ఇదేమీ అంత ఈజీ కాదు: గంభీర్‌ను వ్యతిరేకించిన గిల్‌! | No Matter How The Pitch Was, Chasing 400 Wasn’t Easy, Is Shubman Gill Differing With Gambhir Over The Guwahati Pitch? | Sakshi
Sakshi News home page

ఏ పిచ్‌ మీదైనా పరుగులు చేయడం అంత ఈజీ కాదు: గంభీర్‌కు గిల్‌ కౌంటర్‌

Oct 1 2026 4:01 PM | Updated on Oct 1 2026 4:33 PM

No Matter How Pitch Was Chasing 400 Not Easy: Is Gill Differ With Gambhir

శుబ్‌మన్‌ గిల్‌ (PC: BCCI X)

వెస్టిండీస్‌తో రెండో వన్డేలో టీమిండియా కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ విధ్వంసకర డబుల్‌ సెంచరీతో విరుచుకుపడ్డాడు. గువాహటిలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగుతూ ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు.

కేవలం 133 బంతుల్లోనే
కేవలం 133 బంతుల్లోనే గిల్‌.. 26 ఫోర్లు, ఎనిమిది సిక్సర్లు బాది 223 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడికి తోడుగా మరో ఓపెనర్‌ రోహిత్‌ శర్మ శతక్కొట్టగా (75 బంతుల్లో 101).. వెస్టిండీస్‌ విధించిన 406 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా కేవలం 43.3 ఓవర్లలో రెండు వికెట్లే నష్టపోయి ఛేదించింది.

ఇది అసలు క్రికెట్‌ కానేకాదు
ఈ నేపథ్యంలో టీమిండియా హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌ బర్సపరా పిచ్‌ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. కనీస పోటీ లేకుండా కేవలం బ్యాటింగ్‌ ఒక్కటే పరమావధిగా ఆట సాగడం తనకు నచ్చలేదన్నాడు. బంతికి, బ్యాట్‌కు మధ్య పోటీ అస్సలు లేదని.. బౌలర్లను చూస్తే జాలేసిందన్నాడు. ఇది అసలు క్రికెట్‌ కానేకాదని ఘాటు వ్యాఖ్యలు చేశాడు.

పిచ్‌ ఎలా ఉన్నా ఛేదన అంత ఈజీ కాదు
అయితే, కెప్టెన్‌, ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ శుబ్‌మన్‌ గిల్‌ మాత్రం ఇందుకు విరుద్ధమైన వ్యాఖ్యలు చేశాడు. ‘‘వికెట్‌ (పిచ్‌) ఎలా ఉన్నా.. మైదానం ఎంత చిన్నదైనా.. 400కు పైగా పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం సులువైన విషయమేమీ కాదు. నా వ్యక్తిగత ప్రదర్శన పట్ల చాలా సంతోషంగా.. సంతృప్తిగా ఉన్నాను.

ఆఖరి వరకు క్రీజులో ఉండి మ్యాచ్‌ను ముగించడం ఆనందాన్నిచ్చింది. ప్రస్తుతం నా శరీరంలోని ప్రతీ భాగంలోనూ నొప్పితో విలవిల్లాడుతున్నా. ఎండ కారణంగా 13 ఓవర్ల ఫీల్డింగ్‌ తర్వాత పూర్తిగా అలసిపోయినట్లు అనిపించింది. అప్పటికే 20-25 ఓవర్లు ఫీల్డింగ్‌ చేసిన అనుభూతి కలిగింది. విండీస్‌ జట్టు కూడా అద్భుతంగా బ్యాటింగ్‌ చేసింది’’ అని విజయానంతరం గిల్‌ పేర్కొన్నాడు.

నెటిజన్ల సెటైర్లు
ఈ నేపథ్యంలో గంభీర్‌- గిల్‌ భారత్‌- విండీస్‌ మధ్య రెండో వన్డేకు సంబంధించిన పిచ్‌ గురించి భిన్నాభిప్రాయలు కలిగి ఉండటంపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ‘కోచ్‌, కెప్టెన్‌ ఆలోచనలు వేరుగా ఉన్నట్లు అనిపిస్తోంది. ఒకరు కఠినమైన పిచ్‌ కోరుకుంటే.. మరొకరు మాత్రం ఐపీఎల్‌ మాదిరే రోడ్‌ మాదిరి పిచ్‌పై పరుగులు చేసి హీరో అనిపించుకోవాలని కోరుకుంటున్నారు’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.

చదవండి: IND vs PAK T20I: ఫైనల్‌లో భారత్‌, పాక్‌.. మ్యాచ్‌ ఎక్కడ చూడాలంటే?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement