Photo Credit: Twitter
భారత దిగ్గజ క్రికెటర్, మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ ప్రస్తుతం యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్ (ఈటీపీఎల్)లో డబ్లిన్ గార్డియన్స్‌కు యజమానిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ జట్టుకు కెప్టెన్‌గా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఉండగా, విక్రమ్ రాథోర్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ద్రవిడ్ గురించి కోచ్ విక్రమ్ రాథోర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
గతంలో బ్యాటర్‌గా, కోచ్‌గా సేవలందించిన రాహుల్ ద్రవిడ్ ఇప్పుడు ఒక జట్టుకు యజమానిలా ఫీలవుతున్నట్లు పేర్కొన్నాడు. ఆయన మాట్లాడుతూ.. "రాహుల్ యజమానిలా ప్రవర్తిస్తున్నాడు. అంటే నా ఉద్దేశంలో ఒక జట్టు యజమానిగా ఏ విషయంలోనూ ఎక్కువగా జోక్యం చేసుకోవడం లేదు. ఒక రకంగా ఇది మంచి విషయమే. కానీ అవతలి వైపు హుందాగా నడుచుకునే వ్యక్తి ఉండడం మాకు గొప్ప విషయం. ఎందుకంటే కోచ్‌గా తగినంత సమయాన్ని ఆస్వాదించాడు.
కాబట్టి జట్లు ఎలా ఆడుతాయో, ఫలితాలు ఎలా వస్తాయో అతడికి బాగా తెలుసు. టోర్నీ ప్రారంభం నుంచి ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో ఒక్కటీ గెలవనప్పటికీ మమ్మల్ని తప్పుబట్టకుండా సహకరిస్తూ మద్దతుగా నిలుస్తూ వచ్చాడు. రాహుల్ లాంటి వ్యక్తి నుంచి ఏదైతే ఆశిస్తామే అదే చేస్తున్నారు." అని పేర్కొన్నాడు.

Photo Credit: Twitter
అశ్విన్ వల్ల సులువైంది..
ఇక కెప్టెన్‌గా అశ్విన్ ఉండడంపై కూడా విక్రమ్ రాథోర్ స్పందించాడు. "అశ్విన్ విషయానికొస్తే అతడికి క్రికెట్ గురించి మంచి పరిజ్ఞానముంది. అతడో క్రికెట్ పిచ్చోడని చెప్పొచ్చు. ప్రపంచవ్యాప్తంగా జరిగే అన్నీ క్రికెట్ మ్యాచ్‌లనూ చూస్తాడు. వివిధ దేశాల ఆటగాళ్ల గురించి అతడికి ఉన్న పరిజ్ఞానం అద్భుతం.
కొన్ని సందర్భాల్లో పిచ్ పరిస్థితులు, ఆటగాళ్ల గురించి అశ్విన్‌కు ఇంత తెలుసా అని ఆశ్చర్యపోతుంటాను. అతడి లాంటి వ్యక్తి జట్టులో ఉండటం మాకు ఎంతో ఉపయోగకరం. నా కెరీర్‌లో ఎక్కువ సమయం భారత క్రికెట్‌లోనే గడిచింది. అందుకే ఇక్కడి పరిస్థితులు, ఆటగాళ్లు నాకు కొత్త. కానీ అశ్విన్ ఉండటం వల్ల నా పని చాలా సులువైంది" అని తెలిపాడు.
ఇక ఈటీపీఎల్ విషయానికి వస్తే, ఇందులో పాల్గొంటున్న భారత క్రికెటర్లలో అశ్విన్ ఒక్కడే కాకుండా అజింక్య రహానే, విజయ్ శంకర్ కూడా వేర్వేరు జట్లలో భాగంగా ఉన్నారు. ఈ టీ20 లీగ్ ఆగస్టు 26న ప్రారంభమైంది. టోర్నీ ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 20న జరగనుంది.
VIDEO | Former India player and batting coach Vikram Rathour has predicted a stable future for the European T20 Premier League.
Rathour is head coach of the Dublin Guardians franchise in the ongoing ETPL. R Ashwin is captain of the side.
“I always believe that for any league to… pic.twitter.com/hCPY4QclTu— Press Trust of India (@PTI_News) September 10, 2026


