Asia Cup 2026 Final: చరిత్ర సృష్టించిన భారత ఓపెనర్‌ | Womens Asia Cup 2026 Final: Shafali Verma 24 Ball 50 Scripts History | Sakshi
Sakshi News home page

Asia Cup 2026 Final: చరిత్ర సృష్టించిన భారత ఓపెనర్‌

Sep 13 2026 9:47 PM | Updated on Sep 13 2026 9:53 PM

Womens Asia Cup 2026 Final: Shafali Verma 24 Ball 50 Scripts History

షఫాలీ వర్మ (PC: BCCI Women X)

భారత యువ క్రికెటర్‌ షఫాలీ వర్మ చరిత్ర సృష్టించింది. ఆసియా కప్‌ మహిళల టోర్నమెంట్లో ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీ సాధించిన ప్లేయర్‌గా నిలిచింది. దుబాయ్‌ వేదికగా శ్రీలంకతో ఆదివారం నాటి ఆసియా టీ20 కప్‌-2026 ఫైనల్‌ సందర్భంగా 22 ఏళ్ల షఫాలీ వర్మ ఈ ఘనత సాధించింది.

శ్రీలంతో టైటిల్‌ పోరులో టాస్‌ గెలిచిన భారత్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఈ క్రమంలో ఆది నుంచే దూకుడుగా ఆడిన ఓపెనర్‌ షఫాలీ వర్మ 24 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకుంది. అయితే, భారత ఇన్నింగ్స్‌లో చముడి ప్రబోద బౌలింగ్‌లో పదమూడో ఓవర్‌ ఐదో బంతికి.. చమరి ఆటపట్టుకు క్యాచ్‌ ఇవ్వడంతో షఫాలీ అవుటైంది.

షఫాలీతో పాటు స్మృతి కూడా
మొత్తంగా 39 బంతులు ఎదుర్కొన్న షఫాలీ వర్మ 68 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద తొలి వికెట్‌గా వెనుదిరిగింది. ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌ ఇన్నింగ్స్‌లో తొమ్మిది ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. ఇక మరో ఓపెనర్‌ స్మృతి మంధాన కూడా హాఫ్‌ సెంచరీ (39 బంతుల్లో 59) సాధించింది.

భారత్‌ స్కోరు ఎంతంటే?
మిగిలిన వారిలో కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ 14 పరుగులు చేయగా.. వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిచా ఘోష్‌ 17 పరుగులు చేసింది. ఆఖర్లో కమలిని 5 బంతుల్లో 15 పరుగులతో అజేయంగా నిలిచింది. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయిన భారత్‌.. 183 పరుగులు చేసింది.శ్రీలంక బౌలర్లలో మిథాలి అయోధ్య, కెప్టెన్‌ చమరి ఆటపట్టు, చముడి ప్రబోద తలా ఒక వికెట్‌ దక్కించుకున్నారు.

మహిళల ఆసియా టీ20 కప్‌ టోర్నీలో ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీలు
👉షఫాలీ వర్మ- 24 బంతుల్లో- దుబాయ్‌ వేదికగా 2026లో శ్రీలంక మీద
👉స్మృతి మంధాన- 25 బంతుల్లో- సెల్హైట్‌ వేదికగా 2022లో శ్రీలంక మీద
👉రిచా ఘోష్‌- 26 బంతుల్లో- దంబుల్లా వేదికగా 2024లో యూఏఈ మీద
👉షఫాలీ వర్మ- 26 బంతుల్లో- దంబుల్లా వేదికగా 2024లో నేపాల్‌ మీద
👉షఫాలీ వర్మ- 26 బంతుల్లో- దుబాయ్‌ వేదికగా 2026లో థాయ్‌లాండ్‌ మీద.

చదవండి: అదరగొట్టిన బుమ్రా.. అరుదైన ఘనత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement