ప్రపంచ కప్‌లో భారత్‌కు పోరాట ఆరంభం | Women’s Hockey World Cup 2026, India Denied Winning Start As China Fight Back To Earn 2-2 Draw, Check More Details | Sakshi
Sakshi News home page

మహిళల హాకీ ప్రపంచ కప్‌లో భారత్‌కు పోరాట ఆరంభం

Aug 16 2026 6:26 PM | Updated on Aug 16 2026 6:32 PM

Womens Hockey World Cup 2026: India Denied Winning Start As China Earn Draw

ఆమ్‌స్టెల్‌వీన్: 2026 మహిళల FIH హాకీ వరల్డ్ కప్‌లో భారత జట్టు పోరాట ఆరంభం చేసింది. నెదర్లాండ్స్‌లోని వాగెనర్ స్టేడియంలో ఆదివారం జరిగిన పూల్-డీ మ్యాచ్‌లో ఒలింపిక్ రజత పతక విజేత చైనాతో 2-2 డ్రా చేసుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్ రెండుసార్లు ఆధిక్యంలోకి వెళ్లినా.. చైనా ప్రతిసారీ పుంజుకుని స్కోరును సమం చేసింది.

రెండుసార్లు ఆధిక్యంలో భారత్
మ్యాచ్ ప్రారంభం నుంచే భారత జట్టు దూకుడుగా ఆడింది. 8వ నిమిషంలో నవ్‌నీత్ కౌర్ గోల్ చేయడంతో భారత్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.

అయితే తొలి క్వార్టర్ ముగిసే సమయానికి చైనా తిరిగి పుంజుకుంది. 15వ నిమిషంలో జాంగ్ గోల్ చేయడంతో స్కోరు 1-1గా సమమైంది.

రెండో క్వార్టర్‌లో భారత్ మరోసారి ఆధిక్యంలోకి వచ్చింది. 25వ నిమిషంలో దీపిక గోల్ చేయడంతో భారత్ 2-1తో ముందంజ వేసింది.

భారత్ ఆధిక్యాన్ని కాపాడుకుంటూ విజయంపై ఆశలు పెంచుకున్న సమయంలో చైనా మరోసారి ఎదురుదాడి చేసింది. 39వ నిమిషంలో మా నింగ్ గోల్ చేయడంతో స్కోరు 2-2గా మారింది.

ఆ తర్వాత ఇరు జట్లు గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ మరో గోల్ రాకపోవడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది.

దక్షిణాఫ్రికాతో తదుపరి మ్యాచ్
చైనాతో పాయింట్లు పంచుకున్న భారత్‌కు పూల్-డీలో తదుపరి మ్యాచ్ కీలకంగా మారింది. ఆగస్టు 18న దక్షిణాఫ్రికాతో భారత జట్టు తలపడనుంది.

వరల్డ్ కప్‌లో నాకౌట్ దశకు చేరుకోవాలంటే భారత్ ఇకపై పూల్ మ్యాచ్‌ల్లో మెరుగైన ఫలితాలు సాధించాల్సి ఉంటుంది. చైనా వంటి బలమైన ప్రత్యర్థిపై రెండు సార్లు ఆధిక్యంలోకి రావడం సానుకూల అంశమే అయినప్పటికీ, ఆధిక్యాన్ని విజయంగా మలచలేకపోవడం మాత్రం భారత్ సరిదిద్దుకోవాల్సిన అంశంగా నిలిచింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement