ఇంగ్లండ్ హెడ్ కోచ్‌గా జొనాథన్ ట్రాట్ | Jonathan Trott appointed head coach of England Lions | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్ హెడ్ కోచ్‌గా జొనాథన్ ట్రాట్

Sep 22 2026 7:18 AM | Updated on Sep 22 2026 7:18 AM

Jonathan Trott appointed head coach of England Lions

source: X

ఇంగ్లండ్ మాజీ బ్యాటర్ జొనాథన్ ట్రాట్‌కు కీలక బాధ్యతలు అప్పగించింది ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ECB). రాబోయే శీతాకాల సీజన్‌కు ఇంగ్లండ్ లయన్స్ జట్టు హెడ్ కోచ్‌గా అతడిని నియమించింది. ఈ విషయాన్ని ఈసీబీ సోమవారం (సెప్టెంబర్ 21) అధికారికంగా ప్రకటించింది.

ట్రాట్‌ దీనికి ముందు ఆఫ్ఘనిస్తాన్‌ జాతీయ జట్టు హెడ్‌ కోచ్‌గా పని చేశాడు. 2026 టీ20 ప్రపంచకప్‌లో ఆఫ్ఘనిస్తాన్ ప్రస్థానం ముగిసిన అనంతరం ఆ జట్టు హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకున్నాడు. 2022లో ఆఫ్ఘనిస్తాన్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన ట్రాట్‌.. నాలుగేళ్ల పాటు ఆ జట్టుకు సేవలందించాడు. అతడి కోచింగ్‌లోనే ఆఫ్ఘనిస్టాన్ తొలిసారి (2024 టీ20 ప్రపంచకప్‌) సెమీఫైనల్‌కు చేరి చరిత్ర సృష్టించింది.

అంతకుముందు ట్రాట్‌ ఇంగ్లండ్ జాతీయ జట్టు అసిస్టెంట్ కోచ్‌గా పనిచేశాడు. ఇటీవల శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లోనూ ఇంగ్లండ్ లయన్స్‌కు తాత్కాలిక హెడ్ కోచ్‌గా వ్యవహరించాడు. ఈ సిరీస్‌ను ఇంగ్లండ్ లయన్స్ 2-0తో కైవసం చేసుకుంది. తాజాగా అతడికి పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించారు. రాబోయే శీతాకాల సీజన్‌లో ఇంగ్లండ్ లయన్స్ జట్టు వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, శ్రీలంక దేశాల్లో పర్యటించనుంది.

45 ఏళ్ల ట్రాట్ ఇంగ్లండ్‌ తరఫున 52 టెస్టులు, 68 వన్డేలు, 7 టీ20 మ్యాచ్‌లు ఆడి దాదాపు 7000 పరుగులు చేశాడు. ఇందులో 13 సెంచరీలు, 42 అర్ద సెంచరీలు ఉన్నాయి. 

ఇదీ చదవండి: సీఎస్‌కే హెడ్‌కోచ్‌గా జహీర్‌ ఖాన్‌


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement