Photo Credit: Twitter
ఇరాన్ కప్ విజేతగా రెస్టాఫ్ ఇండియా నిలిచింది. రంజీ చాంపియన్ జమ్మూ కశ్మీర్‌తో జరిగిన మ్యాచ్‌లో రెస్టాఫ్ ఇండియా 167 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో హఫ్ సెంచరీ, రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన స్మరణ్ రవిచంద్రన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
278 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జమ్మూ కశ్మీర్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 111 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్లు ఖుమ్రాన్ ఇక్బాల్ (32), శుభమ్ కజురియా (36) మినహా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. రెస్టాఫ్ బౌలర్లలో ముకేశ్ కుమార్ ఆరు వికెట్లతో చెలరేగగా, ఆకాశ్ దీప్ 3 వికెట్లు, ముకేశ్ చౌదరీ ఒక వికెట్ పడగొట్టారు.
అంతకముందు రెస్టాఫ్ ఇండియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 237 పరుగులకు ఆలౌట్ కాగా, జమ్మూ కశ్మీర్ 278 పరుగులకు ఆలౌటైంది. తద్వారా జమ్మూ కశ్మీర్ 41 పరుగుల స్వల్ప ఆధిక్యం సాధించింది. అయితే తమ రెండో ఇన్నింగ్స్‌లో రెస్టాఫ్ ఇండియా 319 పరుగులకు ఆలౌటైంది. స్మరణ్ రవిచంద్రన్ (135) సెంచరీ చేయగా, సతన్ సంగ్వాన్ (55) అర్థసెంచరీ సాధించాడు.
కశ్మీర్ బౌలర్లలో ఉమర్ నజీర్, సునీల్ కుమార్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. దీంతో రెస్టాఫ్ ఇండియా 278 పరుగుల టార్గెట్‌ను జమ్మూ కశ్మీర్ ముందు ఉంచగా, ఆ జట్టు పూర్తిగా విఫలమై 111 పరుగులకే కుప్పకూలడంతో రెస్టాఫ్ ఇండియా విజేతగా నిలిచింది.
6⃣ wickets of the highest quality! 🫡
🎥 Relive Mukesh Kumar's superb 6/33 in the second innings that guided Rest of India to a memorable victory in the #IraniCup 2⃣0⃣2⃣6⃣ 🙌👏
Updates ▶️ https://t.co/WPBSyJPp33 pic.twitter.com/rizC5Batz7— BCCI Domestic (@BCCIdomestic) October 4, 2026
𝐆𝐚𝐦𝐞. 𝐒𝐞𝐭. 𝐌𝐚𝐭𝐜𝐡 ✌️
Mukesh Kumar wraps things up in fine fashion as Rest of India defeat J&K by 1⃣6⃣7⃣ runs in Srinagar to clinch the #IraniCup 2026 🥳👏
Updates ▶️ https://t.co/imfbVIsPep@mflone_ pic.twitter.com/Nhi5ezUvND— BCCI Domestic (@BCCIdomestic) October 4, 2026
ఇదీ చదవండి: శుబ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. గంగూలీ సరసన


