జపాన్ వేదికగా జరుగుతున్న 20వ ఆసియా క్రీడలు-2026లో భారత మహిళల స్క్వాష్ జట్టు కాంస్య పతకం సాధించిన సంగతి తెలిసిందే. ఈ పతక విజయంలో కీలక పాత్ర పోషించిన తమిళనాడు అథ్లెట్లకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ ఒక్కొక్కరికి రూ. 30 లక్షల చొప్పున నగదు బహుమతి ప్రకటించారు.
ఈ విజయం అంతర్జాతీయ క్రీడా వేదికపై తమిళనాడు కీర్తిని ఈ ఘనత మరింత పెంచిందని విజయ్ కొనియాడారు. "20వ ఆసియా క్రీడలలో మహిళల స్క్వాష్ టీమ్ ఈవెంట్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్న భారత జట్టుకు నా అభినందనలు. అలాగే ఆ జట్టులో సభ్యులుగా ఉన్న తమిళనాడు క్రీడాకారిణులు జోష్నా చిన్నప్ప, షమీనా రియాజ్‌లకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
జోష్నా, షమీనాలు ప్రపంచ వేదికపై తమిళనాడు కీర్తిని మరింత పెంచారు. వారి విజయానికి గుర్తింపుగా తమిళనాడు ప్రభుత్వం తరఫున ఒక్కొక్కరికి రూ. 30 లక్షలు అందజేస్తాం" అని విజయ్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
చదవండి: పంత్ అట్టర్ ఫ్లాప్.. రాణించిన సర్ఫరాజ్, స్మరణ్.. 237 పరుగులకు ఆలౌట్


