సూపర్‌ శతకం.. సౌతాఫ్రికా బ్యాటర్‌ ప్రపంచ రికార్డు | Connor Esterhuizen Sets World Record With Century in SA vs NAM 2nd ODI | Sakshi
Sakshi News home page

సూపర్‌ శతకం.. సౌతాఫ్రికా బ్యాటర్‌ ప్రపంచ రికార్డు

Sep 11 2026 7:09 PM | Updated on Sep 11 2026 7:24 PM

Connor Esterhuizen Sets World Record With Century in SA vs NAM 2nd ODI

source: X

నమీబియాతో ఇవాళ జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఓపెనర్‌, వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ కానర్ ఎస్టర్‌హుయిజెన్ సూపర్‌ శతకం (110 బంతుల్లో 119; 8 ఫోర్లు, 6 సిక్సర్లు) బాదాడు. ఈ సెంచరీతో అతడు ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. 

వన్డేల్లో నమీబియాపై అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ చేసిన వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌గా నిలిచాడు. ఎస్టర్‌హుయిజెన్‌కు ముందు ఈ రికార్డు యూఏఈకి చెందిన వ్రిత్య అరవింద్ (115*) పేరిట ఉండేది.

మ్యాచ్‌ విషయానికొస్తే.. ఎస్టర్‌హుయిజెన్‌ శతకంతో పాటు టోనీ డి జోర్జి (79) అర్ద సెంచరీతో రాణించడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన సౌతాఫ్రికా భారీ స్కోర్‌ (335-9) స్కోర్‌ చేసింది. నమీబియా బౌలర్లలో జాక్‌ బ్రసెల్‌ 4 వికెట్లతో రాణించాడు. 

అనంతరం భారీ లక్ష్య ఛేదనలో నమీబియా ఆదిలోనే చేతులెత్తేసింది. ఒక్క పరుగుకే 3 వికెట్లు కోల్పోయిన ఆ జట్టు.. 59 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి ఓటమి అంచుల్లో ఉంది. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి వన్డే కూడా ఓడిన నమీబియా 0-1తో వెనుకపడిపోయింది. ఈ మ్యాచ్‌ కూడా ఓడితే ఆ జట్టు సిరీస్‌ను కోల్పోతుంది. ఈ సిరీస్‌ కోసం సౌతాఫ్రికా నమీబియాలో పర్యటిస్తుంది.

సూపర్‌ ఫామ్‌లో ఎస్టర్‌హుయిజెన్
ఎస్టర్‌హుయిజెన్ ప్రస్తుతం సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. నమీబియా సిరీస్‌కు ముందు అదే దేశంలో జరిగిన టీ20 ట్రై సిరీస్‌లోనూ అద్భుత ప్రదర్శనలు చేశాడు. ఈ టోర్నీలో అతడు కీలకమైన 126 పరుగులు చేసి, తన జట్టు టైటిల్‌ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ ప్రదర్శనల తర్వాత ఎస్టర్‌హుయిజెన్ ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో ఏకంగా 65 స్థానాలు మెరుగుపర్చుకొని 25వ ర్యాంక్‌కు ఎగబాకాడు. 

చదవండి: సౌతాఫ్రికా జోడీ రికార్డు ప్రదర్శన


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement