దేశవ్యాప్తంగా బొజ్జ గణపయ్య వేడుకలు ఘనంగా జరుగుతుండగా, తమిళనాడులోని తిరునెల్వేలిలో ఒక బిర్యానీ దుకాణం యజమానికి భారీ షాక్ తగిలింది. గణేశుడిని అవమానించాడనే ఆరోపణల కింద పోలీసులు అరెస్ట్ చేశారు. ఏమైంది అంటే..
తమిళనాడులోని పలు నగరాల్లో వినాయక విగ్రహాలను ప్రతిష్టించి ప్రత్యేక ప్రార్థనలతో వాతావరణం సందడిగా ఉంది. ఇంత కోలాహలం మధ్య తిరునెల్వేలిలోని బిర్యానీ దుకాణం యజమాని 30 ఏళ్ల జయంత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దుకాణం బయటగణపతి బిర్యానీ తింటున్నట్లుగా ఒకబ్యానర్ ఏర్పాటు చేసిశాడు.ఇదే వివాదానికి దారి తీసింది. మతపరమైన మనోభావాలను దెబ్బతీశాడంటూ 42 ఏళ్ల సెల్వరాజ్ అనే వ్యక్తి ఈ ఫిర్యాదు చేశారు. దీంతో ఈ పరిణామం చోటు చేసుకుంది.
తమిళనాడులో వాడవాడలా వినాయక చతుర్థి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. చెన్నైలోని కపాలీశ్వరర్ ఆలయంలో ఉదయం గణపతి హోమంతో వేడుకలు ప్రారంభమయ్యాయి. నర్తన వినాయకర్ విగ్రహానికి ప్రత్యేక అభిషేకం నిర్వహించి, బంగారు కవచంతో అలంకరించారు.మధురై మీనాక్షి సుందరేశ్వరర్ ఆలయంలో 7 అడుగుల ఎత్తైన ముక్కురుణి వినాయకుడికి ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తుల కోసం భారీ ముక్కురుణి కొడకట్టై (కుడుములు) తయారు చేశారు. తిరుచిరాపల్లిలో రాక్‌ఫోర్ట్ పై ఉన్న ఈ ఆలయంలో 417 మెట్లు ఎక్కి వేలాది మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. 25 కేజీల కుడుము నైవేద్యంతో 14 రోజుల పెరువిళా వేడుకలు ప్రారంభమయ్యాయి.
అంతేకాదు తిరువన్నామలైలో 51,000 రుద్రాక్షలతో తయారు చేసిన గణేశ విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.మధురైలో దర్భ గడ్డితో తయారు చేసిన వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కోయంబత్తూర్‌లో కోయంబత్తూర్‌లో రూ. 5 లక్షల విలువైన 500 రూపాయల నోట్లతో కూడిన దండతో విగ్రహాన్ని అలంకరించగా, చెన్నైలోని టి.నగర్‌లో కరెన్సీ నాణేలతో చేసిన విగ్రహం అందరినీ ఆకట్టుకుంది.
కాగా తమిళనాడు వ్యాప్తంగా నిమజ్జన ఊరేగింపులు సెప్టెంబర్ 19, 20 తేదీల్లో జరగనున్నాయి. ఇందుకోసం పెద్ద ఎత్తున పోలీసు బలగాలను వినియోగించనున్నారు. పర్యావరణ నిబంధనల దృష్ట్యా పట్టినాబాక్కం, నీలంకరై బీచ్‌లలోని సాంప్రదాయ నిమజ్జన ప్రాంతాలపై ఆంక్షలు కొనసాగుతున్నాయి.


