WCL 2026: ఆరోజే భారత్‌ వర్సెస్‌ పాకిస్తాన్‌ మ్యాచ్‌ | WCL 2026 Schedule: India vs Pakistan New Match Announced In Dubai | Sakshi
Sakshi News home page

WCL 2026: భారత్‌ వర్సెస్‌ పాకిస్తాన్‌.. మ్యాచ్‌ తేదీ ఇదే

Sep 12 2026 1:26 PM | Updated on Sep 12 2026 1:55 PM

WCL 2026 Schedule: India vs Pakistan New Match Announced In Dubai

PC: WCL X

క్రికెట్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ ఆఫ్‌ లెజెండ్స్‌ (డబ్ల్యూసీఎల్‌)-2026 షెడ్యూల్‌ తాజాగా విడుదలైంది. అక్టోబరు 3 నుంచి అక్టోబరు 17 మధ్య ఈ మెగా ఈవెంట్‌ను నిర్వహించనున్నారు.

షార్జా క్రికెట్‌ స్టేడియం, దుబాయ్‌ అంతర్జాతీయ స్టేడియం ఇందుకు వేదికలు. ఇక 2026 సీజన్‌ ఆరంభ మ్యాచ్‌లో భాగంగా అక్టోబరు 3 భారత్‌ చాంపియన్స్‌- ఆస్ట్రేలియా చాంపియన్స్‌ తలపడనుండగా.. అదే రోజు పాకిస్తాన్‌ చాంపియన్స్‌- బంగ్లాదేశ్‌ చాంపియన్స్‌ అమీతుమీ తేల్చుకోనున్నాయి.

భారత్‌- పాక్‌ మ్యాచ్‌ ఆరోజే
ఇక క్రికెట్‌ ప్రపంచం ఆసక్తిగా చూసే భారత్‌- పాకిస్తాన్‌ మ్యాచ్‌కు అక్టోబరు 10న ముహూర్తం ఖరారైంది. భారత కాలమానం ప్రకారం రాత్రి తొమ్మిది గంటలకు ఈ మ్యాచ్‌ ఆరంభం కానుంది. దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ స్టేడియం ఇందుకు వేదిక.

కాగా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఆటగాళ్లు WCLలో ఆడుతున్న సంగతి తెలిసిందే. టీ20 ఫార్మాట్లో నిర్వహించే ఈ టోర్నీలో భారత్‌, పాకిస్తాన్‌, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌, ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌ జట్లు టైటిల్‌ కోసం బరిలో నిలిచాయి. 

PC: WCL X
WCL-2026 ‍జట్లలో కీలక ఆటగాళ్లు
ఇండియా చాంపియన్స్‌
యువరాజ్‌ సింగ్‌, సురేశ్‌ రైనా, హర్భజన్‌ సింగ్‌, ఇర్ఫాన్‌ పఠాన్‌, యుసఫ్‌ పఠాన్‌, అంబటి రాయుడు

పాకిస్తాన్‌ చాంపియన్స్‌
షాహిద్‌ ఆఫ్రిది, షోయబ్‌ అక్తర్‌, మిస్బా ఉల్‌ హక్‌, అబ్దుల్‌ రజాక్‌, కమ్రాన్‌ అక్మల్‌.

సౌతాఫ్రికా చాంపియన్స్‌
ఏబీ డివిలియర్స్‌, డేల్‌ స్టెయిన్‌, హషీం ఆమ్లా, జాక్వెస్‌ కలిస్‌, ఇమ్రాన్‌ తాహిర్‌.

ఆస్ట్రేలియా చాంపియన్స్‌
బ్రెట్‌ లీ, షేన్‌ వాట్సన్‌, బ్రాడ్‌ హాడిన్‌, నాథన్‌ లియోన్‌, కాలమ్‌ ఫెర్గూసన్‌.

ఇంగ్లండ్‌ చాంపియన్స్‌
కెవిన్‌ పీటర్సన్‌, ఇయాన్‌ మోర్గాన్‌, అలిస్టర్‌ కుక్‌, జొనాథన్‌ ట్రాట్‌, మాంటీ పనేసర్‌

వెస్టిండీస్‌ చాంపియన్స్‌
క్రిస్‌ గేల్‌, బ్రియాన్‌ లారా, డ్వేన్‌ బ్రావో, రామ్‌నరేశ్‌ శర్వాణ్‌, ఫిడెల్‌ ఎడ్‌వర్డ్స్‌
కాగా బంగ్లాదేశ్‌ చాంపియన్స్‌ మాత్రం ఇప్పటి వరకు జట్టును ప్రకటించలేదు.

చదవండి: ఏడెకరాల భూమి.. ఫామ్‌హౌజ్‌.. విలువ ఎంతంటే?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement