టీమిండియాకు ఊహించని షాక్‌ | ICC Punishes India Player Amid Womens Asia Cup Triumph | Sakshi
Sakshi News home page

టీమిండియాకు ఊహించని షాక్‌

Sep 14 2026 6:34 PM | Updated on Sep 14 2026 6:34 PM

ICC Punishes India Player Amid Womens Asia Cup Triumph

source: BCCI X

మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్లో శ్రీలంకపై ఘన విజయం సాధించి టైటిల్‌ కైవసం చేసుకున్న టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. వికెట్‌ తీసిన అనంతరం దూకుడుగా సంబురాలు చేసుకున్నందుకు స్టార్‌ పేసర్‌ క్రాంతి గౌడ్‌పై ఐసీసీ చర్యలు తీసుకుంది. మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానాతో పాటు ఓ డీమెరిట్‌ పాయింట్‌ కేటాయించింది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆదివారం శ్రీలంకతో జరిగిన ఫైనల్లో క్రాంతి గౌడ్‌ తొలి ఓవర్‌లోనే ఇమేషా దులానిని క్లీన్ బౌల్డ్ చేసింది. వికెట్‌ తీసిన ఆనందంలో ఆమె దూకుడుగా సంబరాలు చేసుకుంది. ఈ సందర్భంగా క్రాంతి ప్రదర్శించిన హావభావాలపై ఐసీసీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ చర్య ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్‌లోని లెవల్-1 నిబంధనను ఉల్లంఘన కిందికి వస్తుందని తెలిపింది.

వికెట్‌ తీసిన తర్వాత అతడిని లేదా ఆమెను అవమానించేలా, లేదా దూకుడుగా స్పందించేలా ప్రేరేపించే భాష, చర్యలు లేదా హావభావాలు చేయడాన్ని నిబంధనల ఉల్లంఘనగా పరిగణిస్తారు. దీంతో ఐసీసీ క్రాంతి గౌడ్‌పై చర్యలు తీసుకుంది. 24 నెలల వ్యవధిలో ఆమెకు ఇది తొలి తప్పిదం కావడంతో జరిమానాతో పాటు ఒక డీమెరిట్ పాయింట్‌తో సరిపెట్టారు.

తనపై వచ్చిన అభియోగాన్ని క్రాంతి అంగీకరించడంతో ప్రత్యేకంగా ఫార్మల్ హియరింగ్ నిర్వహించాల్సిన అవసరం రాలేదని ఐసీసీ వెల్లడించింది. కాగా, నిన్న జరిగిన ఫైనల్లో భారత్‌ శ్రీలంకపై 72 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి రికార్డు స్థాయిలో ఎనిమిదోసారి ఆసియా కప్‌ను కైవసం చేసుకుంది. 
ఇదీ చదవండి: పాకిస్తాన్‌కు మరో భారీ షాక్‌


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement