శ్రీలంక ముందు స్వల్ప లక్ష్యాన్ని ఉంచిన పాక్‌ | Womens Asia Cup 2026 Semi final 2: Pakistan set 131 runs target to Sri lanka | Sakshi
Sakshi News home page

శ్రీలంక ముందు స్వల్ప లక్ష్యాన్ని ఉంచిన పాక్‌

Sep 11 2026 9:34 PM | Updated on Sep 11 2026 9:34 PM

Womens Asia Cup 2026 Semi final 2: Pakistan set 131 runs target to Sri lanka

source: X

మహిళల ఆసియా కప్‌ 2026లో ఇవాళ రెండో సెమీఫైనల్‌ జరుగుతుంది. దుబాయ్‌ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో శ్రీలంక టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన పాక్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 130 పరుగులకే పరిమితమైంది.

కెప్టెన్‌ ఫాతిమా సనా ఓ మోస్తరు ఇన్నింగ్స్‌ (47 నాటౌట్‌) ఆడటంతో పాక్‌ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. మిగతా ప్లేయర్లలో షావాల్‌ జుల్ఫికర్‌ (24), గుల్‌ ఫెరోజా (21), తుబా హసన్‌ (12 నాటౌట్‌) రెండంకెల స్కోర్లు చేయగా.. మునీబా అలీ (2), అయేషా జాఫర్‌ (7), సదాఫ్‌ షమాస్‌ (8) సింగిల్‌ డిజట్‌ స్కోర్లకే పరిమితమయ్యారు. శ్రీలంక బౌలర్లలో కెప్టెన్‌ చమారీ ఆటపట్టు, చముడి ప్రబోదా తలో 2 వికెట్లు తీయగా.. సుగందిక కుమారి ఓ వికెట్‌ పడగొట్టింది.

కాగా, నిన్న బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి సెమీఫైనల్లో గెలిచి భారత్‌ ఫైనల్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. నేటి రెండో సెమీస్‌లో గెలిచిన జట్టు సెప్టెంబర్‌ 13న జరిగే ఫైనల్లో భారత్‌తో అమీతుమీ తేల్చుకుంటుంది. 

ఇదీ చదవండి: శతక్కొట్టిన కానర్‌.. సౌతాఫ్రికాదే సిరీస్‌


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement