source: X
భారత మాజీ క్రికెటర్ శ్రీశాంత్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. అతడి తండ్రి శాంతకుమారన్ నాయర్ (89) శుక్రవారం రాత్రి కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూశారు. శాంతకుమారన్ గత కొద్ది రోజులుగా హృదయ సంబంధిత సమస్యలతో ఆసుపత్రిలోనే ఉన్నారు. శాంతకుమారన్ ఎల్‌ఐసీలో జోనల్ మేనేజర్‌గా పని చేసి రిటైరయ్యారు.
శాంతకుమారన్-సావిత్రి దేవి దంపతులకు నలుగురు సంతానం. వీరిలో చివరి సంతానం శ్రీశాంత్. శాంతకుమారన్ మృతి పట్ల కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. శ్రీశాంత్ కుటుంబానికి పలువురు క్రికెటర్లు, అభిమానులు సానుభూతిని తెలియజేస్తున్నారు.
శ్రీశాంత్ 2005-2011 మధ్యలో టీమిండియాకు ఆడాడు. దేశవాలీ క్రికెట్‌లో కేరళతో పాటు ఐపీఎల్‌లో వివిధ ఫ్రాంచైజీల తరఫున సత్తా చాటాడు. శ్రీశాంత్ రెండు ప్రపంచకప్ విజయాల్లో భాగమయ్యాడు.
చదవండి: వైభవ్ సూర్యవంశీకి భారీ షాక్!


