వైభవ్‌ లాంటి ప్లేయర్‌ ఒక్కరు కూడా పాక్‌లో లేరు: వసీం అక్రమ్‌ | Wasim Akram Slams PSL, Says Pakistan Failed To Produce A Batter Like Vaibhav Suryavanshi, Read Story Inside | Sakshi
Sakshi News home page

వైభవ్‌ లాంటి ప్లేయర్‌ ఒక్కరు కూడా పాక్‌లో లేరు: వసీం అక్రమ్‌

Sep 12 2026 1:17 PM | Updated on Sep 12 2026 1:35 PM

Wasim Akram Praises Vaibhav Sooryavanshi

పాకిస్తాన్ సూప‌ర్ లీగ్‌పై దిగ్గ‌జ క్రికెట‌ర్ వ‌సీం అక్ర‌మ్ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పించాడు.  ఇండియన్ ప్రీమియర్ లీగ్‌తో పోలిస్తూ పీఎస్ఎల్ ఒక్క ప్ర‌తిభావంతుడైన ఆట‌గాడిని కూడా తాయారు చేయ‌లేక‌పోయింద‌ని అక్రమ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ పేరును ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించాడు. 

కాగా 15 ఏళ్ల వైభ‌వ్ సూర్య‌వంశీ ఇప్ప‌టికే తన విధ్వంస‌క‌ర బ్యాటింగ్‌తో క్రికెట్ ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. వరుసగా రెండు ఐపీఎల్ సీజన్‌లలో అదరగొట్టిన వైభవ్‌.. ఇప్పుడు అంత‌ర్జాతీయ క్రికెట్‌లో స‌త్తాచాటుతున్నాడు. ఈ క్ర‌మంలోనే అద్భుత ప్రదర్శనలతో రాణిస్తున్న వైభవ్‌ను ఉదాహరణగా చూపిస్తూ పీసీబీపై అక్రమ్ మండిపడ్డాడు.

"పాకిస్తాన్ సూపర్ లీగ్ ప్రారంభమై దశాబ్దానికి పైగానే పూర్తయింది. ఈ లీగ్ ద్వారా కొంతమంది నైపుణ్యం కలిగిన బౌలర్లు వెలుగులోకి వచ్చినప్పటికీ.. పటిష్టమైన ఒక్క బ్యాటర్‌ను కూడా మనం తయారుచేసుకోలేకపోయాం. నిజమైన క్రికెట్ పురోగతి సాధించాలంటే 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ వంటి అపార ప్రతిభ కలిగిన యంగ్ బ్యాటర్లు మన దగ్గర నుంచి కూడా రావాలి.

ముఖ్యంగా రెడ్ బాల్ క్రికెట్‌ను బలోపేతం చేయాలంటే క్లబ్ క్రికెట్ స్థాయి నుంచే మార్పు మొదలవ్వాలి. ఇందుకోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు  కరాచీ, లాహోర్‌లలో క్లబ్ క్రికెట్ మౌలిక సదుపాయాల కల్పనకు చెరో 100 మిలియన్ రూపాయలు వెచ్చించాల్సిన అవసరం ఉంది" అని ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అక్రమ్‌ పేర్కొన్నాడు.
చదవండి: ఏడెకరాల భూమి.. ఫామ్‌హౌజ్‌.. ‘కైలాష్‌పతి’ ఆస్తి విలువ ఎంతంటే?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement