మహిళల ఆసియాకప్-2026లో భారత జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. గురువారం దుబాయ్ వేదికగా జరిగిన సెమీఫైనల్లో బంగ్లాదేశ్‌ను 40 పరుగుల తేడాతో చిత్తు చేసిన టీమిండియా.. రికార్డు స్దాయిలో ఆరోసారి ఫైనల్ పోరుకు అర్హత సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత స్టార్ ఓపెనర్ షెఫాలీ వర్మ అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది.
స్మృతి మంధాన, హర్మన్ ప్రీత్ కౌర్ వంటి స్టార్ ప్లేయర్లు విఫలమైన చోట షెఫాలీ దుమ్ములేపింది. షెఫాలీ వర్మ 40 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 64 పరుగులు చేసింది. ఫలితంగా భారత జట్టు ప్రత్యర్ధి ముందు 149 ఫైటింగ్ టార్గెట్‌ను ఉంచగల్గింది. లక్ష్య చేధనలో బంగ్లాదేశ్ 109 పరుగులకే పరిమితమైంది. ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో సత్తాచాటిన షెఫాలీ ఓ రికార్డును తన పేరిట లిఖించుకుంది.
ఈ ఏడాది టీ20ల్లో భారత మహిళల జట్టు తరపున అత్యధిక పరుగులు చేసిన జాబితాలో షెఫాలీ అగ్రస్దానానికి చేరుకుంది. ఆమె ఇప్పటివరకు ఈ ఏడాది 20 ఇన్నింగ్స్‌లలో మొత్తం 593 పరుగులు సాధించింది. ఇంతకుముందు ఈ రికార్డు మంధాన(590) పేరిట ఉండేది. తాజా ఇన్నింగ్స్‌తో స్మృతిని షెఫాలీ అధిగమించింది.
2026లో మహిళల టీ20ల్లో భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్లు వీరే
షఫాలీ వర్మ: 593 పరుగులు, 20 ఇన్నింగ్స్‌లు
స్మృతి మంధాన: 590 పరుగులు, 18 ఇన్నింగ్స్‌లు
హర్మన్‌ప్రీత్ కౌర్: 465 పరుగులు, 18 ఇన్నింగ్స్‌లు
జెమీమా రోడ్రిగ్స్: 345 పరుగులు, 16 ఇన్నింగ్స్‌లు
రిచా ఘోష్: 231 పరుగులు, 17 ఇన్నింగ్స్‌లు
చదవండి: ENG vs PAK: సేమ్ సీన్ రీపీట్! అప్పుడు సెహ్వాగ్.. ఇప్పుడు పాక్ ఓపెనర్


