చరిత్ర సృష్టించిన భారత ఆర్చరీ టీమ్.. తొలి స్వర్ణ పతకం | Asian Games 2026: India Win First-Ever Womens Recurve Archery Gold | Sakshi
Sakshi News home page

Asian Games 2026: చరిత్ర సృష్టించిన భారత ఆర్చరీ టీమ్.. తొలి స్వర్ణ పతకం

Oct 2 2026 7:23 AM | Updated on Oct 2 2026 7:46 AM

Asian Games 2026: India Win First-Ever Womens Recurve Archery Gold

ఆసియా క్రీడలు 2026లో భారత మహిళల రీకర్వ్ ఆర్చరీ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. శుక్రవారం జరిగిన ఫైనల్ పోరులో దక్షిణ కొరియాపై 5-3 తేడాతో సంచలన విజయం సాధించిన భార‌త జ‌ట్టు..ఈ విభాగంలో మొట్టమొద‌టి ఏషియ‌డ్‌ ప‌స‌డి ప‌త‌కాన్ని ముద్దాడింది. 

సెమీఫైనల్లో చైనాను 5-1తో చిత్తు చేసిన అంకితా భకత్, కీర్తి శర్మ, కుమ్‌కుమ్ మొహద్‌లతో కూడిన భార‌త బృందం.. తుది పోరులోనూ అదే జోరును కొనసాగించింది.

ఈ చారిత్రాత్మక విజయంతో భారత్ పతకాల పట్టికలో తన స్థానాన్ని మరింత మెరుగుపరుచుకుంది. ఇప్పటివరకు ఈ ఏషియన్ గేమ్స్‌లో మొత్తం 67 పతకాలు సాధించింది. అందులో 11 బంగారు పతకాలతో పాటు 23 సిల్వర్‌,33 బ్రాంజ్ మెడల్స్ ఉన్నాయి.
చదవండి: వన్డే వరల్డ్‌కప్‌ షెడ్యూల్‌ విడుదల.. భారత్‌-పాక్‌ మ్యాచ్‌ ఎప్పుడంటే?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement