breaking news
Junior Asia Cup
-
డిఫెండింగ్ చాంపియన్లుగా బరిలోకి..
మోఖి (చైనా): జూనియర్ ఆసియా కప్‌లో భారత పురుషుల, మహిళల జట్లు ఫేవరెట్‌గా బరిలోకి దిగనున్నాయి. శుక్రవారం నుంచి చైనా వేదికగా ప్రారంభం కానున్న ఈ టోర్నమెంట్లో భారత పురుషుల, మహిళల జట్లు డిఫెండింగ్ చాంపియన్‌గా పోటీకి సిద్ధమయ్యాయి. పురుషుల అండర్–21 జట్టు ఇప్పటికి రికార్డు స్థాయిలో ఐదుసార్లు ఆసియా విజేతగా నిలవగా... మహిళల జట్టు వరుసగా మూడోసారి కప్ సొంతం చేసుకోవాలని పట్టుదలతో ఉంది. పురుషుల విభాగంలో 1988 నుంచి జూనియర్ ఆసియాకప్ నిర్వహిస్తుండగా... ఇప్పటి వరకు పది టోర్నమెంట్లో జరిగాయి. అందులో ఐదింట (2004, 2008, 2015, 2023, 2024లో) ట్రోఫీ నెగ్గిన భారత్... మరో రెండుసార్లు (1996, 2000) రన్నరప్‌గా నిలిచింది. దాయాది పాకిస్తాన్ మూడుసార్లు టైటిల్ నెగ్గి... ఐదుసార్లు రన్నరప్‌గా నిలిచింది. గత మూడు పర్యాయాలు చాంపియన్‌గా నిలిచిన భారత పురుషుల జట్టుకు డిఫెండర్ అన్మోల్ ఎక్కా కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. పూల్ ‘ఎ’లో భాగంగా శనివారం జరగనున్న తమ తొలి పోరులో ఇండోనేసియాతో తలపడనున్న భారత్... ఆ తర్వాత సెప్టెంబర్ 6న జపాన్, 8న దక్షిణ కొరియా, 9న చైనీస్ తైపీతో అమీతుమీ తేల్చుకోనుంది. ‘హ్యాట్రిక్’పై అమ్మాయిల గురి గత రెండు పర్యాయాలు ట్రోఫీ గెలుచుకున్న భారత అండర్–21 మహిళల జట్టుకు మిడ్‌ఫీల్డర్ శైలిమా చాను సారథ్యం వహిస్తోంది. టిమ్ వైట్ కోచింగ్‌లో రాటుదేలిన అమ్మాయిలు... ఇటీవలి కాలంలో ఇంగ్లండ్, అమెరికా, బెల్జియం జట్లపై మెరుగైన ప్రదర్శన కనబర్చారు. శనివారం తొలి మ్యాచ్‌లో దక్షిణ కొరియాతో తలపడనున్న భారత్... సెప్టెంబర్ 6న మలేసియా, 8న జపాన్, 9న చైనాతో ఆడనుంది. ‘కొరియాతో మ్యాచ్‌కు సిద్ధంగా ఉన్నాం. తొలి మ్యాచ్ నుంచే చాంపియన్ ఆటతీరును కొనసాగిస్తాం. దీని కోసం గత కొన్ని రోజులుగా బెంగళూరులో ప్రత్యేకంగా సాధన చేశాం. ఇక్కడి పరిస్థితులు కాస్త భిన్నంగా ఉన్నా... మైదానంలో మెరుగైన ప్రదర్శన కనబర్చడంపైనే జట్టు దృష్టి ఉంది’ అని కోచ్ వైట్ పేర్కొన్నాడు. -
టైటిల్ నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో...
బెంగళూరు: జూనియర్ ఆసియా కప్ టైటిల్ నిలబెట్టుకునేందుకు భారత మహిళల హాకీ జట్టు మంగళవారం ఒమన్‌కు బయల్దేరింది. ఒమన్ రాజధాని మస్కట్‌లో ఈ నెల 7 నుంచి 15 వరకు ఆసియా టోర్నీ జరుగుతుంది. ఇందులో రాణించి టైటిల్ నిలబెట్టుకోవడంతో పాటు వచ్చే ఏడాది జూనియర్ ప్రపంచకప్‌కు అర్హత సాధించాలనే లక్ష్యంతో భారత అమ్మాయిల జట్టు సన్నద్ధమై వెళ్లింది. మస్కట్ టోర్నీలో స్వర్ణ, రజత, కాంస్య పతక విజేతలు (టాప్–3 జట్లు) శాంటియాగో (చిలీ)లో జరిగే ప్రపంచకప్‌కు అర్హత సాధిస్తారు. ఆసియా కప్ ఈవెంట్లో భారత్ పూల్ ‘ఎ’లో ఉంది. ఈ పూల్‌లో భారత్‌తో పాటు చైనా, మలేసియా, థాయ్‌లాండ్, బంగ్లాదేశ్ జట్లున్నాయి. పూల్ ‘బి’లో దక్షిణ కొరియా, జపాన్, చైనీస్ తైపీ, హాంకాంగ్, శ్రీలంకలు పోటీపడతాయి. జ్యోతి సింగ్ నేతృత్వంలోని భారత జట్టులో పలువురు ప్రతిభావంతులు నిలకడగా రాణిస్తున్నారు. వైష్ణవి విఠల్ ఫాల్క, సునేలిత టొప్పొ, ముంతాజ్ ఖాన్, దీపిక, బ్యూటీ డుంగ్డుంగ్లకు సీనియర్లతో కలిసి ఆడిన అనుభవం ఉంది. ఈ జట్టుకు భారత మాజీ కెప్టెన్ తుషార్ ఖండ్కేర్ కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. ఒమన్‌కు బయలుదేరే ముందు మీడియాతో కెపె్టన్ జ్యోతి సింగ్ మాట్లాడుతూ జట్టు ఆత్మవిశ్వాసంతో సిద్ధమైందని, కొన్ని నెలలుగా జట్టు సన్నాహాల్లో చెమటోడ్చుతుందని తెలిపింది. అక్కడే ఉన్న పురుషుల జట్టు నాకౌట్‌కు చేరడం ఆనందంగా ఉందని, మేం కూడా వారిలాగే రాణిస్తామని ఆశాభావం వ్యక్తం చేసింది. -
సంచలనం.. 34 పరుగులకే ఆలౌట్; భారత్ ఘన విజయం
ఏసీసీ వుమెన్స్ ఎమర్జింగ్ ఆసియా కప్‌లో సంచలనం చోటుచేసుకుంది. లీగ్‌లో భాగంగా మంగళవారం హాంగ్ కాంగ్ వుమెన్స్, ఇండియా వుమెన్స్-ఏ మధ్య మ్యాచ్ జరిగింది. కాగా మ్యాచ్‌లో ఇండియా వుమెన్స్ బౌలర్ల దాటికి హాంగ్‌కాంగ్ కేవలం 34 పరుగులకే ఆలౌట్ అయింది. శ్రేయాంకా పాటిల్ ఐదు వికెట్లతో చెలరేగగా.. పార్శవీ చోప్రా, మన్నత్ కశ్యప్‌లు తలా రెండు వికెట్లు పడగొట్టగా.. తిటాస్ సాదు ఒక వికెట్ తీశాడు. హాంగ్ కాంగ్ బ్యాటర్లలో మరికో హిల్ 14 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. మిగతా పది మంది సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. అందులో నాలుగు డకౌట్లు ఉన్నాయి. అనంతరం బ్యాటింగ్ చేసిన ఇండియా-ఏ వుమెన్స్ 5.2 ఓవర్లలో వికెట్ నష్టపోయి 38 పరుగులు చేసి టార్గెట్‌ను అందుకుంది. గొంగిడి త్రిష 19, ఉమా చెత్రీ 16 పరుగులు చేశారు. టోర్నీలో తొలి మ్యాచ్ ఆడిన ఇండియా-ఏ వుమెన్స్ భారీ విజయం అందుకొని టేబుల్ టాపర్స్‌గా ఉన్నారు. Patil’s 5-fer demolishes Hong Kong! Put into bat, the 🇭🇰 batters had no answers to the Indian spinners - ending with just 34 runs. The 🇮🇳 top order completed the chase with over 14 overs to spare! #WomensEmergingTeamsAsiaCup #ACC pic.twitter.com/8e11IyECs5 — AsianCricketCouncil (@ACCMedia1) June 13, 2023 Shreyanka Patil was terrific today! She picked up 5 wickets and conceded just 2 runs. Her splendid spell has put India ‘A’ in the drivers seat at the break! #WomensEmergingTeamsAsiaCup #ACC pic.twitter.com/UqF0HPd3Xs — AsianCricketCouncil (@ACCMedia1) June 13, 2023 చదవండి: ఔను.. ఇంగ్లండ్‌లోనే ఎందుకు జరగాలి? వేరే పిచ్ పెట్టాల్సిందే.. పెరుగుతున్న మద్ధతు -
Junior Asia Cup 2023: ఫైనల్లో భారత్
సలాలా (ఒమన్): ఆసియా కప్ జూనియర్ హాకీ టోర్నమెంట్లో డిఫెండింగ్ చాంపియన్ భారత్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. దక్షిణ కొరియాతో బుధవారం జరిగిన తొలి సెమీఫైనల్లో టీమిండియా 9–1 గోల్స్ తేడాతో ఘనవిజయం సాధించింది. భారత్ తరఫున ధామి బాబీ సింగ్ (31వ, 39, 55వ ని.లో) మూడో గోల్స్ సాధించగా... సునీల్ లాక్రా (13వ ని.లో), అరైజీత్ సింగ్ (19వ ని.లో), అంగద్‌బీర్ సింగ్ (34వ ని.లో), ఉత్తమ్ సింగ్ (38వ ని.లో), విష్ణుకాంత్ సింగ్ (51వ ని.లో), శ్రద్ధానంద్ తివారీ (57వ ని.లో) ఒక్కో గోల్ అందించారు. కొరియా తరఫున కియోన్యోల్ వాంగ్ (46వ ని.లో) ఏకైక గోల్ చేశాడు. పాకిస్తాన్, మలేసియా జట్ల మధ్య రెండో సెమీఫైనల్ విజేత జట్టుతో నేడు జరిగే ఫైనల్లో భారత్ తలపడతుంది. -
ఎదురులేని భారత్
సెమీస్‌లో జపాన్‌పై 6-1తో గెలుపు నేడు పాకిస్తాన్‌తో టైటిల్ పోరు క్వాంటన్ (మలేసియా): ప్రత్యర్థి ఎవరైనా దూకుడైన ఆటతీరుతో అదరగొడుతోన్న భారత యువ హాకీ జట్టు జూనియర్ పురుషుల హాకీ టోర్నమెంట్లో టైటిల్ పోరుకు అర్హత సాధించింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో భారత్ 6-1 గోల్స్ తేడాతో జపాన్ను చిత్తు చేసింది. ఏకపక్షంగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఆద్యంతం టీమిండియా ఆటగాళ్లు ఆధిపత్యం కనబరిచారు. లీగ్ దశలో అజేయంగా నిలిచిన భారత్ అదే జోరును నాకౌట్ దశలోనూ పునరావృతం చేసింది. ఆట 12వ నిమిషంలో మన్దీప్ సింగ్ గోల్‌తో భారత్ ఖాతా తెరిచింది. తర్వాతి నిమిషంలోనే మన్‌ప్రీత్ జూనియర్ చేసిన గోల్‌తో భారత్ 2-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. పది నిమిషాల తర్వాత హర్మన్‌ప్రీత్ సింగ్ పెనాల్టీ కార్నర్‌ను లక్ష్యానికి చేర్చడంతో భారత్ 3-0తో ముందంజ వేసింది. 27వ నిమిషంలో విక్రమ్‌జీత్ సింగ్ గోల్ చేయడంతో విరామ సమయానికి భారత్ 4-0తో తిరుగులేని ఆధిక్యాన్ని సంపాదించింది. ద్వితీయార్ధంలోనూ భారత్ తన జోరును కొనసాగించింది. 48వ నిమిషంలో హర్మన్‌ప్రీత్ సింగ్, 64వ నిమిషంలో వరుణ్ కుమార్ ఒక్కో గోల్ చేశారు. జపాన్ తరఫున 44వ నిమిషంలో షోటా యమాదా ఏకైక గోల్ సాధించాడు. ఆదివారం జరిగే ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో భారత్ అమీతుమీ తేల్చుకుంటుంది. రెండో సెమీఫైనల్లో పాకిస్తాన్ ‘షూటౌట్’లో 8-7తో దక్షిణ కొరియాను ఓడించింది. నిర్ణీత సమయం ముగిసేలోపు రెండు జట్లు 2-2తో సమఉజ్జీగా నిలిచాయి. విజేతను నిర్ణయించడానికి పెనాల్టీ షూటౌట్లో పాకిస్తాన్ పైచేయి సాధించింది. -
భారత్ + జపాన్
జూనియర్ ఆసియా కప్ తొలి సెమీస్ నేడు కాంటమ్ (మలేసియా): లీగ్ దశలో వరుస విజయాలతో హోరెత్తించిన భారత జూనియర్ హాకీ జట్టు... ఆసియా కప్‌లో కీలక పోరుకు సిద్ధమైంది. శనివారం జరిగే తొలి సెమీఫైనల్లో జపాన్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ టోర్నీలో అన్ని రంగాల్లో అద్భుతమైన ఆటతీరును ప్రదర్శిస్తుండటంతో కుర్రాళ్లలో ఆత్మవిశ్వాసం అమాంతం పెరిగిపోయింది. దీంతో జపాన్‌పై కూడా ఇదే జోరును కనబర్చాలని ప్రయత్నిస్తున్నారు. లీగ్ తొలి మ్యాచ్‌లో జపాన్ను 2-1తో భారత్ ఓడించడం ఇప్పుడు కలిసొచ్చే అంశం. అలాగే ఆఖరి లీగ్‌లో ఒమన్‌పై 9 గోల్స్ చేయడంతో ఆటగాళ్లందరూ మంచి ఫామ్‌లోకి వచ్చారు. ఈ టోర్నీలో ఇప్పటి వరకు 9 గోల్స్ చేసిన డ్రాగ్‌ఫ్లికర్ హర్మన్‌ప్రీత్ సింగ్ ఈ మ్యాచ్‌లో కీలకం కానున్నాడు.


