీర్ కూడా వీరిద్ద‌రి విష‌యంలో పాజిటివ్ దృక్ప‌థంతోనే ఉన్న‌ట్లు తెలుస్తోంది. కివీస్ పిచ్‌లు పేస‌ర్ల‌కు అనుకూలంగా ఉండ‌డంతో వీలైనంత ఎక్కువ పేస్‌ బౌల‌ర్ల‌ను బెంచ్‌పై ఉంచుకుంటేనే మంచిద‌ని టీమిండియా మేనేజ్‌మెంట్ భావిస్తోంది. ఆకాశ్ దీప్ న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు ఎంపిక‌వుతాడ‌ని ముందే ఊహించిన‌ప్ప‌టికీ, ఇరానీ క‌ప్‌లో సంచ‌ల‌న ప్ర‌ద‌ర్శ‌న ద్వారా ఇప్పుడు ముకేశ్ కుమార్ కూడా జ‌ట్టులో చోటు ద‌క్కించుకునే అవ‌కాశ‌ముంది. 

న‌వంబ‌ర్ 19 నుంచి టెస్టు సిరీస్ ప్రారంభం కానున్న నేప‌థ్యంలో వ‌చ్చే వారంలో బీసీసీఐ సెలెక్ష‌న్ క‌మిటీ న్యూజిలాండ్ టూర్‌కు 16 నుంచి 17 మందితో కూడిన‌ భార‌త జ‌ట్టును ప్ర‌క‌టించే అవ‌కాశ‌ముంది. భార‌త ఫ్రంట్‌లైన్ పేస‌ర్లుగా బుమ్రా, సిరాజ్ ఉండ‌డంతో వీరికి బ్యాక‌ప్‌గా ముకేశ్ కుమార్‌, ఆకాశ్‌దీప్‌లను ఎంపిక చేయాల‌ని భావిస్తోంది. 

అయితే సెప్టెంబ‌ర్‌లో కండ‌రాల గాయంతో బాధ‌ప‌డిన ముకేశ్ కుమార్ ఇరానీ క‌ప్‌లో ఫిట్‌గా కనిపించిన‌ప్ప‌టికీ, కివీస్‌తో టెస్టు సిరీస్‌కు మాత్రం ముకేశ్ ఫిట్‌నెస్ టెస్టు నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఇక న్యూజిలాండ్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ టీమిండియాకు చాలా కీల‌కం. వ‌చ్చే ఏడాది టెస్టు చాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్ ఆడాలంటే భార‌త్.. కివీస్‌తో రెండు టెస్టులు క‌చ్చితంగా గెల‌వాల్సి ఉంటుంది. 

ప్ర‌స్తుతం భారత్ 51.52 పీసీటీతో ప‌ట్టిక‌లో ఐదో స్థానంలో కొన‌సాగుతోంది. ఇటీవ‌లే శ్రీలంక‌తో జ‌రిగిన రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను గిల్ సేన 1-0తో కైవ‌సం చేసుకుంది. తొలి టెస్టులో భారీ విజ‌యం సాధించిన‌ప్ప‌టికీ, రెండో టెస్టును డ్రా చేసుకోవ‌డం వ‌ల్ల భార‌త్ స్థానంలో ఎలాంటి మార్పు లేదు.

ఐదు టీ20లు, ఐదు వన్డేలు, రెండు టెస్టులు
ఇక న్యూజిలాండ్‌ పర్యటనలో టీమిండియా రెండు టెస్టు మ్యాచ్‌లతో పాటు ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌, ఐదు మ్యాచ్‌ల వ‌న్డే సిరీస్ ఆడ‌నుంది. మొద‌ట అక్టోబ‌ర్ 22 నుంచి న‌వంబ‌ర్ ఒక‌టి వ‌ర‌కు ఐదు టీ20 మ్యాచ్‌లు, న‌వంబ‌ర్ 4 నుంచి 15 మ‌ధ్య ఐదు వ‌న్డేలు, ఆ త‌ర్వాత న‌వంబ‌ర్ 19 నుంచి తొలి టెస్టు, నవంబర్ 27 నుంచి రెండో టెస్టు ఆడ‌నుంది.

ఇదీ చ‌ద‌వండి: టీమిండియాకు భారీ షాక్‌.. విండీస్ జట్టులోకి విధ్వంసకర వీరుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement