source: X
చైనాలో జరుగుతున్న మహిళల జూనియర్ ఆసియా కప్ హాకీలో భారత్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో భారత్ దక్షిణ కొరియాపై 5-1 గోల్స్ తేడాతో ఘన విజయం సాధించి, వరుసగా మూడో ఎడిషన్‌లో ఫైనల్‌కు చేరింది.
భారత్ తరఫున సుప్రియా హ్యాట్రిక్ సాధించి జట్టు విజయంలో ప్రధానపాత్ర పోషించింది. ఆమెతో పాటు మధు సిదార్, సుఖ్‌వీర్ కౌర్ చెరో గోల్ చేసి భారత్‌కు భారీ ఆధిక్యాన్ని అందించారు. దక్షిణ కొరియా తరఫున యూరి జియోంగ్ ఏకైక గోల్ చేసింది.
ఈ టోర్నీలో భారత్ అద్భుతమైన ప్రదర్శన కొనసాగించింది. క్వార్టర్‌ఫైనల్లో పాకిస్తాన్‌ను ఏకంగా 19-0 గోల్స్‌తో చిత్తు చేసిన టీమిండియా.. సెమీఫైనల్లోనూ అదే దూకుడును ప్రదర్శించింది. ఫైనల్లో భారత్.. చైనా, జపాన్ మధ్య జరిగే రెండో సెమీఫైనల్ విజేతతో తలపడనుంది.
మహిళల జూనియర్ ఆసియా కప్‌లో వరుసగా 2023, 2024 ఎడిషన్లలో టైటిళ్లు సాధించిన భారత్, ఈసారి కూడా టైటిల్ గెలిచి హ్యాట్రిక్ సాధించాలని పట్టుదలగా ఉంది.
చదవండి: పాకిస్తాన్‌ను మట్టికరిపించి సెమీ ఫైనల్లో భారత్


