యూరోపియన్ టీ20 ప్రిమియర్ లీగ్ గ్లాస్గో కాస్మిక్ జట్టు ఎట్టకేలకు గెలుపు రుచి చూసింది. శనివారం డబ్లిన్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో డబ్లిన్ గార్డియన్స్ గ్లాస్గో కాస్మిక్ జట్టు 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన డబ్లిన్ గార్డియన్స్ 19.3 ఓవర్లలో 159 పరుగులు చేసింది.
జేమ్స్ విన్స్, డేవిడ్ విల్లీ, హ్యారీ టెక్టర్ వంటి స్టార్ ప్లేయర్లు విఫలమైన చోట.. భారత మాజీ క్రికెటర్ విజయ్ శంకర్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఓవైపు క్రమం తప్పకుండా వికెట్లు పడతున్నప్పటికి శంకర్ మాత్రం ప్రత్యర్ధి బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. 43 బంతుల్లో 6 ఫోర్లు. 3 సిక్స్‌లతో 67 పరుగులు చేశాడు.
అతడి వీరోచిత పోరాటం ఫలితంగా డబ్లిన్ ప్రత్యర్ధి ముందు ఫైటింగ్ టోటల్‌ను ఉంచగల్గింది. విజయ్ శంకర్ బ్యాటింగ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్లు అన్నా.. ఇది కల కాదు కాదా? అంటూ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. కాగా భారత క్రికెట్‌తో పూర్తి తెగదింపులు చేసుకున్న శంకర్.. ప్రస్తుతం విదేశీ లీగ్‌ల్లో ఆడుతున్నాడు. ఇక గ్లాస్గో బౌలర్లలో అలీ ఖాన్ నాలుగు, టైమల్ మిల్స్ మూడు వికెట్లు పడగొట్టారు.
మున్సీ మెరుపులు
అనంతరం 160 పరుగుల లక్ష్యాన్ని గ్లాస్కో.. కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి 18.5 ఓవర్లలో చేధించింది. కెప్టెన్ జార్జ్ మున్సీ(33 బంతుల్లో 50) మెరుపు హాఫ్ సెంచరీ సాధించాడు. అతడితో పాటు ఫిన్ అలెన్(30), లివింగ్‌స్టోన్)29) రాణించారు. గ్లాస్గో విజయం సాధించడంతో విజయ్ శంకర్ వీరోచిత ఇన్నింగ్స్ వృథా అయిపోయింది.


